YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 29 September 2012

జగన్ కోసం - 13 (పాఠకుల స్పందన) sakshi

‘‘జగన్ కోసం’’ అనే ఒక మంచి శీర్షికను ప్రారంభించి పాఠకుల అభిప్రాయాలకు గౌరవం కల్పించి మా మనోవ్యధ పంచుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు సర్వదా ఋణగ్రస్థులం. 9 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ అనే వృక్షం కూకటివేళ్ళతో సహా పెకలించబడిన సమయంలో ‘అపర భగీరధుడు’ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి కొడిగట్టిపోతున్న కాంగ్రెస్ దీపానికి చేతులు అడ్డుపెట్టి దేదీప్యమానంగా ప్రకాశింపచేసి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చారు ఆ మహానుభావుడు. కాని ఎంత అన్యాయం? ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కావచ్చు, వారి బిడ్డ భారతదేశానికి ప్రధాని అవ్వాలని వారు ఆశపడొచ్చు. కాని రాజశేఖరుడు ఊపిరిపోసిన (కాంగ్రెస్) రాజ్యానికి ఆయన కుమారుడు సిఎం కావాలని మాలాంటి సామాన్య ప్రజలు కోరుకోవటం మాత్రం సోనియాకు, కొంతమంది సీనియర్లకు కంటగింపుగా మారింది. 

తండ్రి చనిపోయిన బాధలో ఉంటే జగనే ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు సేకరించినవారే ఇప్పుడు జనమే నాయకుడుగా జగన్‌ను కోరుకొంటుంటే ఈర్ష్యతో నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్‌ను బ్రతికించిన పాపానికి పెద్దాయన ఎలా మరణించారో ప్రజలకు కనీస వివరణ ఇవ్వలేదు సరికదా మా మీద ప్రేమతో ఓదార్పుయాత్ర చేస్తానని మాటఇచ్చి మండుటెండలో ఏ నాయకుడూ చేయని పని చేసిన ఆ ప్రేమమూర్తికి రాజకీయ కక్షతో కళంకం అంటగట్టి అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి పంపినట్లు, కాంగ్రెస్, టిడిపి సీనియర్లు కుమ్మకై జగనన్నను జైల్లోకి పంపారు.

కాని ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే ఆ అభిమన్యుడికి జనం బలం లేదు. కానీ ఈ అభిమన్యుడికి అవసరం అయితే ప్రాణత్యాగం చేసేంత అభిమానం ఉన్న ‘జనబలం’ ఉంది. మామను వెన్నుపోటు పొడిచి, వారసుడి కూతుర్ని కోడలిగా చేసుకుని అతని నోరు మూయించి, అధికార దాహంతో ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి రెండుసార్లు సింహం చేతుల్లో చిత్తుగా ఓడిపోయి చావుతప్పి కన్నులొట్టపోయి, ఇప్పుడు బిసి, ఎస్‌సి పాట పాడే నాయకులకు, సోనియాగాంధీ కాళ్ళ దగ్గర వుంటే చాలు ప్రజాసేవ చేయకపోయినా పదవులు వాటంతట అవే వస్తాయని అనుకునే కొంతమంది సీనియర్లకు మేము త్వరలో బుద్ధిచెబుతాం.
అమ్మా విజయమ్మా! తల్లీ భారతీ! సోదరీ షర్మిల! మీకు కోట్లమంది కుటుంబ సభ్యులున్నారు. మా గుండెల్లో మీరున్నారు.
- నాగమల్లేశ్వరి, గుండాల, గుంటూరు జిల్లా


ప్రజల నడ్డి విరచడానికే జగన్ అరెస్ట్
నా పేరు పద్మ. జగనన్న అంటే మాకు ఎంతో ప్రాణం. ఎందుకంటే రాజశేఖరరెడ్డి గారు చేసిన ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు ఎంత మేలు చేశాయో ఆ పథకాలు అందుకున్న వారిలో నేనూ ఒక దానిని. నాకు వై.ఎస్.ఆర్ ఉన్నంత కాలం వికలాంగుల ఫించను అందింది. వై.ఎస్.ఆర్ ఎప్పుడైతే దురం అయ్యారో అప్పటి నుంచే నాకు ఫించను అందడం లేదు. అసలు వై.ఎస్.ఆర్ లేనప్పుడు ఈ ఫించను ఎందుకు అనిపించింది. ఓదార్పు యాత్రలో ప్రజల కోసం ఎండనకా వాననకా తీవ్ర జ్వరంలోను ఓదార్పు యాత్ర చేసిన వ్యక్తి జగనన్న. అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టడం కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా చేయడం కావాలని సోనియాగాంధి చేస్తున్న పని. ఈమె కూడా ఒక తల్లే కదా. ఒక తల్లిగా విజయమ్మ మనసు ఎంత క్షోభకు గురవుతుందో సోనియా గాంధీకి ఎందుకు అర్థం కావడంలేదు. విచారణ పేరుతో జగనన్నను జైల్లో పెట్టినప్పుడు ఎంతమంది ఇళ్ళలో పొయ్యి వెలగలేదో ఈ సి.బి.ఐ వారికి ఏమి తెలుస్తుంది?

ఈ కేంద్ర ప్రభుత్వానికి, కిరణ్ సర్కార్‌కు ఒక్కటే భయం. జగనన్న బయట ఉంటే వారికి రేట్లు పెంచడానికి, ఫీజు రీయంబర్స్‌మెంట్ నిలిపి వేయడానికి, పేద ప్రజల నడ్డి విరవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే జగనన్న నిత్యం ప్రజల కోసం జీవించే వ్యక్తి కనుక ప్రజల పక్షాన నిలచి నిరాహార దీక్షలు చేయటం, ధర్నాలు చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే జగనన్నను జైల్లో ఉంచి ప్రజల నడ్డి విరుస్తోంది ఈ సర్కారు. అసలు ఆయన చేసిన తప్పేంటి? ఓదార్పు చేయడమే జగనన్న చేసిన తప్పా? అది తప్పే అయితే మరి చిరంజీవి పీఆర్పీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ని ఎంతగా తిట్టాడు. అది తప్పుకాదా! పేద ప్రజల వద్దకు వచ్చి వారి కష్టాలు తెలుసుకుని వారికి ప్రేమ పంచడం తప్పు ఎలా అవుతుంది. కని పెంచిన కన్న తండ్రి చనిపోయిన రోజున కనీసం ఆయన సమాధి దగ్గరకు కూడా వెళ్లడానికి అవకాశం ఇవ్వకుండా జైల్లో పెట్టి సీబీఐ వారు కాలక్షేపం చేయడం ఎంత దుర్మార్గపు చర్య. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ముగుస్తుంది. ఇటువంటి రాక్షస ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఏలుతుందంటే చాలా చాలా సిగ్గుగా ఉంది.

విజయమ్మ గారూ మీరు బాధపడకండి. మీ ప్రార్థన ఆ దేవుడు తప్పక వింటారు. తప్పకుండా జగనన్న తొందరగా బయటికి వచ్చి వీళ్ళందరికి బుద్ది చెప్త్తారు. జగనన్న తొందరగా విడుదల కావాలని ప్రార్థిస్తూ నిత్యం జగనన్న వెంటే ఉండే ఓ పెద్ద అభిమాని, కాదు చెల్లి.
- పద్మ, నర్సరావుపేట


మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com

బాబుకు కలిసిరాని కాలం!


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది మొదలు పెట్టినా బెడిసికొడుతోంది. ఆయన విధానాలన్నీ తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ప్రత్యర్థులేకాదు సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ బలహీనపడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హర్షించలేదు. ఇరు ప్రాంతాల వారు విమర్శించారు. తెలంగాణ వారు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఏం చేస్తే అది చేసి నవ్వుల పాలయ్యారు. ఆ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నాలు, దీక్షలు చేస్తే దీక్షలు చేశారు. ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ కాపీ కార్యక్రమాలే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహంతో అర్ధంపర్ధంలేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి.

రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో టిడిపి పూర్తిగా బలహీనపడింది. ఉప ఎన్నికలలో పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలంగాణపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయమని, ఈ అంశాన్ని త్వరగా తేల్చమని చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడం వివాదాలకు దారి తీసింది. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనే చిచ్చు రగిల్చింది. ఈ లేఖతో తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు విమర్శించారు. బాబు లేఖల పేరుతో మోసం చేస్తున్నారని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి మండిపడ్డారు. లేఖలో స్పష్టత ఏముందో చెప్పాలని ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. లేఖల రాజకీయంతో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేశారని తెలంగాణవాదులు అంటే, సొంత జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి సీమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని టిడిపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పాదయాత్రలో చంద్రబాబును చెప్పులతో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పి, వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 వరకు తాము వెయ్యి కిలో మీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. తమ యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుందని ఆయన వివరించారు.

చంద్రబాబు పాదయాత్రకు సహకరించేది లేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తెగేసి చెప్పారు. లేఖ రాయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని అమరనాథ రెడ్డి బాధపడ్డారు. బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బాబు వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ హీనస్థితికి చేరిందన్నారు. పార్టీని ఆయన అధోగతి పాలు చేశారన్నారు.

పార్టీ అధినేత అయిన తననే ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శిస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణలో చూస్తే అలా ఉంది, సీమలో చూస్తే ఇలా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు వలసబాట పట్టారు. 2009 ఎన్నికలలో టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర రెడ్డి, వేణుగోపాల చారి, నాగం జనార్ధన రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డి, కొడాలి నాని, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటర్లు టిడిపికి చుక్కలు చూపించారు. పరిస్థితి ఇలా ఉన్నా చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీమీద మమకారం చావలేదు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ' రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నాను. సమస్యలు చూసి ఓదార్చడం కాకుండా వారిలో చైతన్యం తెచ్చి పరిష్కార దిశగా కృషి చేయాలి. మళ్లీ నేను సీఎంని అవుతాను. మధ్యతరగతిలో పుట్టినప్పటికీ ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాను. మహాత్మాగాంధీ, పూలే, ఎన్టీఆర్ సైతం అలాంటి స్థితిలోనే జన్మించి అనుక్నుది సాధించారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయే అలాంటివారిని ఆదర్శంగా తీసుకొని కృషిచేయాలి’ ' అని చెప్పారు. అంతే కాకుండా ఇటీవల బిసి డిక్లరేషన్, ఎస్ సి డిక్లరేషన్, ముస్లింలకు ఉప ప్రణాళిక....... అని చెబుతున్నారు. పదవీ వ్యామోహం ఆయనతో ఇలా మాట్లాడిస్తోంది.
source:sakshi

‘సీబీఐ దర్యాప్తు’పై చక్రం తిప్పిన చంద్రబాబు... రంగంలోకి బిల్లీరావు

‘ఐఎంజీ’ అక్రమాలపై సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు ఎత్తుగడ 
నాట్‌బిఫోర్ నాటకాలు ఫలించే అవకాశం లేకపోవటంతో తెరపైకి బిల్లీ 
సీబీఐ దర్యాప్తు జీవో 310ని కొట్టివేయాలంటూ బిల్లీరావు చేత పిటిషన్
దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయనున్న నేపథ్యంలో పిటిషన్
న్యూయార్క్‌లోని బిల్లీరావుతో లీగల్ టీం ద్వారా కథ నడిపించిన బాబు
దర్యాప్తును అడ్డుకోకుంటే నీవే ఇరుక్కుంటావంటూ బిల్లీరావుకు చంద్రబాబు కబురు 
టీడీపీ అధినేత సూచనల మేరకు ఆగమేఘాలపై పిటిషన్ తయారు
తరువాత దానిని న్యూయార్క్‌లోని బిల్లీరావుకు పంపిన వైనం
న్యూయార్క్ నుంచి సంతకాలతో పిటిషన్ రాగానే హైకోర్టులో దాఖలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఐఎంజీ భారత సంస్థకు తన హయాంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను సంతర్పణ చేసిన ఉదంతంపై సీబీఐ దర్యాప్తు జరగకుండా అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. ఐఎంజీ భారత కంపెనీ ఏర్పడిన నాలుగు రోజులకే దానికి భూములను ధారాదత్తం చేయటంలో జరిగిన భారీ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ సంసిద్ధతను వ్యక్తం చేయటంతో బాబు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభించకుండా అడ్డుకునేందుకు.. చంద్రబాబు తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబలరావును రంగంలోకి దించారు. ఐఎంజీ భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దర్యాప్తునకు ఆధారమైన జీవో 310 చట్టబద్ధతను సవాలు చేయిస్తూ బిల్లీరావు చేత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. జీవో 310ని కొట్టివేయాలంటూ హైకోర్టులో బిల్లీరావు పిటిషన్ దాఖలు చేశారు. 

