రాప్తాడు: రెక్కల కష్టం మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు పెట్టారని వైఎస్ షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన పథకాలన్నింటినీ ఇప్పటి పాలకులు దూరం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు బాబు అని అన్నారు.
ఆరోగ్య శ్రీలో రోగాలను తగ్గించి ప్రజలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లేలా చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో, విదేశాల్లోనూ వైద్యం చేయించుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు 55శాతం పెంచారని, అది చాలదన్నట్లు 4 శాతం అమ్మకపు పన్ను విధించారని ఆమె అన్నారు.
రాష్ట్రంలో ఇంత జరగుతున్నా టీడీపీ చోద్యం చూస్తు కూర్చుందని షర్మిల అన్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించి గ్రామాలను శ్మశానాలుగా బాబు మార్చారని, ఇప్పడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ అదే గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు.

No comments:
Post a Comment