కారుమంచి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ప్రాణాలు కోల్పోయిన అంగడి అచ్చమ్మ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా విజయవాడ నుంచి నేరుగా అచ్చమ్మ ఇంటికి జగన్ చేరుకున్నారు. అచ్చమ్మ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అచ్చమ్మ కుటుంబానికి అండగా ఉంటానని జననేత భరోసానిచ్చారు.
65 ఏళ్ల అచ్చమ్మకు మహానేత వైఎస్‌ఆర్ అంటే ఎనలేని అభిమానం. వైఎస్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు, వృద్ధాప్య ఫించన్ అచ్చమ్మకు లభించింది. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కనిపించడం లేదని తెలిసిన తర్వాత అచ్చమ్మ తల్లడిల్లింది. ఆ రోజంతా ఆవేదనతో కాలం గడిపిని అచ్చమ్మ గుండెపోటుతో మరణించారు.

No comments:
Post a Comment