కోర్టు జోక్యంతో దర్యాప్తునకు సీబీఐ సై 

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్ర రాజధాని నగరంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే 850 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు తన జేబు సంస్థ ఐఎంజీ భారత కంపెనీకి కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టి, ఆ కంపెనీకి భారీ లబ్ధి చేకూరేలా ఆ సంస్థతో పలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చంద్రబాబు చర్యల ద్వారా ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లటంతో.. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐఎంజీ భూముల వ్యవహారంలో దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతూ జీవో 310ని జారీ చేసింది. అయితే తమకు సిబ్బంది లేరనే సాకుతో ఇన్ని రోజులు సీబీఐ దర్యాప్తు జోలికి వెళ్లలేదు.

దీంతో జీవో 310 ప్రకారం ఐఎంజీ భూముల వ్యవహారంలో దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఎ.బి.కె.ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. జీవో 310 ప్రకారం ఎందుకు దర్యాప్తు చేయరని, దీనిపై వైఖరి ఏమిటని సీబీఐని నిలదీసింది. దీంతో సీబీఐ విధిలేని పరిస్థితుల్లో దర్యాప్తు చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ హైకోర్టులో గత వారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం, అక్టోబర్ 1న సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. 

నాట్ బిఫోర్ నాటకం పారదని... 

సీబీఐ ఎప్పుడయితే దర్యాప్తుకు తాము సిద్ధమని చెప్పిందో.. ఆ క్షణం నుంచి చంద్రబాబునాయుడు ఆలోచనకు పదునుపెట్టారు. ఈ కేసులో ఎలాగైనా ఇంప్లీడ్ కావాలని నిర్ణయించుకుని, హైకోర్టులో అన్నీ తానై నడిపించే ఓ కీలక వ్యక్తితో పాటు తన లీగల్ టీంను సంప్రదించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అవసరమైతే తమను ఎప్పుడూ రక్షిస్తూ వచ్చిన ‘నాట్ బిఫోర్’ నాటకాన్ని ఈసారి కూడా రక్తికట్టించాలని నిర్ణయించారు. అయితే అన్ని మార్గాలను పరిశీలించిన ఆ కీలక వ్యక్తి, ఇతర లీగల్ టీం సభ్యులు ఇంప్లీడ్ కావటం సాధ్యం కాదని, అందువల్ల ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు తన బినామీ బిల్లీరావు ఆపద్భాంధవుడిలా కనిపించారు. బిల్లీరావును రంగంలోకి దించితే ఎలా ఉంటుందని తన ఆలోచనలను లీగల్ టీం ముందుంచారు. లీగల్ టీంకు సైతం చంద్రబాబు ఆలోచన నచ్చటంతో పని మొదలు పెట్టారు. ఓ సీనియర్ న్యాయవాది ద్వారా బిల్లీరావు నంబర్‌ను చంద్రబాబు టీం సంపాదించింది. ఎక్కడో న్యూయార్క్‌లో ఉన్న బిల్లీరావును ఆ టీం సంప్రదించింది. హైకోర్టు సోమవారం సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయనున్నదని, ఈ ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు మొదలుపెడుతుందని, అదే జరిగితే మొదట ఇబ్బందిపడేది నీవేనంటూ బిల్లీరావును భయపెట్టింది. 

న్యూయార్క్ నుంచి ఆగమేఘాలపై 

సీబీఐ దర్యాప్తును అడ్డుకోవాలంటే హైకోర్టులో జీవో 310పై రిట్ పిటిషన్ దాఖలు చేయటం ఒక్కటే మార్గమని, అది నీవల్ల మాత్రమే సాధ్యమవుతుందని బిల్లీరావుకు.. చంద్రబాబు టీం స్పష్టం చేసింది. దీంతో బిల్లీరావు సైతం సీబీఐ దర్యాప్తు మొదలైతే నిజంగా తానే ఇబ్బంది పడాల్సి వస్తుందని నిర్ణయించుకుని జీవో 310ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వెంటనే చంద్రబాబునాయుడి నుంచి బిల్లీరావు వ్యవహారాలను చూస్తున్న హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరికి ఆదేశాలు వెళ్లాయి. వాస్తవానికి వచ్చే సోమవారం (అక్టోబర్ 1వతేదీన) తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ఈ నెల 24న చెప్పింది. వెంటనే ఆ మరుసటి రోజు అంటే 25న రిట్ పిటిషన్ తయారైపోయింది. తయారైన రిట్ పిటిషన్‌ను చంద్రబాబు పరిశీలనకు పంపారు. 

హైకోర్టులోని కీలక వ్యక్తి సైతం ఆ పిటిషన్‌ను పరిశీలించారు. చంద్రబాబు, ఆ కీలక వ్యక్తి ఇద్దరూ ఓకే చేయటంతో దానిని సంతకాల కోసం న్యూయార్క్‌లో ఉన్న బిల్లీరావుకు పంపారు. విదేశాల్లో ఉన్న వ్యక్తి మరో దేశంలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటే, ఆ పిటిషన్‌పై అక్కడి నోటరీ సంతకం చేయాల్సి ఉంటుంది. దీంతో బిల్లీరావు తాను దాఖలు చేయనున్న రిట్ పిటిషన్‌పై న్యూయార్క్ స్టేట్ నోటరీ క్రిస్టల్ మెకాచిన్ చేత నోటరీ చేయించారు. తరువాత బిల్లీరావు ఆ పిటిషన్‌ను తన న్యాయవాదికి పంపారు. బిల్లీరావు నుంచి పిటిషన్ అందుకోగానే అది హైకోర్టులో దాఖలైపోయింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది.. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఏం జరిగింది అనే విషయాలను ఈ సందర్భంగా బిల్లీరావు తన పిటిషన్‌లో వివరించారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం నుంచి బిల్లీరావు మొత్తం 850 ఎకరాల భూమిని పొందితే, తన పిటిషన్‌లో బిల్లీరావు తనకు ప్రభుత్వం 400 ఎకరాలు మాత్రమే కేటాయించినట్లు పేర్కొనటం విశేషం.

source:sakshi
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
అందుకే నీ పాలనంటేనే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు
విశ్వసనీయతంటే ఏంటో వైఎస్‌ను చూసి తెలుసుకో
హామీలు ఇవ్వకుండానే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు
నీలా డిక్లరేషన్లతో ప్రజలను మభ్యపెట్టలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలోబియ్యం, సంపూర్ణ మద్య నిషేధం పథకాలను రద్దు చేసిన చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత అనే మాటకు అర్థం తెలుసా? అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పాదయాత్ర సందర్భంగా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి మూలింటి మారెప్పతో కలిసి ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

భౌతికంగా లేని, తిరిగి వచ్చి సమాధానం చెప్పుకోలేని వైఎస్ రాజశేఖరరెడ్డి... కుట్రలతో కేసుల్లో ఇరికించడంవల్ల జైల్లో ఉండి తనపై విమర్శలకు జవాబు ఇచ్చే పరిస్థితి లేని జగన్‌మోహన్‌రెడ్డిలపై నిందారోపణలు చేయడం, అవహేళన చేసే విధంగా మాట్లాడటమే బాబు తన ఎజెండాగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. విశ్వసనీయత అంటే జైలుకు పంపడం, దోచుకోవడం అని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. విశ్వసనీయతంటే ఏంటో వైఎస్‌ను లేదా ఆయన కుటుంబీకులను చూసి నేర్చుకోవాలన్నారు. ‘‘ఎన్టీఆర్ 1994 ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం చేసిన రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం పథకాలు రెండింటినీ నువ్వు ముఖ్యమంత్రి కాగానే రద్దు చేశావు. ఆత్మవంచన, మోసం అంటే అదే! వైఎస్ ప్రజలకు హామీలు ఇవ్వకుండానే 2004లో అధికారంలోకి వచ్చాక రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశ పెట్టారు. ఆరోగ్యశ్రీ, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేశారు. దానినే విశ్వసనీయత, మానవత్వం అంటారు. తెలుసుకో...!’’ అంటూ చంద్రబాబుకు సూచించారు. విశ్వసనీయత ఏమిటో తెలుసు కనుకనే జగన్‌ను కుట్రలతో కేసుల్లో ఇరికించి జైలుకు పంపినపుడు ఆయనపైనే ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నాయకుడు టీడీపీని వీడి బయటకు వచ్చారని గుర్తుచేశారు. 

అది టీడీపీ పాడె యాత్ర అంటున్నారు

‘వస్తున్నా... మీకోసం’ అంటూ బాబు చేపట్టబోతున్నది పాదయాత్ర కాదని, టీడీపీకి పాడె యాత్ర అని జనం చెప్పుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు గ్రామాల్లోకి వస్తే అరిష్టమని భయపడుతున్నారనీ... గతంలో ‘ఓ స్త్రీ... రేపు రా’ అని రాసుకున్నట్లుగా, ఇపుడు ‘బాబూ... రేపు రా!’ అని రాసుకుంటారని విమర్శించారు. 

‘‘తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశావని నీ పాలనను గుర్తు చేస్తావు? ఒక్క సంక్షేమ పథకమైనా ప్రవేశపెట్టావా? అసలు నీ పాలన అంటేనే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. కరెంటు దొంగతనం చేశారని గ్రామాల్లోకి పోలీసులు వచ్చి రైతులను పట్టుకెళ్లిన అరాచకాన్ని వారు మర్చిపోలేదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ విలీనం అయిపోతుందని బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని... అసలు తమ పార్టీ ఎందుకు కలిసిపోతుందని ఆయన ప్రశ్నించారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ రెండింటికీ కలిపి వచ్చిన ఓట్లకంటే వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆరు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని అలాంటపుడు తామెందుకు విలీనం అవుతామని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి ప్రభుత్వాన్ని కాపాడుతోంది చంద్రబాబేనని విమర్శించారు. ప్రజలకేదైనా చేయాలనుకుంటే అధికారంలో ఉన్నపుడు చేసి ఉండాలి గాని డిక్లరేషన్ డ్రామాలెందుకని దుయ్యబట్టారు. వైఎస్ ఎపుడూ డిక్లరేషన్లు చేయలేదని, ప్రజల అవసరాలేమిటో మనసుతో ఆలోచించి అమలు చేశారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. 

source: sakshi

Naidu padayatra: 'Oh Babu Repu Raa!'


There is a superstition in certain rural areas of Andhra Pradesh to drive away ghosts and evil forces. Whenever there is a rumour about a ghost knocking the doors of houses during the night time, the villagers write on the front door saying: “Oh Stree Repu Raa” (Oh woman, come tomorrow); so that whenever the ghost comes to the house to knock the door, it reads the sentence and goes back. Since the writing remains on the doors permanently, the ghost will never get an opportunity to enter their houses.
YSR Congress party leaders are comparing Telugu Desam Party president N Chandrababu Naidu to such a ghost, while criticising his proposed Padayatra from October 2.
“If he tries to enter the villages, the people will be compelled to write on the walls saying – Oh Babu, Repu Raa; so that he would never be allowed to come to their villages. For nine years, the people of Andhra Pradesh had to face the sufferings in the form of Naidu ghost,” YSR Congress party leader G Srikanth Reddy said.
He said even the TDP leaders do not have faith on Naidu coming back to power, as he had lost his credibility. “The people would never believe him and they would never receive him during the padayatra,” he asserted.

source :http://www.greatandhra.com/viewnews.php?id=40941&cat=15&scat=16

YSRCP MLA Srikanth reddy Press conference on 29th Sep 2012

Friday, 28 September 2012

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను సాగతీసేందుకు సీబీఐ అధికారులు రోజుకో ఎత్తుగడ


*ఆ సాకుతో వాయిదా కోరిన సీబీఐ న్యాయవాది
*తాను వాదనలు వినిపించే అవకాశం ఉన్నా మౌనం
*కొత్త న్యాయవాది మరో కేసులో బిజీగా ఉన్నారని నివేదన
*సీబీఐ తీరుపై జగన్ తరఫు న్యాయవాది అభ్యంతరం
*ప్రతిసారీ ఇదే తంతు కొనసాగిస్తోందని నివేదన
*సోమవారం విచారించాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థన
*5వ తేదీన విచారిస్తామన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను సాగతీసేందుకు సీబీఐ అధికారులు రోజుకో ఎత్తుగడ అనుసరిస్తున్నారు. సుప్రీంకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నాటి నుంచి, నోటీసులు అందుకోవడం.. కౌంటర్ దాఖలు చేయడం.. తరువాత వాదనలు వినిపించటం.. ఇలా ప్రతి విషయంలోనూ జాప్యం చేస్తూ వస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసును తేల్చే అవకాశం సుప్రీంకోర్టుకు ఏ మాత్రం ఇవ్వటం లేదు. కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో వాయిదా కోరుతూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా సీబీఐ యథావిధిగా వాయిదా కోరారు.

అసలు సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందా..? శుక్రవారం కూడా అందులో భాగంగానే కేసు విచారణ వాయిదా కోరిందా..? సుప్రీంకోర్టు విచారణ చేపడితే జగన్‌కు ఎక్కడ బెయిల్ వస్తుందో అన్న ఆందోళనతో ఉన్న సీబీఐ అధికారులు.. ఎలాగైనా దానిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేసును వాయిదా వేయాలని కోరారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను గమనించిన న్యాయ నిపుణులు ఇదే కారణమని స్పష్టం చేస్తున్నారు. సీబీఐ అధికారులకు, ఆ సంస్థను వెనుక నుంచి నడిపిస్తున్న పెద్దలకు జగన్ బెయిల్‌పై బయటకు రావటం ఎంత మాత్రం ఇష్టమున్నట్లు కనిపించటం లేదని, అందుకే ప్రతిసారీ ఏదో ఒక కారణం చూపుతూ కేసును విచారణకు రాకుండా సీబీఐ ద్వారా అడ్డుకుంటున్నారని, ఇదంతా సుప్రీంకోర్టు గమనిస్తూనే ఉందని వారు చెప్తున్నారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగా వాయిదాలు కోరుతోందనేందుకు వారు కొన్ని ఉదాహరణలను కూడా చూపుతున్నారు.

కౌంటర్ దాఖలు మొదలు ఇదే తంతు..!

జగన్‌మోహన్‌రెడ్డి జూలై 27న సుప్రీంకోర్టులో రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సీబీఐ రిజిస్ట్రీలో సృష్టించిన అడ్డంకులను దాటుకుని అది రెండు వారాల తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆగస్టు 10న బెయిల్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, సీబీఐకి నోటీసులు జారీ చేసి, కౌంటర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ఏకంగా దాదాపు నెల రోజుల తరువాత అంటే ఈ నెల 7న తన కౌంటర్‌ను దాఖలు చేసిన విషయాన్ని న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి సీబీఐ నెల రోజులకన్నా ముందే కౌంటర్ దాఖలు చేసి ఉండొచ్చునని, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్నీ ఇప్పటికే పలుమార్లు పలు కోర్టుల్లో కౌంటర్ల రూపంలో సీబీఐ ఉంచిందని, అందువల్ల కౌంటర్ దాఖలుకు అంత సుదీర్ఘ సమయం అవసరం లేదని వారు చెప్తున్నారు. అయినప్పటికీ నెల రోజుల గడువు కోరిందంటే, ఈ కేసులో మున్ముందు తాము ఎన్ని ఎత్తుగడలను అనుసరించబోతున్నామో అన్న విషయాన్ని సీబీఐ ఆనాడే స్పష్టం చేసిందని అంటున్నారు.

ఒక వ్యక్తి బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వచ్చాడంటే, అందులో అత్యవసరం ఉందని భావించాలని, బెయిల్ పొందటమనేది నిందితునికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కని, ఉద్దేశపూర్వంగా విచారణను వాయిదా వేయించటం ద్వారా సీబీఐ ఆ హక్కును హరిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యలో సీబీఐ తన న్యాయవాదిని మార్చింది. దీనిపై ఓ వర్గం మీడియా చేతికొచ్చిన కథనాలను అల్లేసింది. ఇప్పటి వరకు జగన్ కేసులను వాదిస్తూ వచ్చిన అశోక్‌భాన్ వంటి సీనియర్ న్యాయవాదులను కాదని, కొత్త న్యాయవాదిని నియమించటం వెనుక ఏదో మతలబు ఉందంటూ కథనాలను వండి వార్చింది. అయితే తాజాగా కూడా సీబీఐ మళ్లీ న్యాయవాదిని మార్చింది. మోహన్‌జైన్ స్థానంలో అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌కు కేసు బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి శుక్రవారం నాడు జరిగిన విచారణకు సీబీఐ తరఫున అశోక్‌భాన్ హాజరయ్యారు.

ఆయనే స్వయంగా ధర్మాసనాన్ని వాయిదా కోరారు. న్యాయవాదిని మార్చామని, మోహన్ పరాశరన్ వాదనలు వినిపిస్తారని స్వయంగా చెప్పారు. న్యాయవాది మార్పు వెనుక మతలబు ఉందనుకుంటే.. అశోక్‌భాన్ ఎందుకు శుక్రవారం వాదనలు వినిపించలేదు..? కోర్టులో ఉన్న సీబీఐ జేడీ వాదనలు వినిపించాలని అశోక్‌భాన్‌ను ఎందుకు కోరలేదు..? సుప్రీంకోర్టులోనే ఉన్న మోహన్ పరాశరన్ ఎందుకు వాదనలు వినిపించేందుకు రాలేదు..? మళ్లీ న్యాయవాదిని మార్చామని, ఆయనే వచ్చి వాదనలు వినిపిస్తారని అశోక్‌భాన్ స్వయంగా ఎందుకు చెప్పారు..? అనేవి న్యాయ నిపుణుల సందేహాలు. ఈ సందేహాలకు సమాధానం ఇవ్వాల్సింది సీబీఐ, దాని వెనకుండి కథనడిపిస్తున్న ఢిల్లీపెద్దలే.

విచారణ అక్టోబర్ 5కు వాయిదా...

తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. కేసు విచారణకు రాగానే సీబీఐ తరఫున ఇప్పటికే పలుమార్లు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ లేచి నిలబడ్డారు. ఈ కేసులో సీబీఐ తరఫున వాదనలు వినిపించే న్యాయవాదిని మార్చామని, అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ ఇకపై ఈ కేసు బాధ్యతలను చూసుకుంటారని ధర్మాసనానికి అశోక్‌భాన్ వివరించారు. మోహన్ పరాశరన్ సుప్రీంకోర్టులోని మరో కోర్టులో వాదనలు వినిపిస్తూ బిజీగా ఉన్నారని, అందువల్ల ఈ కేసును వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. వాస్తవానికి సీనియర్ న్యాయవాది అయిన అశోక్‌భాన్ వాదనలు వినిపించి ఉండొచ్చు. జగన్ కేసులో అశోక్ భాన్ అనేక సందర్భాల్లో పూర్తిస్థాయి వాదనలు వినిపించారు.

అయితే సీబీఐ ప్రధాన ఉద్దేశం కేసును వాయిదా వేయించటం కాబట్టి, ఆయన వాదనలు వినిపించకుండా మిన్నకుండిపోవటమే కాకుండా, కేసును వాయిదా వేయాలని కోరినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కేసు వాయిదాకు జగన్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియం అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ ప్రతిసారీ ఇదే విధంగా ఏదో ఒక కారణంతో వాయిదా కోరుతోందని, ఇది ఎంత మాత్రం సరికాదని గట్టిగా చెప్పారు. ఈ కేసును సోమవారం విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. సోమవారం తమకు వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయని.. అందువల్ల ఈ కేసును శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. 



source:sakshi

వీళ్లు నిజమైన బందీలు! జగన్ కోసం - 12

నిన్నటి దినాన బెయిల్ వస్తుందని ఎంతో ఎదురుచూశాము. కానీ సీబీఐ మళ్ళీ వంకరబుద్ధి చూపించింది. సీబీఐ తరపున రావలసిన లాయర్ రాలేదు. అందుకని ఒక వారం వాయిదా పడింది. మొదట మేమందరం నిరుత్సాహపడినా తరువాత నాకు మా మామగారు ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకువచ్చాయి... ‘ధైర్యంగా వుండాలి - దేనినైనా మనం ఎదుర్కోవడానికి వెనకాడకూడదు, భయపడకూడదు’. ఆయన జగన్‌కు చెప్పేవారు - ‘‘స్థితప్రజ్ఞత ఉండాలి జగన్. మంచి జరిగితే మరీ పొంగిపోవడం, అనుకున్నట్టు జరగకపోతే మరీ కృంగిపోవడం ఉండకూడదు’’ అని! జగన్ వాళ్ళ నాన్న మాటలు వినీ వినీ స్థితప్రజ్ఞత ఒంట బట్టించుకున్నాడు. దేనికీ అదరడూ బెదరడు. నాకు ఈ సీబీఐ, కాంగ్రెస్, టీడీపి వాళ్ళని చూస్తే కోపం కాదు, జాలి వేస్తుంది. జైల్‌లో పెట్టినా కూడా కోపం, ద్వేషం, దిగులు, భయం 

ఎరగని స్వేచ్ఛాజీవి జగన్. కానీ బయటవున్న వీళ్లు కుళ్లు, కుతంత్రాలకు, పగ, ద్వేషం, ఈర్ష్యలకు బందీలు. నిజంగా జగన్‌కాదు జైల్‌లో ఉండేది... జగన్ ఊహను కూడా చూసి భయపడే ఈ సీబీఐ, కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో గ్యాంగ్ నిజమైన ఖైదీలు.



- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్


అప్పుడేమి చేస్తున్నారు వీళ్లంతా....?
పాఠకుల స్పందన

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ అభిమానులే. కాని రాజశేఖర్‌రెడ్డి చనిపోయి జగన్‌కు ఆ పార్టీ భవిష్యత్తు లేకుండా చెయ్యాలనుకొంటున్నదని తెలిసేంతవరకు కాంగ్రెస్ వేరని, రాజశేఖరరెడ్డి వేరని తెలియలేదు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తరువాత జగన్‌ను ముఖ్యమంత్రిని చెయ్యాలని మీడియాలో వస్తుంటే మా ఆశలన్నీ మళ్ళీ చిగురించాయి. 

అదే సమయంలో యాధృచ్ఛికంగా జగన్‌ను కడపలో ఓ షాప్ ఓపెనింగ్‌లో కలవడం జరిగింది. తనను ఓసారి చూడాలని నిలబడి వుంటే, తనే మా దగ్గరికి వచ్చి ‘ఏమ్మా బాగున్నారా... ఏదైనా అవసరం వుండి వచ్చారా? ఎవరూ బాధపడొద్దు. దేవుడున్నాడు. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్తుంటే... ఆయన్ని మేము ఓదార్చాల్సిన సమయంలో మమ్మల్ని ఓదారుస్తుంటే మాటలు రాక నిలబడ్డాను. అప్పుడే తెలిసింది ఓ లీడర్‌కు కావలసిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయని, జగన్ ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఖచ్చితంగా బాగుంటుందని. తర్వాత జగనన్న ఓదార్పు యాత్ర ప్రారంభించడం, అది అధిష్టానానికి ఇష్టం లేకపోవడం... ఎన్నో సమస్యలు సృష్టించడం తెలిసిందే. తర్వాత అధిష్టానాన్ని ఒప్పించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఆ పార్టీలో ఇమడలేక తనే బయటికి వచ్చెయ్యడం జరిగింది. 

అప్పటి నుంచి సిబిఐ ఈడీ ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఒక మాట అడగాలనుకుంటున్నాను. నిజంగా రాజశేఖర్‌రెడ్డి అంత అవినీతికి పాల్పడివుంటే, జగన్ దానివల్ల అంత లబ్ధి పొంది వుంటే, అది ఒక్కరోజులో, ఒకరి వల్ల జరిగుండదు కదా. అప్పుడు ఏమి చేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు వీళ్లని ఆడిస్తున్న ఢిల్లీ పెద్దలకు వైయస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన పాలనలోని అవినీతి కనబడలేదా? ఇప్పుడు ఆయన ప్రాణాలతో లేరని, మాట్లాడలేరని తెలిసి జగన్‌ను ఏమి చెయ్యాలనుకుంటున్నారు? ఒక్కమాట మాత్రం చెప్పగలను. జగన్ తప్పు చేయలేదన్నది స్పష్టం. జగన్ తప్పు చేయాలనుకుంటే చంద్రబాబులా బినామీల పేరుతో సంస్థలు స్థాపించేవారు. ముందు ఆ 26 జీవోలు సక్రమమో, అక్రమమో తేల్చండి. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే రద్దు చేయండి. అంతేకాని ద్వేషంతో జగన్‌ను అణగదొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. 

రాష్ట్రంలో తొంభై శాతం జనం జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నారు. ఎంతోమంది తల్లులు తన బిడ్డే అనుకుని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఎంతో మంది తల్లుల ఆశీర్వాదంతో జగన్ నిర్దోషిగా బయటికి వస్తాడు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో జగన్ ఖచ్చితంగా సిఎం అవుతారు. మనస్ఫూర్తిగా ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుకి కుళ్ళు, కుతంత్రాలు కొట్టుకునిపోతాయి. అంతిమ విజయం జగనన్నదే అవుతుంది. 

- రక్కాసి శ్రీవాణి
జిఎంసి బ్యాక్‌సైడ్, రాజంపేట

క్విడ్‌ప్రోకో అయితే లాభాలు ఎందుకు పంచుతారు?

క్విడ్‌ప్రోకో అయితే లాభాలు ఎందుకు పంచుతారు?
భారతిలో పెట్టుబడులకు రూ. 617 కోట్ల లాభాలు వచ్చాయి.. సాక్షిలో పెట్టుబడుల విలువ 
రూ. 600 కోట్లకుపైగానే ఉంటుంది
రాక్‌కు నోటీసులిచ్చినట్లు చార్జిషీట్‌లో చెప్పలేదు 
నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. వచ్చేనెల 8న తీర్పు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులకు క్విడ్‌ప్రోకోతో సంబంధమే లేదని నిమ్మగడ్డ తరపు న్యాయవాది రాజశేఖర్‌రావు హైకోర్టుకు నివేదించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా జగన్ కంపెనీల్లో ప్రసాద్ 50 శాతం పెట్టుబడులు పెట్టారని వివరించారు. బెయిల్ కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ సముద్రాల గోవిందరాజులు శుక్రవారం మరోసారి విచారించారు. 

లాభాల కోసమే 2006 నుంచి 2010 వరకు జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారని రాజశేఖర్‌రావు చెప్పారు. మొత్తం రూ.854 కోట్లు పెట్టుబడులు పెట్టారని, భారతీ సిమెంట్‌లో వాటాలను విక్రయించగా వచ్చిన లాభాల్లో రూ.617 కోట్లు నిమ్మగడ్డకు తిరిగి ఇచ్చేశారని తెలిపారు. సీబీఐ ఆరోపిస్తున్నట్లుగా ‘క్విడ్‌ప్రోకో’ జరిగి ఉంటే లాభాలను ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం సాక్షిలో రూ.230 కోట్లు పెట్టుబడిగా ఉన్నాయని, దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికల్లో సాక్షి ఏడో స్థానంలో ఉందని చెప్పారు. సాక్షిలో నిమ్మగడ్డకు రూ.600 కోట్లకుపైగా విలువ చేసే 20 శాతం వాటా ఉందని వివరించారు. లాభాల కోసం పెట్టిన పెట్టుబడులను కూడా సీబీఐ లంచం కింద చూపుతూ వాస్తవ విరుద్ధమైన, పొంతన లేని వాదనలను వినిపిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు.

అపోహతోనే అరెస్టు చేసింది

రాక్ ప్రతినిధులుగా సీఈవో ఖతర్ మసూద్, జగన్నాథంలు వారికి వారే ప్రకటించుకున్నారని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి క్రౌన్ యువరాజు వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయంగా లేఖ రాసిన విషయాన్ని మాత్రం సీబీఐ దాచి పెట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని చార్జిషీట్‌లో కూడా ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో మిగిలిన వారంతా బయటే ఉన్నారని, నిమ్మగడ్డను మాత్రం అరెస్టు చేశారన్నారు. కేసు నమోదు చేసినప్పటినుంచి దర్యాప్తును అడ్డుకున్నట్లుగానీ, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారనేందుకు చిన్న ఫిర్యాదు, ఆధారం కూడా సీబీఐ చూపలేదని, కేవలం అపోహతోనే అరెస్టు చేసిందని చెప్పారు. రాక్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఒప్పందం జరిగిందా లేదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని.., దీనిపై దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

రైతులకు పరిహారం పంపిణీ విషయంలో సీబీఐ పొంతనలేని వాదన చేస్తోందన్నారు. మార్కెట్ ధర ప్రకారం జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన మేరకే వాన్‌పిక్ యాజమాన్యం రైతులకు పరిహారాన్ని పంపిణీ చేసిందన్నారు. వాన్‌పిక్‌పై సీబీఐ ఇటీవల కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పలేదని, రాక్‌కు నోటీసులు జారీచేసిన విషయాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. తుది విచారణలో నిమ్మగడ్డ నిజమైన పెట్టుబడిదారుడని తేలితే ఇన్ని రోజులు జైల్లో ఉన్నందుకు ఆయనకు జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చగలరని ప్రశ్నించారు. నిమ్మగడ్డను అరెస్టు చేసి ఇప్పటికే 140 రోజులు దాటిందని, దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వచ్చేనెల 8కి వాయిదా వేశారు.

source: sakshi

చిచ్చు రేపుతున్న బాబు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అన్ని విధాలా రాజకీయ పలుకుబడి కోల్పోయి అప్రతిష్ట పాలైన టీడీపీ అధినేత చంద్రబాబు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, అందుకే ఆయన కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... తన తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు... మళ్లీ బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ అని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. 

‘వస్తున్నా...మీ కోసం’ అని పేరు పెట్టుకుని అసలు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలో డైలమాలో పడ్డారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అన్యాయంగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించారని... చివరకు న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. తానే పెద్ద మాదిగ అనే విధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబును మాదిగలు ఎంత మాత్రం నమ్మరని నల్లా సూర్యప్రకాష్ చెప్పారు. తొమ్మిదేళ్లలో మాదిగలకు ఆయన ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు. నమ్మకానికి వైఎస్ మారుపేరని... నమ్మక ద్రోహానికి బాబు పెట్టింది పేరని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

source: sakshi

కాంగ్రెస్, టీడీపీల చేతిలో సీబీఐ పావు


కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న నీచమైన రాజకీయాల్లో సీబీఐ పావుగా మారి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధింపులకు గురిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 జీవోలకు సంబంధించిన కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. కీలక పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్‌ల కన్నా.. ఏ అధికార హోదా లేకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏవిధంగా కేసును ప్రభావితం చేస్తారో సీబీఐ ప్రజలకు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో మంత్రులు, అధికారులకు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కు మరో న్యాయమా.. అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ తీరును ఎండగట్టారు. ‘‘ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తిస్తున్న ధర్మాన ప్రసాదరావు, 25 మంది అధికారులు సాక్షుల్ని ప్రభావితం చేయరట! ప్రతిపక్షంలో ఉండి నిరంతరం రోజుకు 16 గంటలు జనం మధ్య తిరిగే వ్యక్తి ప్రభావితం చేస్తారట! అది కూడా చార్జ్జిషీట్ ఫైల్ చేసి 280 రోజులైన తర్వాత. అన్యాయంగా, అక్రమంగా జైల్లో బంధించి ఇప్పటికి 123 రోజులు పూర్తయినా సీబీఐ ఇలాంటి అర్థంపర్థంలేని విషపూరిత వాదనలు ఇంకా చేస్తోంది’ అని దుయ్యబట్టారు. ‘ఒకే కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో సీబీఐ కొందరిని అరెస్టు చేసి మిగతావారిని ఎందుకు చేయడం లేదు? కేవలం జగన్‌ను అరెస్టు చేయడానికే మోపిదేవిని అరెస్టు చేశారా?’ అని ప్రశ్నించారు. 

‘భారత చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత మామూలుగానైతే 60 రోజులకు, లేదా 90 రోజులకు కచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ తన వంకరవాదనను కొనసాగిస్తోంది’ అని మండిపడ్డారు. వాన్‌పిక్ కేసులో సీబీఐ నాటకం బయటపడిందని, భూకేటాయింపుల్లో జగన్ ప్రమేయం లేదంటూ తప్పని పరిస్థితుల్లో హైకోర్టులో సీబీఐ న్యాయవాది అంగీకరించారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని అన్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రజల దీవెనలు, అభిమానం, దేవుని ఆశీస్సులతో అక్టోబర్ 5న జగన్ తప్పక బయటకొస్తారని అంబటి పేర్కొన్నారు.

source:sakshi

జగన్ కోసం ఇష్టదైవాలకు ప్రార్థన


చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక నేత కోసం రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు, ప్రార్ధనలు, ప్రత్యేక పూజలు, పాదయాత్రలు జరుగుతున్నాయంటే ఆ నాయకునికి ప్రజాదరణ ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. కక్ష, ఈర్ష్య, కుతంత్రాలతో అన్యాయంగా అరెస్ట్ చేసి 123 రోజుల నుంచి జైలులో ఉంచిన నేత విడుదల కావాలని కోరుతూ అన్ని మతాల, వర్గాల ప్రజలు తమతమ ఇష్టదైవాలాను ప్రార్థిస్తున్నారు. అంతటి ప్రజాభిమానం పొందిన నేత ఎవరో ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఆయనే యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి. తన తండ్రి దుర్మరణం చెందిన తరువాత నల్లకాలువ వద్ద ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ఆయన కాంగ్రెస్ పార్టీని నుంచి బయటకు వచ్చారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణ వార్త విని తట్టుకోలేక ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్దిపొందిన వారు, ఆయనంటే అత్యంత అభిమానం గల పలువురు ప్రాణాలు విడిచారు. వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆ మహానేత తనయుడు జగన్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్షణం ఆ రక్తంలోనే ఉంది. తన తండ్రి నుంచి ఆయనకు సంక్రమించింది. ఆయన ఓదార్పు యాత్రకు అద్వితీయమైన ప్రజాస్పందన వచ్చింది. ఎక్కడకు వెళ్లినా జనం వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఆయన ప్రయాణించే రోడ్డు వెంట బారులు తీరారు. ఆయనను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. పలుచోట్ల ఆయన పాల్గొన్న సభలకు నేల ఈనిందా అన్నట్లు జనం తరలి వచ్చారు. జనం జగన్ లో ఆ మహానేతను చూసుకున్నారు. వెల్లువెత్తిన ప్రజాభిమానానికి కాంగ్రెస్ నేతలే ఖంగుతిన్నారు. వారి కుయుక్తులన్నీ ఉపయోగించి, అధిష్టాన వర్గానికి ఉన్నవీ లేనివీ చెప్పి జగన్ ను పార్టీ నుంచి బయటకు పంపేవరకు నిద్రపోలేదు. సొంత పార్టీలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక ప్రతిపక్షం వారు ఎంత వణికిపోయి ఉంటారో ఊహించుకోవచ్చు. 

మాట నిలబెట్టుకునేందుకు, ఓదార్పు యాత్ర కొనసాగించేందుకు ఆయన ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని వీడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు. ఓదార్పు యాత్ర కొనసాగిస్తూనే, ప్రజా సమస్యలపై పోరాటం మొదలు పెట్టారు. రైతుల కోసం, విద్యార్థుల కోసం దీక్షలు చేపట్టారు. చేనేత కార్మికుల దీక్షలకు మద్దతు పలికారు. అతి కొద్ది కాలంలోనే తిరుగులేని నాయకుడుగా జగన్ ఎదిగిపోయారు. ఈ నేపధ్యంలోనే ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటి ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాంతో ప్రజలకు ఆ మహానేత సువర్ణ యుగాన్ని జగన్ మాత్రమే తీసుకురాగలరన్న నమ్మకం ఏర్పడింది. వెళ్లిన ప్రతిచోట జగన్ పట్ల జనం ప్రేమాభిమానాలను చూపసాగారు. ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నినదించారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నది జనాభిప్రాయంగా స్థిరపడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించే ప్రజా మద్దతును చూసి కాంగ్రెస్, టిడిపి ఓర్వలేకపోయాయి. రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. కుట్రలు పన్నాయి. సీబిఐని తోడు చేసుకున్నాయి. సిగ్గులేకుండా బరితెగించాయి. మంత్రి మండలి అక్రమంగా జీఓలు జారీ చేసిందని, ప్రభుత్వంతో సంబంధంలేని, సచివాలయం మొఖం చూడని జగన్ ను అన్యాయంగా అరెస్ట్ చేయించారు. జగన్ బెదరలేదు. చిరునవ్వు చెక్కు చెదరకుండా ధైర్యంగా ఉన్నారు. 

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి ఆడుతున్న నాటకాన్ని అర్ధం చేసుకున్నారు. చంద్రబాబు ఆస్తుల విషయంలో, జగన్ విషయంలో సీబిఐ ఎలా వ్యవహరించిందో చూశారు. అసలు జీఓలు జారీ చేసిన మంత్రులు పట్ల, జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో కూడా చూస్తూనే ఉన్నారు. జగన్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆయన త్వరలోనే విడుదలవుతారని వారు నమ్ముతున్నారు. న్యాయవ్యవస్థ పట్ల అచంచలమైన విశ్వాసంతో వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. కొందరు కాలినడకన ఏడుకొండలెక్కారు. మరికొందరు మోకాళ్లతో తిరుమల కొండెక్కారు. ఇంకొందరు పాదయాత్రలు చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఐదు రకాల హోమాలు చేశారు. నానక్‌రాంగూడలోని శ్రీ శివమహంకాళీ హనుమంతగిరి క్షేత్రంలో 18 మంది వేద పండితులు శ్రీ లక్ష్మీగణపతి మూలమంత్ర హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, సుదర్శన పారాయణ హోమం, శ్రీ చండీ పారాయణ హోమం చేశారు. జగన్ క్షేమంగా బెయిల్ పై బయటకు రావాలని కోరుతూ గుంటూరులో 20 మంది వేద పండితులతో చతురావృత గణపతి హోమాన్ని నిర్వహించారు. మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు గుంటూరు జిల్లా వేమూరు నుంచి విజయవాడ మేరీమాత ఆలయానికి నడిచి వెళ్లారు. 

తమకు విద్యుత్ కష్టాలు తీరేది, గిట్టుబాటు ధరలు లభించేది జగన్ పాలనలోనేనని రైతులు ఎదురు చూస్తున్నారు. తమ చదువులు కొనసాగేది ఆ యువనేత పాలనలోనని పేద విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తమ బాధలు తీర్చే నేత జగనేనని చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నారు. తమకు ఉపాధి లభించేది యువనేత తెచ్చే ఆ మహానేత స్వర్ణయుగంలోనేనని యువత ఎదురు చూస్తోంది. అర్హులందరికీ ఫించన్ అందించే మాటతప్పని నేత జగన్ అని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఎదురు చూస్తున్నారు. ఇంత మంది ఎదురు చూసే జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆశిద్ధాం.

source:sakshi

బాబును మైనార్టీలు నమ్మరు: రెహ్మాన్

హైదరాబాద్‌: 2014లో టీడీపీకి 10 సీట్లు కూడా రావని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ రెహ్మాన్‌ అన్నారు. చంద్రబాబు మాటలను మైనార్టీలు నమ్మరని చెప్పారు. బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబుపై ముస్లింలకు నమ్మకం లేదన్నారు. మైనార్టీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని రెహ్మాన్‌ అన్నారు. 

గురువారం హైదరాబాద్‌లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న తమ ఆలోచనను వైఎస్ రాజశేఖరరెడ్డి కాపీ కొట్టారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ. 2500 కోట్లతో ముస్లింలకు ఉప ప్రణాళిక ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

source: sakshi

Minorities Not Trust Babu: Rehman

YS Jagan followers devout prayers

Ambati Rambabu Press Meet at YSRCP office

చంద్రబాబు సీమ ద్రోహి: బాలనాగిరెడ్డి

మంత్రాలయం(కర్నూలు): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరులోని తన స్వగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నమ్మి చేరదీసిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తాజాగా సీమకూ ద్రోహం చేశారన్నారు. ప్రధానికి ఆయన రాసిన లేఖను పరిశీలిస్తే.. సీమలో పుట్టి, ఇక్కడి గాలి పీల్చి తెలంగాణకు మద్దతు పలకడం చూస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమేనని మండిపడ్డారు. ఎన్టీఆర్ వారసుల్ని దూరం పెట్టి తన కుమారుడు లోకేష్‌కు రాజకీయపట్టం కట్టేందుకే పాదయాత్రకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని ఆయన ఆరోపించారు.

source:  sakshi

State wide prayers for YS Jagan release

YS Jagan Mohan Reddy Bail Plea adjourned to OCT 5th

Thursday, 27 September 2012

జగన్ బెయిల్ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం దీనిపై తదుపరి విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. తమ తరపు న్యాయవాది మారారని... విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం మన్నించింది.

సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, సీనియర్ న్యాయవాది అశోక్ బాన్, జగన్ తరపున గోపాల్ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ తో కూడిన ధర్మాసనం ముందుకు ఈకేసు విచారణకు వచ్చింది. వాస్తవానికి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 14ననే ధర్మాసనం ముందుకు వచ్చినా... సీబీఐ కౌంటర్ పిటిషన్ పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు విచారణను నేటికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్ పై విచారణ తిరిగి అక్టోబర్ 5న జరగనుంది.

SUPREME COURT ADJOURNS JAGAN'S BAIL PETITION

SUPREME COURT ADJOURNS JAGAN'S BAIL PETITION

   to next Friday



I want justice to be served : YS Bharathi

న్యాయం వర్థిల్లాలని కోరుకుంటున్నా... జగన్ కోసం - 11


జగన్ విషయంలో సీబీఐ నిటారుగా నిలబడి దాని పని అది చేసుకుపోవడం లేదు. అది కాంగ్రెస్ హైకమాండ్ ముందు వంగి కాళ్ళకు దణ్ణం పెడుతోంది. ఇది దేశంలో ప్రధాన పత్రికలు తమకు తాముగా చెప్పిన మాట. నిజానికి ఈ కేసు జగన్ ఆస్తుల కేసు కాదు. ఇది 2004-2009 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోలు సక్రమమా లేక అక్రమమా తేల్చాలన్న కేసు...

