రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వంచన, ఆత్మవంచనల మేళవింపుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విమర్శించారు. 2012-2013 రాష్ట్ర బడ్జెట్ పై ఆయన స్పందించారు. ఈ ప్రభుత్వం మహానేత డాక్టర్ వైఎస్ రెక్కల కష్టం అన్నారు. అయితే ఆయన హయాంలోని మానవీయ కోణం ఈ బడ్జెట్ లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధ్యాసంతా పన్నులపైనే ఉందన్నారు. ఈ ప్రభుత్వం ఇంకెన్ని పన్నులు వేస్తుందోనని జనం వణకుతున్నారన్నారు. ప్రజాసంక్షేమంపై ప్రభుత్వ పగబట్టినట్లుగా ఉందని విమర్శించారు. ప్రజలంటే ముఖ్యమంత్రికి ఇంత చులకనా? ఈ ప్రభుత్వం ఉంది ఎవరికోసం? అని జగన్ ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ కు కేటాయించిన నిధులు గత సంవత్సరం బకాయిలకు కూడా సరిపోవన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వాసుపత్రులకే పరిమితమైందన్నారు. 104, 108లకు నిధులు తక్కువ కేటాయించారని తెలిపారు. మహిళా స్వావలంబనకు గండికొడుతున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్, 30 కిలోల బియ్యం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రచారం కోసం వందల కోట్ల రూపాయలు తగలేస్తుందని విమర్శించారు.

No comments:
Post a Comment