రైతుల వద్దకు వెళ్లడానికి ముఖం చెల్లకే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష చంద్రబాబు కుమ్మక్కై సహకార ఎన్నికలు వాయిదా వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. రైతులకు వెన్నుదన్నుగా ఉండే సహకార సంస్థలకు ఎన్నికలు జరపకుండా నిర్విర్యం చేస్తున్నా...ప్రతిపక్ష చంద్రబాబు కిమ్మడం లేదని విమర్శించారు. ఎన్నికల గడువు ముగిసి ఆరునెలలు పూర్తయిన, మరో ఏడాదిపాటు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం పొడగిస్తున్నా ప్రతిపక్ష టీడీపీ నోరుమెదపడంలేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘వ్యవసాయానికి సహకారరంగం రైతులకు భరోసా అంటూ దివంగత వైఎస్‌ఆర్ చెబుతుండేవారు. అదే విధంగా ఆయన పాలన కూడా వ్యవసాయాన్ని గుండెకాయ చేసుకొని సాగింది. కానీ ప్రస్తుతం ఆయన తెచ్చిన ప్రభుత్వమే సహకార రంగాన్ని నిర్విర్యం చేస్తోంది. ఎన్నికల కాలం పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా... వాటిని నిర్వహించకుండా కిరణ్ ప్రభుత్వం పొడగిస్తోంది. రైతులకు రైతు పాలన ఇవ్వకుండా వారిపై అధికారులను బలవంతగా రుద్దుతున్నారు. కిరణ్ పాలన అచ్చం 2004కు ముందున్న చంద్రబాబు హయాంను గుర్తుచేస్తుంది’’ అని ధ్వజమెత్తారు. రైతులకు కిరణ్-చంద్రబాబులు చేసిన ద్రోహం కళ్లముందు కనబడుతుందని, అందుకే వారిద్దరూ అన్నదాత వద్దకు వెళ్లలేకపోతున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో రైతులకు చేసిన అన్యాయాలను వివరించారు. ‘‘సహకార బ్యాంకులు రైతులకిచ్చే రుణాలపై వడ్డీ 13 శాతం ఉండేది. దాన్ని ఎన్టీఆర్ తన హయాంలో ఆరున్నర శాతం తగ్గించారు. ఆతర్వాత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులను పీల్చిపిప్పి చేసి 13 శాతం వడ్డీని వారినుంచి బలవంతంగా వసూలు చేశారు. ప్రపంచబ్యాంక్ జీతగాడిగా వాళ్లు చెప్పినట్లు తలూపుతూ రైతుల నడ్డివిరిచారు. సహకార రంగాన్ని పూర్తిగా నిర్విర్యం చేశారు. సభ్యత్వ రుసుము రూ.11 నుంచి ఏకంగా రూ. 900లకు పెంచితే పెద్ద ఎత్తున నిరసన వెళ్లువెత్తడంతో దాన్ని రూ. 300లకు చేసిన ఘనత చంద్రబాబుది’’ అని మండిపడ్డారు. అంతేకాదు ఆయన హయాంలో రైతులు కరెంట్ చార్జీలు చెల్లించకపోతే పీడీ యాక్టు కింద జైళ్లో పెట్టించేందుకు ప్రత్యేక జీవో తెచ్చిన మహానుభావుడని గట్టు ఎద్దేవా చేశారు. వైద్యనాథన్ కమిటీ సిపార్సును అమలు చేయాలి సహకార బ్యాంక్‌లకు సంబంధించి వైద్యనాథన్ కమిటీ చేసిన సిపార్సులను ప్రభుత్వం అమలు చేయాలని గట్టు డిమాండ్ చేశారు. వైద్యనాథన్ సిపార్సు చేసిన రెండు సూచలను దివంగత వైఎస్ తన హయాంలో అమలు చేశారని గుర్తుచేశారు. రూ. 1600 కోట్లకు పైగా నగదును కేంద్ర బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసి ప్రతి రైతుకు వైఎస్ రుణ సదుపాయం కల్పించారన్నారు. షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణం అందిచాలని డిమాండ్ చేశారు. |
Friday, 2 March 2012
Chandrababu nothing done to farmers
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment