హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సోదరుడు ప్రకాష్‌రెడ్డి కుమార్తె అపూర్వల వివాహ వేడుక శనివారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 5.14 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు, రాష్ట్ర మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, కె.జానారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి, ముఖేష్, శత్రుచర్ల విజయరామరాజు, కె.పార్థసారథి, వట్టి వసంతకుమార్, డీజీపీ వి.దినేష్‌రెడ్డి, లక్ష్మీపార్వతి, సినీ నటులు కృష్ణ, విజయనిర్మల, నరేష్, దర్శకుడు దాసరి నారాయణరావుతోపాటు పలువురు వివాహ విందుకు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
No comments:
Post a Comment