వాన్‌పిక్‌పై బాబు వీధి నాటకం * వాన్‌పిక్‌పై వాస్తవాలు దాచి బాబు రాద్ధాంతం * 28 వేల ఎకరాలిచ్చారంటూ అడ్డగోలు ప్రచారం * నిజాలకు గంతలు కడుతూ ధర్నాలు, యాత్రలు * వాన్‌పిక్ ప్రతిపాదన వచ్చిందే బాబు హయాంలో * భూ సంతర్పణల్లో అద్వితీయ రికార్డు కూడా ఆయనదే * నిందలే.. నిజాలతో పనిలేదు * వాన్‌పిక్‌పై వాస్తవాలు విస్మరిస్తున్న టీడీపీ * 18 వేలకు బదులు 28 వేల ఎకరాలిచ్చారంటూ రాద్ధాంతం * 18 వేల ఎకరాలు కేటాయించినా ఇప్పటిదాకా సేకరించింది 13 వేల ఎకరాలే * అధికం అసైన్డ్ భూమి కావడంతో ప్రభుత్వానికి అప్పగించిన వాన్‌పిక్ * దాన్లో 6వేల ఎకరాల్ని ఇంకా వాన్‌పిక్‌కు లీజుకివ్వని సర్కారు * ఈ జాప్యంతో టెండర్లు పిలిచినా మొదలుకాని పనులు * 2 పోర్టులు, షిప్‌యార్డు, ఎయిర్‌పోర్ట్‌కు 6,800.. * పోర్టు ఆధారిత పరిశ్రమలకు 11,200 ఎకరాలు * ఇవి వదిలి పోర్టుకు 28 వేల ఎకరాలిచ్చారంటున్న టీడీపీ * రెండు పోర్టులు, ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు, సెజ్‌కు ఇచ్చింది 18 వేల ఎకరాలే * రస్ అల్ ఖైమాతో ఒప్పందానికి ముందే జగతిలో నిమ్మగడ్డ పెట్టుబడి * అయినా సరే వాన్‌పిక్ దక్కినందుకే పెట్టుబడి పెట్టారంటూ వితండ వాదన ![]() జరుగుతున్న తతంగం చూస్తుంటే చంద్రబాబు గానీ, టీడీపీగానీ వాన్‌పిక్‌కు సంబంధించిన నిజాల్ని కావాలనే విస్మరిస్తున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే దీనికి కేటాయించిన భూమి విషయంలో రాజకీయ పక్షాలన్నీ తప్పుడు లెక్కలే చెబుతూ వస్తున్నాయి. ![]() వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్స్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇదే వాన్‌పిక్. అంటే వాడరేవులో ఒకటి, నిజాంపట్నంలో ఒకటి చొప్పున రెండు పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం, పరిశ్రమల కారిడార్. ఇవన్నీ కలిస్తేనే వాన్‌పిక్. దీనికోసం ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా సేకరించడానికి అనుమతించిన భూమి 22,990 ఎకరాలు. అంటే 23వేల ఎకరాలు. కాకపోతే ఆయా జీవోల్లో పేర్కొన్న ప్రాంతాల్లో అటవీ భూములు, పర్యావరణ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ఇతర భూములు గనక ఉంటే వాటిని మినహాయించాలని జీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో అలాంటి భూముల్ని సేకరించటం లేదని తెలియజేస్తూ వాన్‌పిక్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి లేఖలు పంపింది. ![]() దాన్ని తగిన ధర చెల్లించి సేకరించిన వాన్‌పిక్... అసైన్డ్ భూముల్ని తాను తీసుకోవటానికి వీల్లేదు కనక తిరిగి ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం వాటిని వాన్‌పిక్‌కు తిరిగి లీజుకివ్వాల్సి ఉంటుంది. నిజానికి ఇలా 12,973 ఎకరాలు సేకరించి ప్రభుత్వానికి వాన్‌పిక్ అప్పగించగా... దాన్లో 6,418 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం వాన్‌పిక్‌కు అప్పగించింది. మిగిలిన భూమిపై తాత్సారం చేస్తూ ఉండటంతో, దాన్లో పోర్టులకు సంబంధించిన భూమి ఉండటంతో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కూడా మొదలుపెట్టలేకపోతున్నట్లు వాన్‌పిక్ పేర్కొంటోంది. మొత్తమ్మీద ఎకరాకు కనిష్టంగా 1.