ఈరోజు జగన్ బెయిల్ సుప్రింకోర్టులో విచారణకు రానున్నది. కచ్చితంగా నాలుగు నెలల క్రితం 27వ తేదీ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అరెస్టు సంగతి మాకు చెప్పారు. కొన్ని నెలలుగా వినబడుతున్న వార్తే అయినా - నేను, మా అత్తగారు ఆ మాట వినలేకపోయాం. దానిని వినడానికి సైతం మా మనసు ఒప్పుకోవడం లేదు. ఈరోజుకి అన్యాయంగా అరెస్టు చేసి 123 రోజులు. ఎలాంటి తీర్పు వస్తుందోనని మా కుటుంబంతోపాటు జగన్‌ను తమ ఇంటి బిడ్డగా భావించే కోట్లమంది ఎదురు చూస్తున్నారు. మన రాజ్యాంగం ప్రకారం, మన దేశ చట్టాల ప్రకారం జగన్‌కు బెయిల్ వస్తుందని, అలా రావాలని ఎంతోమంది తమ తమ పద్ధతుల్లో పార్థనలు చేస్తున్నారు. జగన్ పట్ల ప్రజలకు ఉండే ప్రేమనే ఈ పెద్దపెద్ద నాయకులు సహించలేకుండా ఉన్నారనుకంటా. అందుకే జగన్‌ను ఎలాగైనా తొక్కేయాలని పార్టీలకు అతీతంగా చేతులు కలుపుతూ, ఎలాగైనా సరే జగన్‌కు బెయిల్ రాకుండా చెయ్యాలని కష్టపడుతున్నారు. కాని వీళ్లు జగన్‌ను ఎంతగా తొక్కేయాలనుకుంటే దేవుడు, ప్రజలు అంతగా జగన్‌ను పైకి ఎత్తి పట్టుకుంటున్నారు.

ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా ఈ మూడు సంవత్సరాలలో చేసిన కుట్రలు, కుతంత్రాలు, జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి వారు చేసిన పనులు బహుశా మన దేశంలోనే కాదు... ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగలేదనుకుంటా. ఒక అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక్క మనిషిని (జగన్‌ను వీళ్లు టార్గెట్‌గా చేసుకున్నప్పుడు మొదట్లో జగన్‌కు వేరే పార్టీ కూడా లేదు) వేధించడం ఎక్కడా కనీవినీ ఎరుగలేదు. కాంగ్రెస్ మరియు టిడిపి ఏ ప్రజా సమస్యనో, ఏ అన్యాయానికి ప్రతిగానో చేసిన పోరాటం కాదిది. ప్రజల మనసులలో చెరగని వైయస్‌ఆర్ గారి ముద్రను తుడిచేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఒక చనిపోయిన మనిషిని గురించి ఎవ్వరు చెడుగా మాట్లాడరు. అది కనీస మానవత్వం. కానీ ప్రజల కోసం ప్రాణాలు పెట్టి తన జీవితం చివరి నిమిషం వరకు ప్రజలకోసం తపించిన మనిషిని ఎంత అన్యాయంగా మాట్లాడారు. ఆయన మీద వున్న ప్రేమను ప్రజలు జగన్‌పై చూపడం ఓర్చుకోలేకపోయారు. అందుకే ఆయనను ప్రజల మనసుల నుంచి తీసివేయాలని, జగన్‌ను ప్రజల ప్రేమకు దూరం చేయాలని ఇంతవరకు కథ నడిపించారు. ప్రజల పక్షాన నిలబడి తమను ఎన్నుకున్న ప్రజలకోసం పనిచేయవలసిన బాధ్యతను విస్మరించి, సినిమా విలన్ల కంటె అన్యాయంగా, వికృతంగా ప్రవర్తించారు. అందుకే ప్రజలు వారిని ఛీదరించుకుంటున్నారు. జగన్‌కు మేమున్నామంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

వైయస్సార్‌గారి మరణవార్త విని చనిపోయిన వారిని పరామర్శిస్తానని జగన్ వాళ్ల నాన్న మరణించిన స్థలంలో మాట ఇచ్చిన రోజున ఏ రాజకీయాలు లేవు. కల్మషం లేని మనసుతో వాళ్ల నాన్నకోసం ఇచ్చిన మాట ఇది. కానీ ఓదార్పు యాత్ర ప్రారంభిస్తానంటే సోనియాగాంధి గారు వద్దన్నారు. కాని ఆరోజు నేను జగన్‌తో ‘ఏమి చేద్దామనుకుంటున్నావు జగన్. ఇంత పెద్దవాళ్లు నిన్ను ఆపాలని వున్నారు’ అన్నాను. అందుకు జగన్ నాతో అన్న మాటలు నేను ఎప్పటికీ మరచిపోను. ‘నేను ఈరోజు నాన్నకు ఇచ్చిన మాట మీద నిలవకపోతే నాన్నకు ఏమని నేను సమాధానం చెప్పాలి’ అన్నాడు. ఇంక ఇంట్లో మేమెవరం అడ్డుచెప్పలేదు. అలా మొదలై, కొన్ని విధిలేని పరిస్థితులలో 2010 నవంబర్‌లో జగన్, అత్తమ్మగారు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి తమ ఎంపి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అలా కాంగ్రెస్ నుండి జగన్ బయటికి రావడం మొదలు సిబిఐ విచారణ పేరుతో కాంగ్రెస్, టిడిపి, ఎల్లో మీడియా కలిపి జగన్‌ను వేధించటం, పథకం ప్రకారం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.

అలా మొదలైన కేసుకు ఎల్లో మీడియా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిబిఐ కలిసి జగన్ అక్రమ ఆస్తుల కేసు అని ప్రచారంలోకి తీసుకువచ్చాయి. నిజానికి ఈ కేసు జగన్ ఆస్తుల కేసు కాదు. ఇది 2004-2009 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోలు సక్రమమా లేక అక్రమమా తేల్చాలన్న కేసు. ప్రభుత్వ నియమ నిబంధనలను, ఇదివరకటి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను కాదని జీవోలు ఇచ్చి తద్వారా ఎవరికైనా అనుచిత లబ్ది చేకూర్చారా... అలా ఎవరైనా లాభం పొంది జగన్‌కు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టారా అన్నది కేసు. సిబిఐ దర్యాప్తు చేయాల్సినది అసలు ఈ జీవోలో ఎలాంటి తప్పు అయినా జరిగిందా, లేదా అన్నది. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినవా లేదా అని. కానీ సీబీఐ మొదటిరోజు నుంచి అలాంటి దర్యాప్తు చేయటానికి ఇష్టపడడం లేదు. అసలు జీవోల సంగతి పక్కనపెట్టి, మా ఇంటి మీద, ఆఫీసుల మీద పడ్డారు. కానీ, ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పు చేయలేదో నిర్ధారించడానికి ప్రయత్నించలేదు. కనపడిన ప్రతి పారిశ్రామికవేత్తనీ జగన్ పేరు చెప్పు.. 164 స్టేట్‌మెంటు ఇవ్వండి, మీకు ఏ ఇబ్బందీ ఉండదు - అంటూ బెదిరించింది. దీన్ని దర్యాప్తు అంటారా? సీబీఐ అలా దర్యాప్తు చేయవచ్చు అని ఏ చట్టం చెప్పింది? చివరికి నియంతృత్వ దేశాల్లో, నిరంకుశ దేశాల్లో కూడా ఇలా అధికారాన్ని ఒక మనిషికి వ్యతిరేకంగా ఇంత బాహాటంగా ఉపయోగించరేమో!

జగన్ కంపెనీల మీద జరిగిన అసత్య ప్రచారాలకు లెక్కే లేదు. కార్పొరేట్ సెక్టర్ గురించి అవగాహన ఉన్నవారికి, కంపెనీలు-పెట్టుబడుల గురించి, వాటాల అమ్మకం, ప్రీమియం నిర్ణయం గురించి తెలిసిన వారికి జగన్ చేసింది తప్పుకాదని తెలుసు. కానీ, ఆ వ్యవహారాలను వక్రీకరించారు. మీ కంపెనీకి ఇంత ప్రీమియం ఎలా నిర్ణయించారంటూ ప్రచారాలు ప్రారంభించారు. ఇందులో అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా ఒకే ప్రీమియం చెల్లించారు. అలాంటప్పుడు కొందరు పారిశ్రామికవేత్తలు షేర్ల కొనుగోలు చేయటాన్ని క్విడ్ ప్రో కో అనే పదం పరిధిలో ఎలా చేర్చారు? ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారి షేర్ల సర్టిఫికెట్లు వారివద్దనే ఉన్నాయి. అదీకాక, లంచంగా తీసుకోదలచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉత్తుత్తి కంపెనీలు సృష్టిస్తారుగానీ, నిజంగా భారీఎత్తున ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్‌లో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా? జగన్ పెట్టిన సంస్థలేవీ ఉత్తుత్తి కంపెనీలు కావే! భారతి సిమెంటు కానివ్వండి, సాక్షి పత్రిక కానివ్వండి, టీవీ ఛానల్ కానివ్వండి... ఇవి దేశం మొత్తంమీద ఆదరణ పొందినవి, సాక్షి అయితే దేశంలోనే 8వ స్థానంలో ఉంది. భారతి సిమెంట్ యొక్క నాణ్యత దేశంలో అగ్రస్థానం.

ఇక ప్రీమియం విషయానికి వస్తే, ఈనాడుకు పోటాపోటీగా సర్క్యులేషన్ ఉన్న సాక్షిలో ప్రీమియంను ప్రశ్నిస్తున్నవారు మరికొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగా చూడకుండా కళ్లు మూసుకున్నారు? ఈనాడు మాతృ సంస్థ అయిన ఉషోదయా పబ్లికేషన్స్ తన 26 శాతం వాటాను జెఎం ఫైనాన్షియల్స్‌కు అమ్ముతున్నప్పుడు సాక్షి కంటే డబుల్ వాల్యుయేషన్ చేసి 100 రూపాయల షేర్‌ను 5,28,000కు వెలకట్టి అమ్మడం జరిగింది. రామోజీ హెచ్‌యుఎఫ్ పేరిట అప్పటికి రూ.1800 కోట్ల మేరకు నష్టాలు పేరుకుని ఉన్నా, అంత ప్రీమియం ఎలా పలికింది? తప్పే అయితే ఎందుకు ఈ విషయం మీద దర్యాప్తు జరగడం లేదు?

అలాగే, భారతి సిమెంట్‌లో వాటాలు కొనుగోలు చేసిన నిమ్మగడ్డ ప్రసాద్‌గారు, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ క్విడ్ ప్రో కోగా పెట్టుబడులు పెట్టారు కాబట్టే జగన్ నిర్ణయించిన ఎక్కువ ప్రీమియంకు వారు షేర్లు కొన్నారని మొదట్లో ప్రచారం చేశారు. తరువాత, భారతి సిమెంట్‌లో 51 శాతం వాటాను అంతకంటె భారీ ధరకు ఫ్రెంచి సిమెంట్ జెయింట్ వికాకు అమ్మినప్పుడు, ఈ పెట్టుబడిదార్లందరికీ దాదాపుగా రెట్టింపు లాభాలు వచ్చాయి. ఎక్కడో ఫ్రాన్స్ నుంచి వచ్చిన వికా చెల్లించిన ప్రీమియం కూడా క్విడ్ ప్రో కోనే అంటారా?

