గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మిర్చి పంటపొలాల్లోకి వెళ్లి రైతుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడులో కల్లాల్లో ఉన్న మిరప పంటను ఆయన పరిశీలించారు. అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్నదని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని వాపోయారు. అంతకు ముందు జగన్ ను మిర్చి రైతులు కలిశారు. మిర్చికి మద్దతు ధర రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment