నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తండ్రి సత్యనారాయణరాజు భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం శ్రద్ధాంజలి ఘటించారు. తండ్రిని పోగొట్టుకున్న ఎమ్మెల్యే ప్రసాదరాజును జగన్ పరామర్శించారు. పిల్లీ సుభాష్‌చంద్రబోస్, మేకా శేషుబాబు ఇతర నేతలు జగన్ వెంట ఉన్నారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యనారాయణరాజు మృతి చెందారు. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న ఆయన రోడ్డు దాటుతుండగా అంతర్వేది నుంచి వస్తున్న నరసాపురం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆయన తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment