రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పని చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. గోరంట్ల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సిబిఐ చార్జిషీట్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో ఫార్మస్యూటికల్ కంపెనీలకు భూములు కేటాయించారని వివరించారు.
సిబిఐకి జగన్ వేసి ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి.
1. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దారాదత్తం
చేయలేదా?
2. ఆ నాడు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి సిబిఐకి కనిపించలేదా?
3. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఒక సిమెంట్ కంపెనీకి ఎకరా లక్షల రూపాయలకు భూములు ఇవ్వలేదా? అది అవినీతి కాదా?
4.పక్క రాష్ట్రాలలో పరిశ్రమల స్థాపనకు ఉచితంగా భూములు ఇస్తున్నారు. అది ఎంత నేరం?
5. చంద్రబాబు నాయుడు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 29 లక్షల రూపాయలకే కట్టబెట్టలేదా?
6. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు 535 ఎకరాలు, ఐఎంజికి 830 ఎకరాలు, రహేజాకు 110 ఎకరాలు, ఎల్ అండ్ టికి 110 ఎకరాలు కేటాయించలేదా?
దివంగత మహానేతపై ఆరోపణలు చేయడానికి సిగ్గుగాలేదా అని జగన్ ప్రశ్నించారు.
No comments:
Post a Comment