
- తెగేసి చెబుతున్న జగన్‌మోహన్‌డ్డి
(టీ మీడియా, ప్రత్యేక ప్రతినిధి):వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌డ్డిని దారికి తెచ్చుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడం లేదా చేతులు కలపడం అనే రెండు ప్రతిపాదనలనూ జగన్ తిరస్కరించినట్టు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. జగన్‌ను దారికి తెచ్చుకునేందుకు తమ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్టు కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి.
జగన్ కలిసొస్తే తెలంగాణ వాయిదా!
జగన్ కలిసొస్తే తెలంగాణ సమస్యను వాయిదా వేయాలని పార్టీ అధిష్ఠానం ఇటీవల సమాలోచనలు జరిపిందని కూడా ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దూతలు కూడా తెలంగాణ సమస్యను ఇప్పుడప్పుడే తేల్చవలసిన అవసరం లేదని, తెలంగాణ సమస్యను పరిష్కరించకుండానే 2014 ఎన్నికల్లో తాము యూపీఏకు రాష్ట్రం నుంచి అవసరమైన మద్దతును కూడగడతామని ప్రతిపాదించినట్టు కాంగ్రెస్ నాయకుడు వివరించారు. ‘జగన్ కలసిరావడం లేదు. సీమాంవూధలో ఎటువంటి గ్యారంటీ లేదు. రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేసుకోలేం. కనీసం తెలంగాణనయినా కాపాడుకోవాలి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సిద్ధమని టీఆస్ అధినేత కేసీఆర్ కూడా వివిధ సందర్భాల్లో బాహాటంగానే చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఇక ఏదో ఒకటి తేల్చకతప్పని పరిస్థితికి చేరుకుంది’ అని ఆయన వివరించారు.
No comments:
Post a Comment