ఏదైనా జీవో జారీ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిజినెస్ రూల్స్ ప్రకారంగానే జీవోలు జారీ అవుతాయి. అలా బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రి ఆమోదంతో, సంబంధిత శాఖ కార్యదర్శి జీవోలు జారీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నాగానీ, జీవోలు జారీ చేసే అధికారం లేని డాక్టర్ వైఎస్ గారి పేరును సీబీఐ వారు నేరపూరితమైన కుట్రకు పాల్పడిన వ్యక్తిగా, అదీ ఆయన మరణానంతరం ఎందుకు చేర్చారు? రూ.1.75లక్షల కోట్ల టెలికాం కుంభకోణంలో కేంద్రంలో సంబంధిత మంత్రిగా ఉన్న రాజా, సంబంధిత శాఖ కార్యదర్శి మాత్రమే నిందితులు. ప్రధాని పేరును ఆ దర్యాప్తులో చేర్చలేదే? అలాగే, 1.85 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం సమయంలో ప్రధాని సంబంధిత శాఖను నిర్వహించినా, ఆయనకు సంబంధం లేదని కాగ్ నివేదిక చెప్పలేదా? దేశం పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిన కామన్‌వెల్త్ స్కామ్‌లో ప్రధానిని విచారించారా? లేదే? ఎందుకని? ఎందుకంటే, సీబీఐ నేరుగా ప్రధాని అదుపాజ్ఞల్లో పని చేస్తుంది కాబట్టి. దివంగత నేత పేరును చేర్చడానికీ కారణం అదే.

ఈ కేసులో మంత్రుల్ని గానీ, సెక్రెటరీలను గానీ విచారించారా? అని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 30న దాఖలైన పిటిషన్ సందర్భంగా అడిగింది. వారి పేర్లు ఎందుకు చేర్చలేదో చెప్పండని ప్రశ్నించింది. ఆరు నెలలు గడిచినా వీరి నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. జీవోలు తప్పా ఒప్పా అన్న ఊసే లేకుండా సీబీఐ 28 టీములు పెట్టి, భారతదేశ చరిత్రలో ఏనాడూ లేని విధంగా మా ఇంటిమీద, ప్రత్యేకించి కొందరు ఇన్వెస్టర్ల ఇళ్ళూ ఆఫీసుల మీద దాడి చేసింది. మా ఇంటిని అంగుళం అంగుళం కొలతలు తీసుకుంది. జీవోలు జారీ చేసిన మంత్రులు, సెక్రెటరీల ఇళ్ళమీద ఏనాడూ దాడి చేయలేదే! బోఫోర్స్‌కు మించిన కుంభకోణం ఈ దేశ చరిత్రలో మరేదీ లేదే. అయినా ఏనాడూ పకడ్బందీ సాక్ష్యాధారాల కోసం సోనియాగాంధీ ఇంటిమీద దాడి చేయలేదే? ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర క్యాబినెట్‌లో పెద్దల హస్తం కూడా కనిపిస్తున్నా సీబీఐ వారి ఇళ్ళలో ఏ ఒక్కదాని మీదా ఈ రోజుకూ దాడి చేయలేదే? ఇదేం న్యాయం - ఒకరికి ఒక రూలు ఇంకొకరికి మరో రూలు - ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యం?

మన రాష్ట్రాన్నే చూడండి. రోశయ్యకు వ్యతిరేకంగా పెట్టిన ఏసీబీ కేసుకు ఏ గతి పట్టింది? సోనియా ముందు వంగి విధేయత ప్రదర్శించిన కాంగ్రెస్ వాది కాబట్టి ఆయన ఇంటిమీద ఎలాంటి సోదాలూ లేవు. ఆయన మీద కేసూ పోయింది. పైగా గవర్నరు గిరీ దక్కింది. ఇలాంటి ఎన్నెన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఈ దేశంలో న్యాయం సమంగా అందరికీ వర్తిస్తుందని చెప్పేవేనా? సీబీఐ ఈ కేసును కేవలం తన రాజకీయ యజమానుల్ని ఒప్పించడానికి ఉపయోగించినట్టయితే, జగన్‌తో కలిసి కుట్ర పన్నారంటూ నాలుగు చార్జిషీట్లలో నిందితుల జాబితాలో తానే పేర్కొన్న దాదాపు అందరికీ న్యాయస్థానం బెయిల్ ఇస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కారా? వీరిలో ఉన్న మంత్రులకు గణనీయమైన అధికారం లేదా?

జగన్‌కు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదంటూ అందుకు సీబీఐ చూపుతున్న కారణాలే అర్థంపర్థం లేనివి. జగన్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన సాక్షుల్ని, సాక్ష్యాన్ని ప్రభావితం చేయగలడట! కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన 280 రోజుల వరకు సాక్షుల్ని ఎలాంటి ప్రభావానికి గురి చేయకుండా ప్రజల్లో తిరిగిన నాయకుడు, అధికారంలో లేకపోవడమే కాకుండా అధికార పక్షం నేరుగా టార్గెట్ చేస్తున్న వ్యక్తి ఏ సాక్షుల్ని అయినా ఎలా ప్రభావితం చేయగలుగుతాడు? సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయ్యి 13 నెలలు గడిచింది. సీబీఐ 1, 2, 3 ఛార్జిషీట్లంటూ వేసింది. ఆ ఛార్జిషీట్లు వేస్తున్న సమయంలో జగన్ నిర్బంధంలో లేడు. తరవాత కూడా జగన్ తప్పు చేశాడని సీబీఐకి ఎలాంటి ఆధారమూ లభించలేదు.

జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ నిటారుగా నిలబడి దాని పని అది చేసుకుపోవడం లేదు. అది కాంగ్రెస్ హై కమాండ్ ముందు వంగి కాళ్ళకు దణ్ణం పెడుతోంది. ఇది దేశంలో ప్రధాన పత్రికలు ద హిందూ,ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా తమకు తాముగా చెప్పిన మాట. ఇన్ని జరుగుతున్నా ఈ దేశంలో న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం పోలేదు. వాటిని కాదని మేం చేయగలిగినదీ లేదు. న్యాయం వర్థిల్లాలని మాత్రమే కోరుకుంటున్నా.



- వైఎస్ భారతి
w/oవైఎ
స్ జగన్






source:sakshi

ఖైరతాబాద్ గణపతికి విజయమ్మ పూజలు


రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు చేశానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. గురువారం విజయమ్మ వినాయకుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలకు అన్ని విఘ్నాలు తొలగి సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించానన్నారు. పార్టీ ముఖ్య నాయకురాలు విజయారెడ్డి మాట్లాడుతూ, అన్ని ఆటంకాలు తొలగిపోవాలని గణనాథుడిని పూజించానని తెలిపారు. జగనన్న నాయకత్వంలో ముందుకు వెళ్తామన్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా వద్దకు చేరుకున్న విజయమ్మకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. 

అక్కడినుంచి వినాయకుడి వద్దకు బయల్దేరిన విజయమ్మ వెంట అభిమానులు కదులుతూ ‘వైఎస్‌ఆర్ అమర్హ్రే.... జగన్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినదించారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ విజయమ్మను శాలువాతో సత్కరించి, వినాయకుని చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం విజయారెడ్డి, జేఏసీ నాయకుడు చందు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పుత్తా ప్రతాపరెడ్డి, ఆదం విజయకుమార్, శివకుమార్, వాసిరెడ్డి పద్మ, పెరిక సురేష్, స్థానిక నాయకుడు కమ్మరి వినయ్, కమ్మరి వెంకటేష్, శ్రీనివాస్‌యాదవ్, సత్యనారాయణ, బండిరాజు పాల్గొన్నారు.

టీడీపీలో చిచ్చు

పార్టీకి, పదవికి బెరైడ్డి రాజశేఖరరెడ్డి రాజీనామా
బాబు పాదయాత్రను ప్రజలే అడ్డుకుంటారని హెచ్చరిక
బాబువి అస్తవ్యస్త నిర్ణయాలు: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
ఆయన పాదయాత్రకు సహకరించబోనన్న ఎమ్మెల్యే
అవసరమైతే టీడీపీనే వీడతానని హెచ్చరిక
బాబు వల్లే పార్టీ భ్రష్టుపడుతోంది: ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి
వారిద్దరినీ సస్పెండ్ చేసే యోచనలో పార్టీ

హైదరాబాద్, న్యూస్‌లైన్:చంద్రబాబు నిర్ణయాలను నిరసిస్తూ టీడీపీలో ముసలం పుట్టింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు బాబు లేఖ రాయడం, ఇతర ఏకపక్ష నిర్ణయాలపై పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలూ భగ్గుమంటున్నారు. బాబు వ్యవహార శైలిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (తంబళ్లపల్లి), ఎన్.అమరనాథరెడ్డి (పలమనేరు) గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఏకంగా పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు! ‘వస్తున్నా మీకోసం’ పేరుతో అక్టోబర్ 2న నుంచి రాయలసీమలోని హిందూపూర్ నుంచి బాబు పాదయాత్ర ప్రారంభించనున్న తరుణంలో టీడీపీలో ఇలా చిచ్చు రగిలింది. పార్టీలో బాబు అస్తవ్యస్త విధానాలు అమలు చేస్తున్నారంటూ ప్రవీణ్ దుయ్యబట్టారు.

బాబు వైఖరికి నిరసనగా ఆయన పాదయాత్రకు సహకరించబోమని ప్రకటించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు సైతం వెనకాడబోనని హెచ్చరించారు. అమరనాథరెడ్డి కూడా బాబు నిర్ణయాలు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. ఇక బెరైడ్డి అయితే బాబు చుట్టూ చక్కెర వ్యాధిగ్రస్తులు, ముసలీముతకా జమయ్యారంటూ విరుచుకుపడ్డారు. అలాంటి వారి సలహాల ప్రకారం న డుచుకుంటున్న బాబు ఏ దశలో ఉన్నారో అయన్నే అడిగి తెలుసుకోవాలని విలేకరులకు సూచించారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బాబు నిర్ణయాలు: ప్రవీణ్

బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రధానికి లేఖ కూడా అందుకే రాశారని ఆరోపించారు. దాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీఎల్పీ కార్యాలయ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘బాబు తన వ్యక్తిగత అహాన్ని తృప్తి పరచుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. పార్టీని అధోగతి పాలు చేశారు. వైఎస్ మరణానంతరం ఆయనపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. బాబు వ్యూహాత్మక తప్పిదం వల్లే టీడీపీ హీన స్థితికి చేరుకుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బాబు నిర్వీర్యం చేశారు. అంతా తానై పార్టీని భ్రష్టు పట్టించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇతర ప్రాంతాల నేతల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. మేం బాబు కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నాం. పార్టీ కంటే కూడా మా గ్రూపు, స్థానిక నేతలు, అనుచరుల వల్లే గెలిచాం. టికెటివ్వకపోతే స్వతంత్రంగా పోటీచేసిన చరిత్ర మాకుంది. 2009లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయగానే మమ్మల్ని బస్సుయాత్ర చేయాలంటూ ప్రోత్సహించిన బాబు ఇప్పుడు కేంద్రానికి లేఖ ఎలా ఇస్తారు? బాబు లేఖ అటు తెలంగాణ నేతలనూ సంతృప్తి పరచలేదు. 

