ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న 70వ రోజు ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ గరికపాడులో పర్యటించారు. గరికపాడు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి వేసుకోవడం కంటే.. ఉరి వేసుకోవడం మేలని రైతులుచెబుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్‌ఆర్ బతికే ఉంటే తమకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోందని ఆయన అన్నారు. అంతేకాక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలు అంతా అనుకుంటున్నారని జగన్ అన్నారు. అనుకున్న సమయానికన్నా ఐదు గంటల లే టైనప్పటికీ.. జగన్ కోసం ప్రజలు ఓపిగ్గా ఎదురు చూశారు.
No comments:
Post a Comment