YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 27 August 2012

అవినీతి పార్టీగా కాంగ్రెస్ 54%, బీజేపీ46%

న్యూఢిల్లీ: మధ్యంతర ఎన్నికలు వచ్చినట్లయితే అవినీతి అంశమే కీలకంగా మారనున్నదని ఎన్డీటీవీ సర్వేలో వెల్లడైంది. ఏ అంశం కీలకంగా మారుతుందని ఎన్డీటీవీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎక్కుమంది అవినీతి అని తేల్చేశారు. అవినీతి అంశంపై ఎన్డీటీవీ సర్వే ఫలితాలలో కాంగ్రెస్‌ అవినీతిపార్టీ - 54 శాతం మంది తేల్చేయగా.. బీజేపీ అవినీతిపార్టీ అని 46 శాతం మంది పేర్కోన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో రాజస్థాన్‌లో 70శాతం మేరకు ఎక్కువ అవినీతి జరిగిందని, బీజేడీ పాలిత ఒరిస్సాలో అవినీతి - 60శాతమని, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో అవినీతి 59శాతమని, కర్ణాటకలో అవినీతి 58శాతమని సర్వేలో తెలిపారు. అవినీతి, నిరుద్యోగం, పేదరికం, తీవ్రవాదం, ధరల పెరుగుదల అంశాలే కీలకంగా మారనున్నాయని వెల్లడైంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!