YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 27 March 2012

Vasireddy Padma Fire on Chandrababu

 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా అడ్డగోలుగా భూములు కేటాయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం అంతా చంద్రబాబు చలవే అన్నారు. అయినప్పటికీ సిబిఐ అతనిని కనీసం ఫోన్ లో కూడా విచారించలేదని విమర్శించారు. సిబిఐని ఎలా మేనేజ్ చేశారని ఆమె 
చంద్రబాబుని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. 

చంద్రబాబు అవినీతిపై వచ్చినన్ని పుస్తకాలు మరెకక్కడా రాలేదని తెలిపారు. అటువంటి చంద్రబాబు ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. లక్ష్మిపార్వతిని అడిగితే బాబు అవినీతి మొత్తాన్ని చెబుతారని చెప్పారు. తన కంపెనీ హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదన్నారు. హెరిటేజ్ పబ్లిక్ ఇష్యూ ఎంత బోగస్సో అందరికి తెలుసన్నారు. బాబా వ్యాపారం విషవృక్షంలాగా విస్తరించిందన్నారు. విదేశాలలో కొడుకు, కోడలు ఏం చేస్తున్నారని 
ఆమె ప్రశ్నించారు. మీ కుటుంబం పాస్ పోర్టులు పరిశీలిస్తే వివరాలు అన్నీ తెలుస్తాయన్నారు. 

రాజ్యసభ సభ్యుల ఎంపికతోనే బండారం బయటపడిందన్నారు. నీతిమంతుడవైతే తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు ఎందుకు సిద్ధపడలేదని ఆమె ప్రశ్నించారు. 2004 ఎన్నికల్లో పంచిన వేల కోట్ల రూపాయలు ఎక్కడవని ఆమె అడిగారు. విదేశాల నుంచి వందల కోట్ల రూపాయలు వచ్చాయని ఆమె ఆరోపించారు. పులివెందుల, కడప, కోవూరు ఉప 
ఎన్నికలలో పంచిన డబ్బు ఎక్కడ నుంచి తెచ్చారని ఆమె అడిగారు. అనేక విధాలుగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన చంద్రబాబు ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కూడా కుమ్మక్కైయ్యారని తెలిపారు. తన ఆర్థిక నేరాలు బయటకు రాకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలనే కాకుండా, కేంద్రంలోని నేతలను కూడా మేనేజ్ చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. చంద్రబాబు కేంద్ర మంత్రి చిదంబరంని కలిసిన 
విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడుతుంటే అన్నా హజారే లాంటివారు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.


No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!