కొందరి కనుసన్నలలో సిబిఐ పని చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కొణతాల రామకృష్ణ విమర్శించారు. తమ నేత జగన్మోహన రెడ్డి లక్ష్యంగా సీబీఐ అధికారుల విచారణ తీరు ఉందని ఆయన ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చానని ఓ పక్క ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ప్రధాన నిందితుడు కోనేరు ప్రసాద్ చెబుతుంటే, సీబీఐకి జగన్ ఒక్కరే కనిపిస్తున్నారని మండిపడ్డారు. స్టైలిష్ హొం ఎండి తుమ్మల రంగారావుకు బెయిల్ ఇచ్చినా అభ్యంతరంలేదని చెప్పడం నీచమన్నారు. నార్కోఎనాలసిస్ టెస్ట్ పేరుతో ఆడిటర్ విజయసాయి రెడ్డి చెప్పకపోయినా చెప్పినట్లు సిబిఐ రాసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్టు ఆదేశాలకు విరుద్దంగా సిబిఐ విచారణ సాగుతోందన్నారు. సిబిఐ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జగన్ కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక సిబిఐ కేసులతో ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. అసలు దోషులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
2014 ఎన్నికలలోపు జగన్ ని అణగదొక్కాలని ప్రభుత్వం కుట్ర అన్నారు. విచారణలో ఐఎఎస్ అధికారులను, మంత్రులను భాగస్వాములను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అంటే వారికి భయం అన్నారు. జగన్ ని చూసి భయపడకపోతే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు వెంటనే జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని జోక్యం చేసుకొని నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తారనే నమ్మకంతో విజయమ్మ లేఖ రాశారని తెలిపారు.

No comments:
Post a Comment