గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ కోసం అభిమానంతో ఏర్పాటు చేసుకున్న భారీ వేదికపై పోలీసులకు కన్ను కుట్టింది. స్తంభాల గురువు సెంటర్‌లోని ఆ భారీ వేదికకు అనుమతి లేదంటూ హడావిడి చేశారు. వేదికను తొలగించాల్సిందేనని ఆదేశించారు. అదేసమయంలో భారీ సంఖ్యలో పోలీసుబలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈసమయంలో కార్యకర్తలకు, పోలీసులకు కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. తర్వాత పోలీసులకు సహకరించిన కార్యకర్తలు స్వచ్ఛందంగా వేదికను తొలగించారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద చిన్న వేదికకు మాత్రమే పోలీసులు అనుమతించారు. అప్పటిదాకా అభిమానులు సందడిగా ఏర్పాటు చేసుకున్న వేదికను నిమిషాల్లో పోలీసులు తొలగింపజేయడంతో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది కార్యకర్తలు ఈ వ్యవహారం వెనుక మంత్రి కన్నా లక్ష్మినారాయణ ప్రమేయం ఉందంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. |
Thursday, 29 March 2012
Police Over Action in Guntur Odarpu Yatra
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment