YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 28 October 2012

జనం.. జనం.. కనుచూపు మేరలో.. కిలోమీటర్ల మేర ఒకటే జనం. ఇసుక వేస్తే 
రాలనంతగా.. రహదారి సరిపోనంతగా. వైఎస్ తనయ, జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 
చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఆదివారం రాప్తాడు నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వృద్ధులు మొదలు చిన్నారుల వరకు స్వచ్ఛందంగా తరలి వచ్చి పాదయాత్రకు మద్దతు తెలిపారు. కందుకూరు దాటిన తర్వాత జనం ఉప్పెనలా ఎగిసి పడటంతో 
నడవడానికి రహదారి సరిపోలేదు. దీంతో సగం మంది రైల్వే ట్రాక్ వెంట, పొలాల వెంబడి నడిచి వచ్చారు. జగన్నినాదాలతో ‘అనంత’ శివారు హోరెత్తిపోయింది.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచి 
న్యూస్‌లైన్‌ప్రతినిధి:‘ మరో ప్రజాప్రస్థానం పిలిచింది..పదండి ముందుకు.. పదండి తోసుకు
చెట్లు, పొదలు, పుట్టలు, పొలాలు, అడవులా మనకడ్డంకి?షర్మిలతో పదం కదుపుతూ.. కదం తొక్కుతూ పదండి ముందుకు పదండి తోసుకు’... ఇదీ రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఆదివారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి అయిన షర్మిల పాదయాత్రకు వచ్చిన జనస్పందన. శనివారం రాత్రి ధర్మవరం మండలం చిగిచెర్ల శివారులో బస చేసిన షర్మిల ఆదివారం ఉదయం 10.15 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. ధర్మవరం-అనంతపురం వయా చిగిచెర్ల రహదారి మీదుగా పాదయాత్ర సాగింది.

సింగిల్ రోడ్డుపై నడక మొదలుపెట్టారు. బస చేసిన ప్రాంతం నుంచి అర కిలోమీటరు నడవగానే చీమలపుట్ట పగిలినట్లు ఒక్కసారిగా జనవిస్ఫోటనం సంభవించింది. జనం రోడ్డు వెంబడి భారీ సంఖ్యలో బారులు తీరారు. సింగిల్ రోడ్డు పట్టక.. రోడ్డుకు ఇరువైపులా పొలాల వెంబడి, చెట్ల వెంబడి.. పుట్ల వెంబడి, వాగులు, వంకలు దాటుకుంటూ షర్మిలను అనుసరిస్తూ కదంతొక్కారు. షర్మిల ముందూ.. వెనకా కనుచూపు మేరలో రహదారిపై జనం కన్పించారు. తరచుగా చేతులు ఊపుతూ.. చిరుమందహాసం చేస్తూ.. వడివడిగా అడుగులు వేస్తూ కదంతొక్కుతోన్న జనాన్ని షర్మిల ఉత్సాహపరిచారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!