హైదరాబాద్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కె.గురునాథ్‌రెడ్డి కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి (జగ్గప్ప) తన అనుచరులతో కలసి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆయనకు కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తనకు తొలి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలంటే చాలా అభిమానమని అందుకే పార్టీలో చేరుతున్నానని చెప్పారు. తమ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. కాగా, జగదీశ్వర్‌రెడ్డి తండ్రి కె.గురునాథ్‌రెడ్డి కొడంగల్ నుంచి ఐదుసార్లు కాంగ్రెస్ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment