ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడి ఖర్చు చేశాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని వాసిరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని పద్మ అనుమానం వ్యక్తం చేశారు. కోవూరు ఉప ఎన్నికలో ప్రజలు విశ్వసనీయతకు ఓటు వేశారని ఆమె అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment