YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 12 March 2012

YSR Congress Party 1st Anniversary images

రాష్ట్రంలోని ప్రతిపేదవానికీ, రైతుకు ఏడాది కాలంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయుడిగా చేరువైందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. విలువలు, విశ్వసనీయతే తమ పార్టీకి రెండు కళ్లు, ఊపిరని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ప్రథమవార్సికోత్సం సందర్భంగా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. 

‘‘పార్టీ స్థాపించి నేటితో ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఒక సారి ఈ సంవత్సర కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నాన్న చనిపోయి సరిగ్గా 20 రోజులు కూడా కాలేదు. మహానేత వైఎస్ చనిపోయిన ప్రదేశం వద్దకు వెళ్లడం, ఆ నల్ల కాల్వ దగ్గర హెలికాప్టర్ ముక్కలు నా కళ్లలో గుర్తుకు వస్తూనే ఉన్నాయి. ఆ నల్లకాల్వ దగ్గర ఏర్పాటు చేసిన సంతాప సభలో లక్షల మంది సమక్షంలో మాట ఇచ్చాను. నాన్న మరణం తట్టుకోలేక దాదాపు 700 మంది చనిపోయిన కుటుంబాలను కలుస్తానని చెప్పా. నాన్న మరణంతో కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు గుండె ఆగి మరణించారు. నాన్నను పోగొట్టుకున్న బాధలో నేనున్నప్పటికీ, కుటుంబపెద్దని కోల్పోయిన కుటుంబాలు ఎలా ఉంటారని నా గుండెలో అలజడి మొదలైంది. ఆ విధంగా ఆరోజు మాటిచ్చా. ప్రతి ఇంటికి వచ్చి పరామర్శిస్తానని చెప్పా. ఆ తర్వాత మాటను గాలికొదిలేయమని కాంగ్రెస్ పెద్దలు చాలా ఒత్తిడి తెచ్చారు. చివరి ప్రయత్నంగా నేను, అమ్మ కలిసి వెళ్లి సోనియాకు చెప్పి ఒప్పించాలని చూశాం. కానీ ఆమె కుదరదని ఒప్పుకోలేదు’’ అని వివరించారు. 

మాట తప్పి నన్ను నేను హత్య చేసుకోలేను

‘‘కాంగ్రెస్‌లో కొనసాగితే మంత్రి పదవి ఇస్తామని కొందరు చెప్పారు. అలా చేస్తే మాట తప్పి నన్ను నేను హత్య చేసుకున్నట్లవుతుంది. అదే మాదిరిగా కాంగ్రెస్‌ను వీడితే రాజకీయంగా ఆత్మహత్యేనని నాతో చాలా మంది చెప్పారు. మీనాన్న 30 ఏళ్లు కడపలో కాంగ్రెస్‌ను, ఒకే గుర్తును నేర్పించారు. ఎన్నికలోస్తే వచ్చే గుర్తుతో కేవలం 14 రోజుల్లో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తావన్నారు. మీకిచ్చిన గుర్తు ప్రజల్లోకి వెళ్లదు, పైగా కుటుంబాన్ని చీల్చి సొంత చిన్నాన్నే పోటికి రంగంలో దించుతారు. ఇక మీరు రాజకీయంగా ఆత్మహత్యే అవుతుంద ని కొందరు చెప్పారు. అటువంటి పరిస్థితి ఉంటుంది కనుకే ఏ ఒక్క సహచరుడిని నా వెంట రావొద్దని కోరాను. నాతో వస్తే వారిని రాజకీయహత్య చేసినట్లవుతుందని అలా చెప్పా. నేను ఆ వేళ బుర్రతో చేయలేదు. గుండెతో చేశాను. నేను చేస్తున్నది దేవుని దృష్టిలో కరెక్టుగా ఉన్నప్పుడు, ఆ దేవుడుతో పాటు నాన్నను ప్రేమించే ప్రతి గుండె తోడుగా ఉంటుందని భావించా. అది ఈ వేళ నిజమైంది. ఇన్ని కష్టాలు, ఇబ్బందులు సృష్టిస్తున్నా. నేను చిరునవ్వుతో ఉన్నానంటే ఇంత మంది గుండెలు అండగా ఉండటమే’’ అని అన్నారు.

ప్రతి పేదవానిలో నమ్మకం తేగలిగాం

‘‘ఒకే ఒక మాట కార్యకర్తలకు చెప్పదలచుకున్నా. నాన్నను ప్రేమించే ప్రతి గుండెకు చెబుతున్నా. ‘ఎన్నాళ్లు బతికామన్నది కాదు. ఎలా బతికామన్నది ముఖ్యం’ నాయకుడు ఎలా ఉండాలి అంటే , ఆ నాయకుడిని చూసి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకోవాలి. పలానా నాయకుడు మా వాడు, పలానా పార్టీ మాదని చెప్పుకోవాలి. నాన్న ఇచ్చిన స్పూర్తితో మాటకోసం 17 మంది ఎమ్మెల్యేలు పదవులు పోతాయని తెలిసి కూడా మాట కోసం నిలబడ్డారు. ఎన్నాళ్లు బతికామన్నది కాకుండా ఎలా బతికామన్న దాన్ని చేసి చూపించారు. ఇవాళ ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ వ్యక్తులను చూసి ఇలాంటి వారు ఉండాలని పది మంది గర్వపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కాలర్ ఎగిరేసేలా మన పార్టీ ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను.. ఇవాళ రాజకీయ వ్యవస్థ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మన ద్వారా సాధ్యమవుతుందని ప్రతి పేదవానిలో నమ్మకం తేగలిగాం. మన పార్టీకి విలువలు, విశ్వసనీయతే కళ్లు, ఊపిరి’’ అని స్పష్టం చేశారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణలో నేతలు వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, జూపూడి ప్రభాకర్‌రావు, కొల్లి నిర్మలా కుమారి, మారెప్ప, రెహమాన్, జనక్‌ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, ఆదం విజయ్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురాగలమన్న నమ్మకాన్ని తమ పార్టీ కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. విలువలు, విశ్వసనీయత అన్న పదాలే తమ పార్టీకి ఊపిరి, కళ్లు అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. 

ఈ ఏడాది కాలంలో తమ పార్టీ అన్ని వర్గాలకు చేరువయిందని సంతృప్తి వ్యక్తం చేశారు. మార్పు తీసుకురాగలమన్న నమ్మకాన్ని కలిగించామన్నారు. ప్రజలు నమ్మకాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు, బతికినంతకాలం ఎలా బతికామన్నది ముఖ్యమని అన్నారు. ఫలానా వాడు తమ నాయకుడని ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునేలా నేతలుండాలన్నారు. పదవులు పోతాయని తెలిసినా కూడా 17 మంది ఎమ్మెల్యేలు తన వెంట వచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి వారు తమ పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. పేదలు, రైతుల కోసం ఉప ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. 

నల్లకాల్వలో ఇచ్చిన మాటపై నిలబడ్డానని, ఎవరెన్ని చెప్పినా ప్రజలకోసమే పాటు పడ్డానని పేర్కొన్నారు. అభిమానులు, కార్యకర్తల అండతోనే ఎన్ని కష్టాలెదురైనా చిరునవ్వుతో నిలబడ్డానని చెప్పారు. తన వెంట నడిచిన వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!