బీజేపీ కూడా అంతే అవినీతిమయమన్న జనం
నాలుగు రాష్ట్రాల సర్వే ఫలితాల వెల్లడి
దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ కాంగ్రెస్ అని ప్రముఖ జాతీయ టీవీ చానల్ ఎన్‌డీటీవీ నిర్వహించిన ఒక సర్వేలో ప్రజలు తీర్పు చెప్పారు. అదే సమయంలో బీజేపీ కూడా దాదాపు అంతే అవినీతిమయమైన పార్టీగా పేర్కొన్నారు. కాంగ్రెస్ అవినీతి మయమైన పార్టీ అని 54 శాతం మంది చెప్తే.. బీజేపీ అవినీతిమయమైన పార్టీ అని 46 శాతం మంది చెప్పారు. అవినీతి విషయంలో అన్ని పార్టీలూ దాదాపు సమానమేనని జనం భావిస్తున్నట్లు తేలింది. 2జీ స్కాం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం తర్వాత తాజాగా బొగ్గు కుంభకోణంపై పార్లమెంటు స్తంభించిన నేపథ్యంలో కేంద్రంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 2012లో మధ్యంతర ఎన్నికలు వస్తే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు ప్రజాదరణ ఎలా ఉంది? అన్న అంశాలపై ఎన్‌డీటీవీ ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ ఇప్సాస్ ద్వారా సర్వే నిర్వహించింది.
దేశవ్యాప్తంగా 18 పెద్ద రాష్ట్రాల్లో 125 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 30,000 మందిని ఈ శాంపిల్ సర్వేలో ప్రశ్నించినట్లు ఎన్‌డీటీవీ వివరించింది. ప్రతి నియోజకవర్గంలోనూ రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 100 మందిని వారి వారి ఇళ్లలో ప్రశ్నించినట్లు తెలిపింది. ఈ సర్వే ఫలితాలను సోమవారం నుంచి ప్రసారం చేయటం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల ఫలితాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పింది. ఒడిశాలో నవీన్‌పట్నాయక్ (బీజేడీ) వరుసగా నాలుగోసారీ అధికారంలోకి వస్తారని పేర్కొంది. రాజకీయ అంశాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన అంశాలపైనా సర్వే చేశారు.

No comments:
Post a Comment