హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు అభిమానులు ఈరోజు ఉదయం నుంచి చంచల్ గూడ జైలు వద్ద వేచి ఉన్నారు. తమ ప్రియతమ నేతను చూసేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి అభిమానులు రాజధానికి వచ్చారు. వాన్ పిక్ కేసు విచారణ నిమిత్తం జగన్ ఈరోజు కోర్టుకు హాజరు కానుండటంతో ఆయనను చూసేందుకు చంచల్ గూడ జైలు వద్ద, నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేసుకున్నారు.
అయితే పోలీసుల విపరీత ఆంక్షలతో తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను చూడలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు చంచల్ గూడ జైలు వద్ద జగన్ కోర్టుకు వెళ్లేముందే అభిమానులకు అభివాదం చేశారు. దాంతో అభిమానులు ఒక్కసారిగా జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో ఓ మహిళ అభిమాని ఉద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టింది. త్వరలోనే జగన్ జైలు నుంచి బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది.
source:sakshi

No comments:
Post a Comment