అర్హులైన పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్య అందాలన్న ఆశయంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం ఏలూరులో దీక్ష చేపట్టారు. సర్కారు అలసత్వం వీడి, అర్హులందరికీ పథకం అమలును యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్‌తో ఆమె నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు.
అంతకు ముందు విజయమ్మ దీక్షా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీక్ష స్థలికి చేరుకున్న ఆమెకు విద్యార్థులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు, మహిళలు, వైఎస్ అభిమానులతో దీక్షా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

No comments:
Post a Comment