హైదరాబాద్: 2014లో టీడీపీకి 10 సీట్లు కూడా రావని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మాన్ అన్నారు. చంద్రబాబు మాటలను మైనార్టీలు నమ్మరని చెప్పారు. బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబుపై ముస్లింలకు నమ్మకం లేదన్నారు. మైనార్టీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని రెహ్మాన్ అన్నారు.
గురువారం హైదరాబాద్‌లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న తమ ఆలోచనను వైఎస్ రాజశేఖరరెడ్డి కాపీ కొట్టారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ. 2500 కోట్లతో ముస్లింలకు ఉప ప్రణాళిక ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
source: sakshi

No comments:
Post a Comment