YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 13 February 2012

YS Jagan's Health Condition Deteriorated

60కి పడిపోయిన పల్స్‌రేట్.. 
96/60కి తగ్గిపోయిన రక్తపోటు
ఫ్లూయిడ్స్ తీసుకోవాలని సూచించిన వైద్యులు.. నిరాకరించిన జగన్
జ్వరంతో బాధపడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. జ్వరం కొద్దిగా తగ్గినా.. ఆహారం తీసుకోకపోవడంతో ఆయన బాగా నీరసించిపోయారు. సోమవారం రాత్రి 7 గంటలకు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి.. జగన్‌మోహన్‌రెడ్డిని పరీక్షించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. జలుబు, దగ్గు, విపరీతమైన తలనొప్పితో జగన్ బాధపడుతున్నారు. పల్స్ రేట్ 60కి పడిపోయింది. బ్లడ్ ప్రెజర్ 96/60కి పడిపోయింది. ప్లూయిడ్స్ తీసుకోవాలని తాము సూచించగా జగన్‌మోహన్‌రెడ్డి అందుకు నిరాకరించారని వైద్యులు తెలిపారు. ‘ప్లూయిడ్స్ తీసుకుంటే దీక్ష ఎలా అవుతుంది? ఏది ఏమైనా అనుకున్న మేరకు దీక్ష చేసి తీరుతా. నా ఆరోగ్యం ఏమైనా ఫర్వాలేదు’ అని జగన్ అన్నట్లు వారు విలేకరులకు తెలిపారు. మందులు వేసుకోవాలన్న డాక్టర్ సూచనను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు తీవ్ర ఎండలతో పెరిగిన ఉక్కపోత ప్రభావం, ఇంకోవైపు తనను కలవడానికి వచ్చిన ప్రజలు, నేతలతో జగన్ మమేకమవుతుండటం వల్ల ఆయన బాగా నీరసించిపోయారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చేసిన సూచనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఎంతో దూరం నుంచి మండుటెండను సైతం లెక్కచేయకుండా తనను కలిసి మాట్లాడేందుకు తరలివస్తోన్న వారితో మాట్లాడటం తన ధర్మమని చెప్పారు.

జగన్ ఆరోగ్యంపై ఆరా తీసిన విజయమ్మ
కడప: జగన్ ఆరోగ్యంపై ఆయన తల్లి, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ ఆరా తీశారు. పులివెందుల ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్న వైనంపై జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేసేందుకు విజయమ్మ సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ధర్మవరం దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు కూడా కలెక్టరేట్ చేరుకున్నారు. ఈ సందర్భంలో జగన్‌బాబు ఆరోగ్యం ఎలా ఉంది సురేష్, జ్వరం తగ్గిందా? అంటూ విజయమ్మ ఆరా తీశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!