నేడు రాజమండ్రి లో జక్కంపూడి విగ్రహావిష్కరణ, విజయమ్మ బహిరంగ సభ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సోమవారం మధ్యాహ్నం రాజమండ్రికి బయలుదేరి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు విమానంలో ఆమె రాజమండ్రికి బయల్దేరుతారు. 2 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు రోజా దీక్షను పాటించే ముస్లిం మహిళల కోసం రాజమండ్రి షెల్టాన్ హోటల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉపవాస విరమణ(ఇఫ్తార్) కార్యక్రమానికి విజయమ్మ హాజరవుతారు. అదే రోజు రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. విజయమ్మ పర్యటన వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ కుడిపూడి చిట్టెబ్బాయ్ ఆదివారం రాజమండ్రిలో విడుదల చేశారు.
No comments:
Post a Comment