
ఫిర్యాదులో మల్లికార్జున పేర్కొన్న తప్పుడు డోర్ నెంబర్ పత్రాలను కూడా కలెక్టర్‌కు అందజేశారు. పులివెందుల ప్రభుత్వాస్పత్రిలో రోగి మృతిపై ఆగ్రహించిన వెంకటాపురం వాసులు డాక్టర్లపై చేయిచేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆ సంఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైనచర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఎలాంటి సంబందం లేని శంకర్‌రెడ్డి, చిన్నప్పరెడ్డిలపై పోలీ సులు వ్యూహాత్మకంగా కేసు నమోదు చేయడాన్ని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పులివెందులలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా నమోదవుతున్న తప్పుడు కేసులు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీకి చెందిన మహిళలపై కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నార న్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో వారందరినీ అరెస్టు చేయించే కుట్రకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నమోదైన కేసులను పరిశీలించి తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని విజయమ్మ కలెక్టర్‌ను కోరారు.
No comments:
Post a Comment