YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 15 February 2012

Ambati Rambabu Comments on Botsa in Press Meet

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం లిక్కర్ వ్యవహారంలో ముఖ్యమంత్రి తనపై చర్యలు తీసుకోకుండా బొత్స చీప్ ట్రిక్కులు ఉపయోగిస్తున్నారన్నారు. 

బొత్స మద్యం సిండికేట్ వ్యవహారం బయటపెట్టమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేత పట్టుబట్టడంతో తన వ్యవహారం ముఖ్యమంత్రి ఎక్కడ బయటపెడతారోనన్న బయంతో బొత్స చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తన మద్యం వ్యవహారం బయటపెట్టకుండా ఉండేందుకు వారిద్దరు కుమ్మక్కయిన విషయాన్ని బయటపెడతానని బెదిరిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని బొత్స చేసిన వ్యాఖ్యలను అన్ని ఛానెల్స్ ప్రసారం చేశాయి. ఆ తరువాత తాను అలా అనలేదని బొత్స ఖండించారు. ముఖ్యమంత్రిని తనవైపుకు తిప్పుకునేందుకు ఇది చీప్ ట్రిక్ గా ఉందన్నారు. పిసిసి అధ్యక్షుడు, మంత్రి అయి ఉండి ఇలా చౌకబారుగా ప్రవర్తించడం మంచిదికాదన్నారు. ముఖ్యమంత్రిని లొంగదీసుకొని తన మద్యం సిండికేట్ వ్యవహారం బయటకు రాకుండా బొత్స జాగ్రత్తపడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయాలను విలేకరులు అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. 

భూ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే 1994 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ కేటాయింపులపై విచారణకు సిద్ధపడాలన్నారు. అందుకు ఆయన సిద్ధమేనా? అని అంబటి ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!