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.5 లక్షలు వెచ్చించి వాన్‌పిక్ సంస్థ భూముల్ని కొనుగోలు చేసింది. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్లు ఖర్చుపెట్టింది. అంటే మొత్తమ్మీద సగటున ఎకరాకు రూ.3.5 లక్షలు ఖర్చుచేసింది. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఒక్కటే భూముల వివరాలన్నీ ఇంత స్పష్టంగా ఉన్నపుడు అటు చంద్రబాబు గానీ, ఇటు తెలుగుదేశం పార్టీ గానీ 28,000 ఎకరాల్ని వాన్‌పిక్‌కు కట్టబెట్టారంటూ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి? అసలు 28వేల ఎకరాలనే సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే పోర్టుకు అన్నివేల ఎకరాల్ని ఇచ్చేశారని చెబుతున్న చంద్రబాబునాయుడికి ఆ 18వేల ఎకరాల్ని కేటాయించింది ఒక పోర్టుకు కాదని, అక్కడ రెండు పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్ వస్తాయని తెలియదా? ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారనటానికి ఇంకా నిదర్శనమేం కావాలి? బాబు రాయితీల వెల్లువ ఇదీ.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కోసం జీఎంఆర్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో విలువైన 5,500 ఎకరాల్ని కేటాయించింది. దీంతో పాటు వడ్డీ లేకుండా రూ.315 కోట్ల రుణాన్ని సమకూర్చింది. మరో రూ.107 కోట్లను అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్ గ్రాంట్‌గా అందజేసింది. ఇవన్నీ చేసి కూడా... తొలి ఎనిమిదిన్నర ఏళ్ల పాటు లీజు మొత్తాన్ని చెల్లించకుండా మినహాయింపునిచ్చింది. గంగవరం పోర్టు కోసం 2,800 ఎకరాల్ని బాబు కేటాయించారు. దీంలో 1,400 ఎకరాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి తీసుకుని మరీ ఇచ్చారు. దీన్లో 1,800 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా (ఈక్విటీ), మిగిలిన భూమిని లీజు పద్ధతిలోనూ సమకూర్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చిన భూమికి కట్టిన విలువెంతో తెలుసా? కేవలం ఎకరం రూ.2.86 లక్షలు. విశాఖపట్నానికి కూతవేటు దూరంలో స్టీల్‌ప్లాంట్లో భాగంగా ఉన్న ఈ భూములకు అప్పట్లోనే ఎకరా ధర రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ఉండేది. అలాంటి చోట ఎకరా కేవలం 2.86 లక్షలకే ఇచ్చిన ఘనత బాబుది. ప్రస్తుత ప్రభుత్వానిదీ ఇదే తీరు... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలే మచిలీపట్నం పోర్టు కోసం నవయుగ సంస్థకు 5,324 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించటానికి అంగీకరించింది. దీంతో పాటు రూ.355 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కూడా ప్రతిపాదించింది. నిజానికి ఈ పోర్టుకు గతంలో టెండర్లు పిలిచినపుడు రామలింగ రాజుకు చెందిన మేటాస్ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. తరువాతి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని రద్దు చేసి నవయుగ సంస్థను ఎంపిక చేశారు. చంద్రబాబు ఒక ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలిచ్చారు. అదీ హైదరాబాద్ సమీపంలో. పోర్టుకు 2,800 ఎకరాలిచ్చారు. విశాఖ నగరంలో. కిరణ్ కుమార్ రెడ్డి మరో పోర్టుకు 5,324 ఎకరాలిచ్చారు. అవేవీ తప్పు కానపుడు వైఎస్ ప్రభుత్వం రెండు పోర్టులు, ఒక ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు, పారిశ్రామిక కారిడార్‌కు కలిపి 18,000 ఎకరాలివ్వటం ఏ విధంగా తప్పు? చంద్రబాబు హయాంలోనే ప్రతిపాదన.. ![]() ఆ స్థానంలో రస్ అల్ ఖైమా ప్రభుత్వం ముందుకు రాగా... దాంతో ప్రభుత్వం వాన్‌పిక్ కోసం ఒప్పందం చేసుకుంది. రస్ అల్‌ఖైమా తన భారత భాగస్వామిగా తనకు యాదృచ్ఛికంగా కలిసిన, అప్పటికే పారిశ్రామిక వేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎంచుకుంది. ఆయనకు చెందిన ‘మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్’తో ఒప్పందం చేసుకుంది. జరిగింది ఇదైతే.. మ్యాట్రిక్స్‌కు వైఎస్ కావాలనే భూముల్ని కేటాయించారని విమర్శలు చేస్తుండటం సమంజసమా? ‘బూట్’ మార్చారంటూ అడ్డగోలు వాదన... ఈ ప్రాజెక్టును తొలుత బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బూట్) పద్ధతిలో ప్రతిపాదించారని, తరవాత దాన్ని బిల్ట్ ఆపరేట్ ఓన్(బూ) పద్ధతికి మార్చారని వివిధ పక్షాలు చెబుతున్నాయి. ఇలా మార్చటంలోనే అప్పటి ప్రభుత్వం చేసిన కుట్ర దాగి ఉందంటూ సీబీఐ కూడా వాదిస్తోంది. దీన్లో నిజానిజాలేంటో చూద్దాం... బూట్ అంటే లీజు గడువు ముగిశాక తిరిగి ప్రభుత్వానికి అప్పగించటం. బూ అంటే లీజు గడువేదీ ఉండదు. వాన్‌పిక్‌లో పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం బూట్ పద్ధతిలోనే ప్రతిపాదించారు. ఇప్పటికీ బూట్ పద్ధతిలోనే ఉన్నాయి కూడా. అంటే వీటిని నిర్మించి, నిర్వహించి, లీజు గడువు ముగిశాక ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇక పారిశ్రామిక కారిడార్ విషయానికొస్తే దాన్ని మొదట్లో ‘బూట్’ అని గానీ, ‘బూ’ అని గానీ పేర్కొనలేదు. కన్సెషన్ ఒప్పందంలో దాన్ని ‘బూ’ పద్ధతిలో ఇస్తున్నట్లుగా పేర్కొన్నారన్నది సీబీఐ వాదన. నిజానికి ఏ సెజ్‌గానీ, ఏ ఇండస్ట్రియల్ కారిడార్ గానీ బూట్ పద్ధతిలో ఉండదు. ఎందుకంటే లీజు గడువు ముగిశాక తిరిగి ప్రభుత్వానికి అప్పగించే ప్రాతిపదికన ఏ కంపెనీ కూడా తన యూనిట్‌ను ఏర్పాటు చేయటానికి ముందుకు రాదు. ఇది చంద్రబాబుకు గానీ, సీబీఐకి గానీ తెలియక కాదు. ఎందుకంటే విశాఖ ఫార్మాసిటీ విషయంలో చంద్రబాబు నాయుడు తొలుత ‘బూట్’ పద్ధతిలోనే టెండర్లు పిలిచారు. ఏ ఒక్కరూ రాకపోయేసరికి దాన్ని ‘బూ’ పద్ధతికి మార్చారు. అప్పుడు రాంకీ సంస్థ ముందుకు రాగా... దానికి భూమిని కట్టబెట్టారు. ఈ విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి దాఖలు చేసిన 3వ చార్జిషీట్లో సీబీఐ కూడా వివరంగా పేర్కొంది. కాకపోతే అప్పుడు చంద్రబాబు చేసిన చర్య దానికి తప్పుగా కనిపించలేదు. వాన్‌పిక్ విషయంలో మాత్రం అది తీవ్ర నేరంగా కనిపిస్తుండటం