కందుకూరు: మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల టిడిపి అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కిరణ్ ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టడం ఏమోగానీ ..విశ్వాస తీర్మానం పెడతాడేమోనని ఎద్దేవా చేశారు. ప్రజలను కాల్చి చంపిన పోలీసులను పరామర్శించడానికి వెళ్లిన ఘనుడు బాబు అని విమర్శించారు .కందుకూరులో మాట్లాడిన షర్మిల ప్రభుత్వం చేతగానితనంపై మండిపడ్డారు.
వైఎస్ఆర్ ప్రజల గురించి ఎలా ఆలోచించేవారో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగాను రైతులను ఆదుకోవడంలేదని విమర్శించారు. ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందడంలేదన్నారు. ఆరోగ్య శ్రీని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కాంగ్రెస్, టిడిపి నాయకులకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తారా అని ప్రశ్నించారు.

No comments:
Post a Comment