రైతు సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్‌మోహన రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా మునగోడులో ఐదు చోట్ల మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు గిట్టు బాటు ధరలు లభించడం లేదని, రైతు కూలీలకు సరైన కూలీ దొరకక వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 నెలలుగా రాష్ట్రంలో వ్యవసాయశాఖకు మంత్రి కూడా లేని పరిస్ధితి నెలకొందన్నారు. మరోవైపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదన్నారు. 108, 104 అంబులెన్స్‌లను నిర్లక్ష్యం చేస్తున్నారని, వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కత్తిరించేందుకే పాలకులు యోచిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలోని మునుగోడుకు చేరుకున్నారు. మునుగోడు గ్రామంలో గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. మునుగోడు చిన్న గ్రామమే అయినా గ్రామస్థులు ఐదు విగ్రహాలను నెలకొల్పారు. రాజన్న తనయుడ్ని చూడాలని.. అతని మాటలు వినాలని జనం భారీగా తరలివచ్చారు. అంతకు ముందు జగన్ చర్చీలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
No comments:
Post a Comment