కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమయ్యే ప్రశ్నే లేదని, అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ సీపీ విలీనం వార్తలు కేవలం దుష్ప్రచారం మాత్రమేనని వారు కొట్టిపారేశారు. తమ పార్టీలో ఎవ్వరికీ అవమానం జరుగలేదని, ఓ వర్గం మీడియా కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ నేతలను చాటుగా కలుస్తున్న చంద్రబాబే కాంగ్రెస్ లో చేరతారని అన్నారు. ప్రతిపక్ష బాధ్యతలను చంద్రబాబు పూర్తిగా మరిచారని విమర్శించారు. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే చంద్రబాబు పాదయాత్ర జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చంద్రబాబే పెద్ద సలహాదారని వారన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కనీసం 30 రోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలకు సీఎం కిరణ్ భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి జగన్ ను జైలుకు పంపాయని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ కీలక నేతగా జగన్ ఎదుగుతారని ధర్మాన కృష్ణదాస్, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. |
Sunday, 9 September 2012
'విలీనం'పై దుష్ప్రచారం: వైఎస్సార్ సీపీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment