ఏలూరు : వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ఏలూరు ఫీజు దీక్ష ప్రాంగణంలో మాట్లాడారు. రెండు రోజుల దీక్షను మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విజయమ్మ చేపట్టారు.
చదువుకునే విద్యార్థులందరికి తాము అండగా ఉంటామని విజయమ్మ భరోసా ఇచ్చారు. మొద్దు నిద్ర పోతున్న సర్కారును నిద్ర లేపేందుకు, ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు జగన్ తనను ఏలూరు పంపారని ఆమె తెలిపారు. పార్టీ ప్లీనరీలో ప్రకటించిన 'అమ్మఒడి' పథకాన్ని ఈ ప్రసంగంలో విజయమ్మ ప్రస్తావించారు.

No comments:
Post a Comment