ఇది పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టుగా ఉంది. రాష్ట్ర ప్రజలు తాము దైవాంశసంభూతునిగా భావించిన ఎన్టీఆర్, మంచి పథకాలతో పాలించాడనుకున్న వైఎస్సార్‌ల కంటే ఎక్కువకాలం పాలించే అవకాశాన్ని బాబు కు కల్పించారు. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరికాదు. పార్టీ విధానాల్ని ఎవరు ప్రశ్నించినా.. వేరే పార్టీలోకి వెళ్లేం దుకే అలా చేస్తున్నారంటూ విమర్శించడం పరిపాటైంది’’ అంటూ తూర్పారబట్టారు. బాబు పాదయాత్రకు తాను సహకరించబోనన్నారు. ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిన దశలో పాదయాత్ర చేసినా, ఇంకోటి చేసినా బాబును వారు నమ్మే పరిస్థితి లేదన్నారు.

పార్టీ వీడేందుకూ సిద్ధం: అమర్‌నాథరెడ్డి

సమైక్యాంధ్రకే తాను కట్టుబడి ఉన్నానని అమరనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ త్యాగాలకైనా సిద్ధమేనని, అవసరమైతే పార్టీని వీడేందుకూ వెనుకాడబోనని ప్రకటించారు. గురువారం ఆయన పలమనేరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘2009 డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రాంతాలవారీగా విడిపోవాల్సి వచ్చింది. అనంతర పరిణామాల్లో రాజీనామాలు చేసి బయటికొచ్చిన ఎమ్మెల్యేల్లో నేను మొదటి వాడిని. తెలంగాణ విషయంలో 2009 నుంచీ బాబు అనుసరిస్తూ వచ్చిన వైఖరి వల్ల సీమాంధ్రల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దాంతో అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తూ వస్తోంది. 

ఆ పర్యవసానంగానే తాజా ఉప ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ప్రాంత ఎమ్మెల్యేలుగా మేం కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది’’ అన్నారు. ఎవరూ అడగకుండానే లేఖ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని బాబును అమర్‌నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన నిర్ణయాలు పార్టీకి తీవ్రనష్టాన్ని చేకూరుస్తున్నాయన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిందీ, తేవాల్సిందీ కాంగ్రెసే అయినప్పుడు బాబు లేఖతో పనేముందని ప్రశ్నించారు. దాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు రాజ్యాంగపరంగా సంక్రమించిన ఓటేసే హక్కును కూడా కాలరాసేలా బాబు వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. ‘నా భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా నడచుకుంటా’నని పేర్కొన్నారు.

ఇప్పుడే క్రమశిక్షణ చర్యలొద్దంటున్న బాబు

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి విమర్శలు గుప్పించిన నేతలపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని టీడీపీ నేతలకు బాబు సూచించారు. పాదయాత్రను సీమలో ప్రారంభిస్తున్న తరుణంలో అక్కడి నేతలపై చర్యలు తీసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కాబట్టి రెండుమూడు రోజులు వేచిచూద్దామని పార్టీ ముఖ్యులకు చెప్పినట్టు సమాచారం. షోకాజ్ ఇచ్చి, ఏమని బదులిస్తారో చూడా లని యోచిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు గురువారం టీడీఎల్పీలో సమావేశమై, బాబు లేఖను స్వాగతించారు.

‘చెయ్యెత్తి జైకొట్టు తెలంగాణోడా’ అన్నట్టుంది: బెరైడ్డి

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంటే, ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి ‘చెయ్యెత్తి జై కొట్టు తెలంగాణోడా’ అన్నట్టుగా ఉందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. సమితి ముఖ్య సమన్వయకర్త తమ్మడపల్లి విజయ్‌రాజ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానికి రాసిన లేఖలో రాయలసీమ గురించి బాబు ప్రస్తావించకపోవటాన్ని తప్పుబట్టారు. ‘‘ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాస్తే సీమ గురించి కూడా అందులో ప్రస్తావించాలని నేను బాబుకు రాసిన లేఖలో కోరాను. నా లేఖను బుట్టదాఖలు చేశారు. సీమంటే అంత చులకనెందుకు? మా ప్రాంతమంటే లెక్కలేనితనం కనబడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. ప్రధానికి బాబు లేఖ రాయడానికి నిరసనగానే టీడీపీతో 19 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నానని చెప్పారు. 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం ఒకవేళ చెప్పినా తాము మాత్రం ప్రత్యేక రాయలసీమ రాష్ర్టం కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడతామన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 దాకా వెయ్యి కిలోమీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని బెరైడ్డి చెప్పారు. ‘‘యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుంది’’ అని వెల్లడించారు. తాను యాత్రను ప్రకటించాకే బాబు కూడా యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ‘‘సీమకు అన్యాయం చేసేలా వ్యవహరించిన బాబు యాత్రను మేం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే అడ్డుకుంటారు’’ అన్నారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458764&Categoryid=1&subcatid=33

జగన్ ఆస్తుల కేసు కాదిది .వాన్‌పిక్‌ది వేరే కేసు

*హైకోర్టులో సీబీఐ న్యాయవాది అంగీకారం
*జడ్జిని సంతృప్తిపరచలేని రీతిలో సమాధానాలు
*నవయుగ చేరితే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటి?
*శరపరంపరంగా ప్రశ్నలు సంధించిన న్యాయమూర్తి
*బదులివ్వలేక ఆద్యంతం తడబడ్డసీబీఐ న్యాయవాది
*నిమ్మగడ్డ బెయిల్‌పై నేడూ కొనసాగనున్న విచారణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో డొల్లతనం మరోసారి బయటపడింది. వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై గురువారం కొనసాగిన వాదనలు అందుకు వేదికయ్యాయి. వాన్‌పిక్ కేసుతో జగన్‌కు సంబంధం లేదని బుధవారం వాదనల సందర్భంగా సీబీఐ న్యాయవాది కేశవరావు హైకోర్టుకు వెల్లడించడం తెలిసిందే. గురువారం నాటి విచారణలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ప్రసాద్‌పై దాఖలు చేసిన కేసు జగన్ ఆస్తుల కేసులో భాగమేనా అని న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ప్రశ్నించగా, ‘కాదు, ఇది వేరే కేసు’ అని సీబీఐ న్యాయవాది చెప్పారు! కేసుకు సంబంధించిన వాదనలు కూడా ఆసక్తికరంగా కొనసాగాయి. 

సీబీఐ విచారణ తీరుపై న్యాయమూర్తి శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు కేశవరావు సరైన సమాధానాలివ్వలేకపోయారు. దాంతో, ‘కోర్టుకున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అడిగిన ప్రతి ప్రశ్నకూ బదులివ్వాలి’ అంటూ సీబీఐ న్యాయవాదిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాన్‌పిక్ ఒప్పందాలకు సంబంధించి చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పేందుకు ఆయన ప్రయత్నించడంతో, కోర్టు సమయాన్ని వృథా చేయరాదని స్పష్టంగా చెప్పారు. సీబీఐ వాదనలపై నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చేందుకు వీలుగా తదుపరి వాదనల నిమిత్తం విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. గురువారం నాటి వాదనల ముఖ్యాంశాలివీ...

ప్రభుత్వానికి నష్టమేంటి ?

వాన్‌పిక్ ప్రాజెక్టులోకి కొత్త భాగస్వామిగా నవయుగ కంపెనీ చేరడం ద్వారా ప్రభుత్వాదాయానికి వచ్చిన నష్టమేంటని సీబీఐ న్యాయవాది కేశవరావును న్యాయమూర్తి ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందానికి లోబడే ఏ భాగస్వామ్య ఒప్పందాలైనా జరుగుతాయి తప్ప దాన్ని ఉల్లంఘించలేవు కదా అని అభిప్రాయపడ్డారు. దానికి కేశవరావు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ‘‘రాక్ సీఈవోకు నోటీసులిచ్చామని చెప్పారు. ఎప్పుడిచ్చారు ? వారి నుంచి వచ్చిన స్పందనేమిటి?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేశాక ఇటీవలే కొన్ని వారాల కింద నోటీసులిచ్చామని కేశవరావు బదులిచ్చారు. వారి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని తెలిపారు. వాన్‌పిక్ కేసులో ఎక్కువ మంది సాక్షులు వాన్‌పిక్ ఉద్యోగులేనని, నిమ్మగడ్డకు బెయిలిస్తే వారిని ప్రభావితం చేసే ఆస్కారముందని పేర్కొన్నారు. దాంతో, సాక్షుల్లో వాన్‌పిక్ ఉద్యోగులు ఎందరున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, తన దగ్గర సమాచారం లేదంటూ దాటవేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. వాన్‌పిక్‌పై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని కేశవరావు నివేదించగా, దేనిపై దర్యాప్తు కొనసాగుతోందో స్పష్టం చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇందూ ప్రాజెక్టుతో పాటు అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ సెంటర్‌కు భూ కేటాయింపుల వ్యవహారంపై కొనసాగుతోందని కేశవరావు వివరణ ఇచ్చారు. ‘వాన్‌పిక్ అంటే ఓడరేవులకు సంబంధించిన వ్యవహారం కదా! అనంతపురం జిల్లాలో భూముల వ్యవహారంతో ఈ కేసుకేం సంబంధం?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మైటాస్ కంపెనీకి వైఎస్సార్ కడప జిల్లాలో రూ.120 కోట్ల రోడ్డు పనులను నామినేషన్ పద్ధతిన ఇచ్చారని, దానిపైనా దర్యాప్తు చేయాల్సి ఉందని కేశవరావు చెప్పగా, ‘మైటాస్ పాత్ర చిన్నదే కదా’ అని అన్నారు.

సాక్షులు 10 మందే: నిమ్మగడ్డ న్యాయవాది

వాన్‌పిక్‌కు చెందిన ఉద్యోగులు 10 మందే సాక్షులుగా ఉన్నారని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారి వాంగ్మూలాలను గత మార్చిలోనే సీబీఐ నమోదు చేయించిందన్నారు. ‘‘సాక్షుల్లో ప్రభుత్వోద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. ఒప్పందాలకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ ఇప్పటికే చార్జిషీట్‌తోపాటు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఆధారాలను మాయం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సాక్షులను ప్రభావితం చేస్తారనేందుకు సీబీఐ చిన్న ఆధారాన్ని కూడా చూపలేకపోతోంది. కేవలం యాంత్రికంగా మాత్రమే అభ్యంతరం తెలుపుతోంది. వాన్‌పిక్ ప్రాజెక్టులో ప్రభుత్వానికి పైసా పెట్టుబడి లేదు. రాయితీ ఒప్పందంపైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ అభ్యంతరం లేదు. రూ.17 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టులో వాన్‌పిక్ ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. సీబీఐ కేసుతో ప్రాజెక్టు అభివృద్ధి ఆగిపోయింది. లీజుకిచ్చిన ప్రాంతంలో విద్యుత్ కంపెనీలు ప్రారంభమై ఉంటే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండేది కాదు. ప్రస్తుతం రూ.11కు కొనుగోలు చేస్తున్న కరెంటు రూ.3కే వచ్చేది’’ అని ఆయన నివేదించారు.


http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458681&Categoryid=1&subcatid=33

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!