రాష్ట్రంలో మద్యం మాఫియా కుంభకోణాన్ని మాయం చేసే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికార కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వ సంస్థల్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు.
సీఎం, పిసిసి చీఫ్‌లమధ్య అభిప్రాయ బేధాలవల్ల అధికారులు బలవుతున్నారని ఆయన అన్నారు. టిడిపి నేతలు కాంగ్రెస్‌తో గల్లీలో కొట్లాడుతూ, ఢిల్లీలో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని గట్టు ఎద్దేవా చేశారు. లిక్కర్ కుంభకోణంలో కూరుకుపోయిన బొత్సకు ఎలాంటి నైతికత వున్నా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment