ఏలూరు : నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. ఆయన సోమవారం విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షలో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేయకుంటే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని శేషుబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకానికి సీఎం కిరణ్ తూట్లు పొడుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment