Friday, 10 August 2012
భద్రిరాజు మృతిపట్ల విజయమ్మ దిగ్ర్భాంతి
ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రావిడ భాషావేత్తల్లో ఆయన ధ్రువతార అని ఎస్ విజయమ్మ అన్నారు. తెలుగు భాషపై అధ్యయనాలకు నాంది పలికిన కృష్ణమూర్తి కేంద్రియ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. తెలుగు భాషపై అధ్యయనంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment