దివంగత నేత వైఎస్ఆర్ సమస్యలను ధీటుగా ఎదుర్కొనేవారని, ఆయనే తన రాజకీయ జీవితానికి ఇన్ స్పిరేషన్ అని కాంగ్రెస్ నేత చిరంజీవి అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. శాసన సభ్యత్వానికి ఈనెల 29న రాజీనామా చేస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. సినిమా చట్రం నుంచి ప్రజా సమస్యలపై అవగాహనకు తనకు శాసన సభ ఎంతగానో ఉపయోగపడిందని చిరంజీవి అన్నారు. మూడేళ్లలో ఎంతో నేర్చుకున్నానని ఆయన తెలిపారు. |
Tuesday, 27 March 2012
YSR is the my Political inspiration: Chiranjeevi
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment