YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 1 April 2012

YS Jagan Consoles Nallagorla's Family

గోరంట్ల గ్రామంలో నల్లగొర్ల పాములు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఓదార్చారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. మహానేత డాక్టర్ వైఎస్ అంటే పాములుకు ఎనలేని అభిమానం. ఆయన హఠాన్మరణ వార్త విని తట్టుకోలేకపోయారు. రోజులు గడుస్తున్నా తేరుకోలేకపోయారు. చివరకు ఆ బాధతోనే గుండెపోటుతో మృతి చెందారు.

పాములు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కోసం ఒక దైవ మందిరం కూడా నిర్మించారు. ఆయనే తమ దేవుడు అని వారు చెబుతారు. గ్రామంలోని అంకాళమ్మ దేవతతోపాటు వైఎస్ ఫొటోకి కూడా గ్రామస్తులు పూజలు చేస్తుంటారు. 
ఈ గ్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం తరలి వచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!