మంత్రాలయం(కర్నూలు): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరులోని తన స్వగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నమ్మి చేరదీసిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తాజాగా సీమకూ ద్రోహం చేశారన్నారు. ప్రధానికి ఆయన రాసిన లేఖను పరిశీలిస్తే.. సీమలో పుట్టి, ఇక్కడి గాలి పీల్చి తెలంగాణకు మద్దతు పలకడం చూస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమేనని మండిపడ్డారు. ఎన్టీఆర్ వారసుల్ని దూరం పెట్టి తన కుమారుడు లోకేష్‌కు రాజకీయపట్టం కట్టేందుకే పాదయాత్రకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని ఆయన ఆరోపించారు.
source: sakshi
source: sakshi





No comments:
Post a Comment