మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించనున్నట్టు తాజా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించనున్నట్టు తాజా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రంలో ఎక్కుమంది ప్రజలు కోరుకుంటున్నారని జాతీయ టెలివిజన్ ఛానల్ ఎన్ డీటీవీ ప్రైమ్ టైమ్ కార్యక్రమంలో సర్వే ఫలితాలను వెల్లడించారు. జాతీయ స్థాయిలో అవినీతి పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీని మధ్యంతర ఎన్నికల్లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కే పరిమితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అత్యంత ప్రజాదరణ ఉన్న నేత జగన్మోహన్ రెడ్డేనని ప్రజలు ముక్త కంఠంతో తీర్పు నిచ్చేందుకు ఎదురు చూస్తున్నారని సర్వే తెలిపింది. రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 21 స్థానాల్ని గెలుచుకుంటుందని ఎన్డీటీవీ సర్వే వెల్లడించింది.
రాష్ట్రంలో మహానేత కు అసలైన వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు భావిస్తున్నారని గత ఉప ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత టెలివిజన్ చానెల్ సర్వేలో వెల్లడవ్వడం ప్రజా స్పందనకు దర్పణం. అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోనేందుకు కాంగ్రెస్ వద్ద అస్త్రాలు (వెపన్స్), వ్యూహాలు ఉన్నాయని ఎన్డీటీవీ సర్వే ఫలితాలపై విశ్లేషణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కార్యక్రమం చర్చలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అస్త్రాలు, ఆయుధాలలో సీబీఐ ఒకటా అని మొయిలీని ప్రశ్నించారు. దాంతో కంగారుపడిన మొయిలీ.. తమ వద్ద రాజకీయ అస్త్రాలున్నాయని తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చేదిలేదని గతంలో జగన్ చెప్పిన వ్యాఖ్యల్ని వైఎస్ భారతీరెడ్డి మరోసారి ఎన్డీటీవీ విశ్లేషణ సందర్భంగా జరిగిన చర్చలో స్పష్టం చేశారు. గత ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఎన్డీటీవీ సర్వే ఫలితాలు అద్దం పట్టాయన్నారు. మధ్యంతర ఎన్నికల్లో అవినీతి అంశమే కీలకంగా మారిందని.. జగన్ పై వస్తున్నఆరోపణలను ఎలా చూస్తారనే ప్రశ్నకు భారతీ సమాధానమిస్తూ.. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు జగన్ వెంటే ఉన్నారని.. అంతేకాకుండా భగవంతుడు అన్ని చూస్తున్నారని.. ఓ కొడుకుగా, అన్నగా, ఓ మనవడిగా జగన్ ను ప్రజలు ఆదరిస్తున్నారు అని అన్నారు.
అవినీతి, కుంభకోణాలతో పీకల్లోతు కూరుకుపోయి.. ప్రభుత్వ ప్రతిష్ట మసక బారి.. దేశంలో వివిధ ప్రాంతాల్లో పతనానికి అంచున ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో మట్టికరువనుందని ప్రమాదకరమైన సంకేతాలు ఇటీవల అనేక సందర్భాల్లో వెల్లడైనాయి. ప్రస్తుత సర్వే ఫలితాలు కూడా అదే విషయాన్ని ధృవీకరించాయి. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని 48 శాతం మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఎదురు చూస్తున్నారనేది జగమెరిగిన సత్యం.
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం.... విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న వేళ....ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ ఎన్ డీ టీవీ మధ్యంతర ఎన్నికలపై సర్వే నిర్వహించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 125 నియోజకవర్గాల్లో 30 వేల మంది ఓటర్లనూ సర్వే చేశారు. IPSOS సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో... ఎన్నికలను ప్రభావితం చేసే ప్రధాన అంశం అవినీతి అని ఓటర్లు ముక్తకంఠంతో చెప్పారు. 'మిడ్‌టర్మ్ పోల్ 2012' పేరుతో చేపట్టిన ఈ సర్వేలో దేశాన్ని పీడీస్తున్న సమస్యల్లో అవినీతి మొదటి స్థానంలో నిలువగా తర్వాత స్థానాల్లో నిరుద్యోగం, పేదరికం, టెర్రరిజం, నక్సలిజం, ధరలు నిలిచాయి. |
|
No comments:
Post a Comment