YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 12 April 2012

I don't Criticize to YSR and his Family, Jalak to Chandrababu Naidu in Public Meeting

ఉప ఎన్నికల నేపధ్యంలో మొట్ట మొదటిసారి- వైఎస్సార్‌ జిల్లా ప్రచారానికి వచ్చిన చంద్రబాబుకు- రాయచోటి  నేతలు ఝలక్ ఇచ్చారు. రాజశేఖరరెడ్డిని కానీ, జగన్‌ను కానీ విమర్శించాల్సిన అవసరం తనకు లేదంటూ- సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలో- టిడిపి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ప్రకటించడం అందరినీ ఆశ్ఛర్య పరిచింది. ఎనిమిదేళ్లు వారింట్లోనే తిన్నానని, ఆ కుటుంబాన్ని విమర్శించాల్సిన అవసరం తనకు లేదని- ఆయన స్పష్టం చేశారు. 

చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ ను విమర్శించే విషయంలో పార్టీ తీసుకున్న వైఖరికి తాము వ్యతిరేకమంటూ రాయచోటి తేదేపా శ్రేణులు స్పష్టం చేసినట్లయింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి పార్లమెంటు సభ్యునిగా గెలిచిన సీనియర్ నేత పాలకొండ్రాయుడు వైఎస్ కుటుంబాన్ని విమర్శించేది లేదంటూ వేదికపై ప్రకటించడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇంట్లో భోజనం చేశానని ఆయన్ను విమర్శించాల్సిన అవసరం తనకు లేదని కుండబద్దలు కొట్టారు పాలకొడ్రాయుడు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యమే అభ్యర్థి కూడా. అయినప్పటికీ వైఎస్సార్‌కు వ్యతిరేకంగా మాట్లాడేది లేదంటూ పాలకొండ్రాయుడు చేసిన ప్రకటన జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!