YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 28 October 2012

ఏలూరు ప్రజలను సీఎం మోసం చేశారు: నాని

శనివారపుపేట: ఏలూరు ప్రజలను సీఎం కిరణ్ మోసం చేశారని ఎమ్మెల్యే ఆళ్ల నాని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని శనివారపుపేటలో ఎమ్మెల్యే ఆళ్ల నాని చేపట్టిన పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ..పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రచ్చబండలో సీఎం హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకూ ఆ హామీని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. వైఎస్ఆర్‌ హయాంలో 10 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారని.. ఆయన మరణం తర్వాత పథకాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయితేనే పేదల కష్టాలు తొలిగిపోతాయని ఎమ్మెల్యే ఆళ్లనాని అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!