మైనారిటీల సంక్షేమానికి కిరణ్ సర్కార్ వెలగబెట్టింది ఏమిలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మైనారిటీ విషయంలో ప్రభుత్వం చూపుతున్న వైఖరిపై అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల సంక్షేమానికి పాటుపడింది.. రిజర్వేషన్లను ఇచ్చింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన సభలో గుర్తు చేశారు. మైనారిటీల సంక్షేమానికి వైఎస్ స్పందించిన తీరును సభ దృష్టికి అక్బరుద్దీన్ తీసుకు వచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమం కోసం కేవలం 56 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన విమర్శించారు. మైనారిటీల సంక్షేమం విషయంలో కిరణ్ సర్కార్ కంటే.. పొరుగున ఉన్న కర్నాటక బీజేపీ సర్కారే నయమన్నారు. వక్ఫ్ భూముల ఆక్రమణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. |
Wednesday, 29 February 2012
Credit goes to YSR : MIM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment