అనంతపురం: వైఎస్ పథకాలకు కిరణ్ సర్కార్ తూట్లు పొడుస్తుందని ఎస్కే యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైఎస్ షర్మిల అన్నారు. టీడీపీ తన బాధ్యతను విస్మరించి కాంగ్రెస్‌తో జతకట్టిందని షర్మిల ఆరోపించారు. మాట మాద నిలబడకపోవడం చంద్రబాబుకు ఉన్న దురలవాటు షర్మిల అన్నారు. బాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు మహానేత వైఎస్ఆర్ ఎక్స్‌గ్రేషియా ఇచ్చారన్నారు. కాంగ్రెస్, టీడీపీకి వైఎస్ జగన్ అంటే భయమని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. రాజన్న రాజ్యం కోసమే వైఎస్ జగన్ నన్ను మీదగ్గరికి పంపారని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్ రెక్కల కష్టంపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment