జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
19-1-2012 గురువారం
అచ్చంపేట మండలం
* తాళ్లచెరువు నుంచి యాత్ర ప్రారంభం
* కొత్తపల్లిలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* చెరుకుంపాలెంలో విగ్రహావిష్కరణ
* తాడువాయిలో విగ్రహావిష్కరణ
* చల్లగరిగలో విగ్రహావిష్కరణ
* గింజుపాలెంలో విగ్రహావిష్కరణ
* మాదిపాడులో విగ్రహావిష్కరణ
రైతు సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా మునగోడులో ఐదు చోట్ల మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు గిట్టు బాటు ధరలు లభించడం లేదని, రైతు కూలీలకు సరైన కూలీ దొరకక వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 నెలలుగా రాష్ట్రంలో వ్యవసాయశాఖకు మంత్రి కూడా లేని పరిస్ధితి నెలకొందన్నారు. మరోవైపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదన్నారు. 108, 104 అంబులెన్స్‌లను నిర్లక్ష్యం చేస్తున్నారని, వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కత్తిరించేందుకే పాలకులు యోచిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బయ్యవరం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామానికి చేరుకున్న జగన్ కు అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్ధులపై ఒత్తిడి తెస్తున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులతో పాటు పేదవారి ఆరోగ్యాన్ని పాలకులు గాలికి వదిలేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment