రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకునే నేతలే కరువయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. అధికార కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని పసన్నంచేసుకోవడానికే పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లి బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శనివారం సాయంత్రం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు.
వైఎస్సార్ బతికుంటే గండికోట రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చేవని అన్నారు. సాగునీటి సంగతి అటుంచితే తాగడానికే నీళ్లే లేవన్నారు. రాష్ర్టంలో 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పరీక్షలు వస్తున్నా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఊసే లేదన్నారు. మహానేత ఉండి ఉంటే తమకీ సమస్యలు ఉండేవి కావని ప్రతి ఒక్కరూ అంటున్నారని చెప్పారు.తనపై ప్రేమాభిమానాలు చూపుతున్న వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు.

No comments:
Post a Comment