గమనార్హం. భూ విక్రయదారులకు చెల్లించినదెంత? ![]() మరి మిగిలిన 2 లక్షలు ఎక్కడికెళ్లాయి? ఇది తేలాలి’’ అంటోంది సీబీఐ. అయితే తాము సేకరించినవన్నీ అసైన్డ్ భూములని, ఈ రకం భూముల్లో తొలి అసైనీ ఒకరైతే దాన్ని బదిలీ చేసుకున్న వ్యక్తి మరొకరని, వాస్తవంగా ఆ భూమిని అనుభవిస్తున్నది మరొకరని... అలాంటపుడు తాము ఆ ముగ్గురికీ ఎంతో కొంత మొత్తం చెల్లిస్తే తప్ప వారు సంతకం చేయని పరిస్థితి ఉండేదని వాన్‌పిక్ చెబుతోంది. ‘‘అలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురికీ ఎంతో కొంత చెల్లించటం జరిగింది. అలా చెల్లించిన ప్రతి పైసానూ రికార్డుల్లో చూపించాం. ప్రతి పైసాకూ లెక్కలున్నాయి’’ అని వాన్‌పిక్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. పోనీ వీరిద్దరి వాదనల్లోనూ వైరుధ్యాలున్నాయనే అనుకుందాం. మరి వాన్‌పిక్ వద్ద ప్రతి పైసాకూ లెక్కలున్నాయని చెబుతున్నపుడు... సదరు భూమి కోసం నిజంగా ఎంతమందికి ఎంత మొత్తం చెల్లించారన్నది ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవటం కష్టమా? నేరుగా ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎవరికివారు వచ్చి నిజం చెప్పకుండా ఉంటారా? మరి సర్కారు ముందు ఇలాంటి మార్గం ఉన్నపుడు అవేమీ చేయకుండా ఆరోపణలు మరింత ముదరటానికి, అపోహలు తీవ్రమవటానికి ఎందుకు కారణమవుతోంది? ఇదీ.. రైతుల మాట అమ్ముకొని బాగుపడ్డాం ![]() - వడ్లమూడి సామ్రాజ్యం, గొల్లపాలెం, మోటుపల్లి పంచాయతీ, చినగంజాం మండలం అభివృద్ధి కుంటుపడింది ![]() - మీసాల ఏడుకొండలు, కొత్తరెడ్డిపాలెం, వేటపాలెం మండలం ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందా? ఒప్పందం ప్రకారం 18 వేల ఎకరాలనూ సేకరించాల్సింది వాన్‌పిక్ సంస్థే. దీన్లో ప్రభుత్వ భూమి 174 ఎకరాలే. మిగిలినదాంట్లో అత్యధికం ప్రభుత్వం వివిధ వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమి. దానికి తగిన పరిహారం చెల్లించి, కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తుంది వాన్‌పిక్. దాన్ని తిరిగి ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించాలి. ఇదో వినూత్న పద్ధతి. కేటాయించేది కూడా ప్రభుత్వ భూమి కాదు కనుక ప్రభుత్వం నష్టపోయేదేమీ ఉండదు. పెపైచ్చు వాన్‌పిక్ చెబుతున్న దాని ప్రకారం మొత్తం 18 వేల ఎకరాల్లో వారు సేకరిస్తున్న పట్టాభూములు 3,400 ఎకరాలు. దాదాపు 20 శాతం. దీన్నిబట్టి నిరాశ్రయుల సంఖ్య సాధ్యమైనంత తక్కువగా ఉండటానికి అప్పటి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుందన్నది తెలియకమానదు. మరి దీన్లో ప్రభుత్వం నష్టపోయేదేముంది? ప్రలోభాలకు గురి చేస్తున్నారు ![]() - ప్రళయకావేరి రాములు, రామచంద్రాపురం, వేటపాలె మండలం మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి ![]() - అప్పల నాగేశ్వరరెడ్డి, పాతరెడ్డిపాలెం, పుల్లరిపాలెం పంచాయతీ, వేట పాలెం మండలం |
Wednesday, 8 August 2012
వాన్‌పిక్‌పై బాబు వీధి నాటకం .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment