కాంగ్రెస్ నిజస్వరూపం మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సీబీఐ చార్జిషీటులో నిందితుడిగా వైఎస్సార్ పేరు చేర్చిన రోజే కాంగ్రెస్ వైఖరి వెల్లడైందని అన్నారు. వైఎస్సార్‌ను అడ్డుపెట్టుకుని జగన్‌పై కక్ష సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ ఆయనపైనే విమర్శలు చేయడం దారుణమని అంబటి అన్నారు. వైఎస్సార్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించే సమయంలో కాంగ్రెస్ రాక్షసత్వం బయటపడిందన్నారు. కాంగ్రెస్, టీడీపీకి తేడా ఏం లేదని అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ రెండు తలల రాక్షసి కుప్ప కూలుతుందన్నారు.
ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నిక లు రావచ్చొనని చెప్పారు. జగన్‌ను బయటకు పంపిన రోజే కాంగ్రెస్ పడవకు చిల్లు పడిందన్నారు. మునిగిపోవడానికి సిద్ధంగా చిరంజీవి చిల్లుపడిన కాంగ్రెస్ పడవలో ఎక్కాడని ఎద్దేవా చేశారు. రామచంద్రయ్య, వీరాశివారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ను టార్గెట్ చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించడంపై అంబటి స్పందించారు. వైఎస్సార్ నిజమైన వారసులం తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్ద మనుషులు దీనిపై నోరు విప్పాలన్నారు.

No comments:
Post a Comment