నాగోలు అగ్నిప్రమాద బాధితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ప్రమాదం గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను వైఎస్ జగన్ ఓదార్చారు. నాగోల్ సాయినగర్‌కాలనీలో చాలాకాలంగా 6 వందల గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా గుడిసెలన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో సంధ్య అనే బాలిక సజీవ దహనం కాగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. ఫైర్ ఇంజన్ సకాలంలో రాకపోవటంతో మంటలను అదుపు చేయలేకపోయారు. సంఘటనా స్థలం ఆలస్యంగా వచ్చిన హోంమంత్రిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సజీవ దహనమైన బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బాధితులకు తక్షణ సాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. |
Sunday, 11 March 2012
YS Jagan consoles families of fire victims
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment