YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 17 February 2012

Konathala Ramakrishna Reaction on Budget 2012-13

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజాసంక్షేమాన్ని, ప్రాధాన్యత రంగాలాను పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తి అసంతప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్ నాయకత్వంలో ఇచ్చిన హామీలను కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకష్ణ దుయ్యబట్టారు. పేరుకు లక్షాయాభైవేల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే పేదలకు కించితే లాభంలేదని ధ్వజమెత్తారు. 2012-13 బడ్జెట్‌లో ఉన్న కొత్తదనమల్లా ఇద్దరు మంత్రులు చదివి వినిపించడం తప్పితే మరేమి లేదని ఎద్దేవా చేశారు. పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రహమాన్, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యంలతో అన్ని రంగాలకు నిరాశే మిగిలిందన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9గంటల ఉచిత విద్యుత్ హామీని కనీసం బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దురదష్టకరం. అంతేకాదు గతంలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్-డిసెంబర్ నెలల్లో విద్యుత్ కోత విధించిన ఘనత సీఎం కిరణ్‌కే దక్కుతుంది.

పేదలకిచ్చే సబ్సిడీ బియ్యం 20 నుంచి 30 కేజీల పెంపు విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధర కేంద్ర ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి అందిస్తామని సీఎం కిరణ్‌తోపాటు పీసీసీ చీఫ్ బొత్స గొప్పగా ప్రకటించారు. కానీ వాటిని కూడా బడ్జెట్‌లో మాటమాత్రం చెప్పలేకపోయారు. రైతుల నడ్డివిరిచే విధంగా ఎరువుల ధరలు విపరీతంగా పెంచి ఊరటనిచ్చే అంశాలను ఒక్కటి చేర్చలేకపోయారు. కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే వారికి ఇప్పటిదాకా గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయారు. ఖజానా నింపుకోవడానికి మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచారు’’ అని కొణతాల దుయ్యబట్టారు. విద్యార్థుల చదువులు గాల్లో దీపంలా తయారయ్యాయని అభిప్రాయపడ్డారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే కుట్రలో భాగంగా సరిపడా నిధులు కేటాయించడంలేదన్నారు. ఈ పథకానికి దాదాపు 8వేల కోట్లు అవసరమవగా కేవలం నాలుగువేల కోట్లే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. పేదల పాలిట అపర సంజీవని పేరొందిన ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు.

పేదలకిచ్చే పెన్షన్ పట్టదా?

మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మూడు, నాలుగు రెట్లు పెంచిన కిరణ్ ప్రభుత్వానికి పేదలకిచ్చే నెలనెల పెన్షన్‌ను పెంచాలనే ఆలోచన చేయకపోవడం దురదష్టకరమన్నారు. ‘‘పేదలకిచ్చే పెన్షన్ చంద్రబాబు హయాంలో ఉన్న ’75ను వైఎస్ ’200లకు పెంచారు. వాటిని కనీసం యాభై నుంచి వంద రూపాయలకు పెంచే ఆలోచన చేయలేదు. వీళ్ల జీతాలు మాత్రం విపరీతంగా పెంచేసుకున్నారు. సీఎం కిరణ్ మాత్రం తన విచక్షణ పరిధి కింద ’ 600 కోట్లు పెంచుకోవడం సిగ్గుచేటు. దీని వల్ల పేదలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?’’ అని విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!