చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణకు చేసిన ద్రోహం, విశ్వసనీయత వంటివాటిపై కేసీఆర్‌తో బహిరంగచర్చకు రావాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు సవాల్ చేశారు. తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ విశ్వసనీయత, ఆదరణ కోల్పోయిన టీడీపీలాంటి రాజకీయపార్టీ ప్రపంచంలోనే లేదన్నారు. చంద్రబాబుది మోసాల చరిత్ర అని దుయ్యబట్టారు. తెలంగాణపై రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.చంద్రబాబు విశ్వసనీయత గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 19 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడమే చంద్రబాబు విశ్వసనీయతకు నిదర్శనమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment