Saturday, 15 September 2012
బాబు విదేశీ ఖాతాలపై దర్యాప్తు జరపాలి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ ఖాతాలపై దర్యాప్తు జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఒకరు విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఆర్జించిన అక్రమార్జనను దాచుకునేందుకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలు తెరిచారని కోలా కృష్ణమోహన్ అనే వ్యక్తి ప్రకటించినా సంబంధిత దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ.. న్యాయవాది ఆజాద్ శనివారం లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
ప్రజాపక్షంగా పోరాటానికి వ్యూహం
అసెంబ్లీలో ప్రజా వాణి వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం సమావేశమవుతున్నారు. విద్యుత్ సంక్షోభం, తద్వారా ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ రంగాలు దెబ్బతింటున్న అంశం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల భవిష్యత్తు అంధకారంగా మారడం, వ్యవసాయరంగం, ఎరువులు, విత్తనాల కొరత, ఫీజులు, లక్ష్మీపేట ఉదంతం, డీజిల్ ధరలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించి.. అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చూడాలని పార్టీ భావిస్తోంది.
వైఎస్సార్‌సీపీ పక్షాన తొలిసారి అడుగిడుతున్న ఎమ్మెల్యేలు
గత బడ్జెట్ సమావేశాలు ముగిసేనాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో విజయమ్మ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఇద్దరు సభ్యులే ఉండేవారు. ఉప ఎన్నికల్లో 14 మంది పాత ఎమ్మెల్యేలు, ఒక కొత్త ఎమ్మెల్యే (భూమన కరుణాకర్‌రెడ్డి) ఎన్నికయ్యారు. దాంతో ప్రస్తుతం అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ బలం 17కు చేరింది. వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెడుతున్నారు.
కాపీ కొట్టినా పాసవుతామా?
|
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్పీ భేటీ
అసెంబ్లీలో ప్రజా వాణి వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం సమావేశమవుతున్నారు. విద్యుత్ సంక్షోభం, తద్వారా ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ రంగాలు దెబ్బతింటున్న అంశం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల భవిష్యత్తు అంధకారంగా మారడం, వ్యవసాయరంగం, ఎరువులు, విత్తనాల కొరత, ఫీజులు, లక్ష్మీపేట ఉదంతం, డీజిల్ ధరలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించి.. అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చూడాలని పార్టీ భావిస్తోంది.
28న బెయిలొచ్చే అవకాశాలు మెండుగా
జగన్ మళ్ళీ ప్రజాజీవితంలోకి రానున్నారు. త్వరలోనే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. బెయిల్ పిటీషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ తీరును ప్రశ్నించడం జగన్‌కు కలిసొచ్చే అంశమే. అన్నీ అనుకూలిస్తే ఈనెల 28న బెయిలొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వైసీపీలో ఆనందాన్ని రేకెత్తిస్తున్నాయ్. తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై త్వరలోనే బయటకు రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు కొండంత ఆశతో ఉన్నారు. జగన్ బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలు సీబీఐ గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేశాయ్. ఛార్జిషీట్లు, విచారణ, అరెస్ట్...ఇలా అన్ని విషయాల్లో సీబీఐ తీరుపై న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది.
జగన్ బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో అరగంటపాటు ఆసక్తికర వాదనలు జరిగాయ్. జగన్ అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన తరపున న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణ్యం, అల్తాఫ్‌లు ధర్మాసనానికి విన్నవించారు. జగన్ కోర్టులో హాజరు కావాల్సి ఉండగా అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. లక్షకోట్ల అవినీతంటూ చెప్పుకొచ్చిన సీబీఐ ఛార్జిషీట్లకొచ్చేసరికి నిరూపించలేకపోయిందని వాదనలు వినిపించారు. జగన్ అరెస్టై వంద రోజులు పైనే గడిచాయని, బయట ఉన్నా, జైల్లో ఉన్నా సీబీఐ విచారణకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్ అరెస్ట్‌కు ముందు మూడు చార్జిషీట్లు వేసిన సీబీఐ, అరెస్ట్ తర్వాత సప్లిమెంటరీ వేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సప్లమెంటరీకి ఎన్ని రోజులు సమయం తీసుకుంటారని న్యాయమూర్తులు ప్రశ్నించారు.
అటు సీబీఐ తరపున అదనపు సోలిసీటర్ జనరల్ మోహన్‌జైన్ ధీటుగా వాదనలు వినిపించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతీ విషయంలోనూ సీబీఐ తీరును కోర్టు తప్పుబడుతూ ప్రశ్నలు సంధించింది. మొదటి ఛార్జిషీటుకు ముందే జగన్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదో వివరణ ఇవ్వాలని కోరింది. రెండు రోజుల విచారణ అనంతరం ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా నోటీసులు జారీ చేయడంపై వివరణ కోరింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే జగన్ బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. తదుపరి విచారణ ఈనెల 28కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.కోర్టులో అన్ని విషయాల్లోనూ జగన్‌కు అనుకూలంగా వాదనలు జరగడంతో బెయిల్ ఖాయమని వైసీపీ కేడర్ ఖుషీ అవుతోంది. జననేత త్వరలోనే జైలు నుంచి బయటపడ్తారని ధీమాగా ఉన్నారు. కార్యకర్తలు, అభిమానుల కూడా జగన్ విడుదల కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెలాఖరున బెయిల్ రావడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.
http://www.tv5news.in/districtwide/hyderabad/item/6060-jagan-mohan-reddys-bail-petition-updates

రేపు వైఎస్ఆర్ సిపి శాసనసభాపక్ష సమావేశం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం రేపు సమావేశం కానుంది. ఈ నెల 17 నుంచి శాసనసబ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. విద్యుత్ సంక్షోభం, ఫీజురీఇంబర్స్‌మెంట్ పథకానికి పరిమితుల విధింపు, విషజ్వరాల వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్న నేపధ్యంలో ప్రజల పక్షాన శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. లోటస్‌పాండ్‌లోని క్యాంప్ ఆఫీస్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా హజరవుతారు.
మరోసారి మొట్టికాయలు!
|
'జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు'
నెల్లూరు : సీబీఐ కుట్రపూరితంగా వైఎస్ జగన్‌ను ఇరికించిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ నిర్ధోషిగా త్వరలోనే బయటకు వచ్చి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ ఆస్తులపై సీబీఐ పూటకో మాట మాట్లాడుతోందని టీడీపీ పొరపాటున నిజం చెప్పినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన శనివారమిక్కడ అన్నారు.
మళ్లీ మోసానికి కేసీఆర్ రెడీ: గోనె
తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. ఆర్థిక లావాదేవీల కోసమే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయం అంతా కుటుంబ సంక్షేమం కోసమేనన్నారు. వయలార్ దగ్గరకు మిగతా నేతలను తీసుకెళ్లకుండా కేటీఆర్‌నే కేసీఆర్ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానికి ఒప్పుకోవడమంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటమేనని గోనె ప్రకాశరావు అన్నారు.
'బాబుని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు'
ఒంగోలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. ఆయన పాదయాత్ర ఆలోచన పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు.
Friday, 14 September 2012
జగన్‌ను ఎందుకు అరెస్టు చేశారు?
*జగన్ బెయిల్‌పై విచారణ 28కి వాయిదా *సీబీఐ దర్యాప్తు తీరును పలుమార్లు ప్రశ్నించిన ధర్మాసనం *సూరీడుకు కోర్టు సమన్లను తమ ముందుంచాలని ఆదేశం *స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సాక్ష్యం కోసం సమన్లివ్వడమేమిటి? *జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణియం వాదన *జగన్ బయటకు రాకుండా చేసేందుకే కల్పిత సాకులని వెల్లడి *మరిన్ని చార్జిషీట్లు వేస్తామన్న సీబీఐ తరఫు న్యాయవాది *విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పైనా 28నే విచారణ న్యూఢిల్లీ, న్యూస్‌లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 28కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న సూర్యనారాయణరెడ్డి (సూరీడు)కు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన ఉత్తర్వును, అందుకు సంబంధించి సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును తన ముందుంచాల్సిందిగా దర్యాప్తు సంస్థను ఆదేశించింది. వాటిని పరిశీలించాకే పూర్తిస్థాయి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో సీబీఐ వ్యవహార శైలిని ధర్మాసనం పలుమార్లు నిలదీసింది. ‘‘మొత్తం కేసుకు సంబంధించి గతంలో మూడు చార్జిషీట్లు దాఖలు చేశారు. సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న అభియోగమేదీ కూడా అప్పట్లో పిటిషనర్‌పై మోపలేదు. విచారణ నిమిత్తం మీరు నోటీసులిచ్చి రమ్మంటే ఆయన (జగన్) వచ్చారు. మూడు రోజుల పాటు మీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. మర్నాడు కోర్టులో హాజరు కావాల్సి ఉన్న పరిస్థితుల్లో ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది?’’ అని సీబీఐని ప్రశ్నించింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ పెట్టుకున్న అనుబంధ పిటిషన్‌పై విచారణను కూడా ధర్మాసనం 28వ తేదీకే వాయిదా వేసింది. సాక్షులను ప్రభావితం చేయలేదని సీబీఐకి కూడా తెలుసు హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, దానిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు సీబీఐ కౌంటర్ వేయడంతో కేసును న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. జగన్ తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ జైన్ వాదనలు వినిపించారు. మొదట సుబ్రమణియం వాదిస్తూ కేసులో సీబీఐ అనుసరించిన తీరును ఎండగట్టారు. ‘‘హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన నాటి నుంచీ దర్యాప్తు సంస్థకు జగన్ పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. ఏనాడూ సాక్షులను ప్రభావితం చేయడం గానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం గానీ చేయలేదు. ఈ విషయం సీబీఐకి కూడా స్పష్టంగా తెలుసు’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సంఖ్యల్లో సున్నాలు జారిపోతున్నాయి.. జగన్ రూ.లక్ష కోట్లు ఆర్జించారని హైకోర్టులో దాఖలైన పిటిషన్లలో ఆరోపించారని, ఎఫ్‌ఐఆర్ దాఖలుకు వచ్చేసరికి సీబీఐ దాన్ని రూ.50వేల కోట్లకు తగ్గించిందని, ఇప్పుడేమో రూ.20 కోట్లకు వచ్చిందని సుబ్రమణియం వివరించారు. సీబీఐ దర్యాప్తు తీరును దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. ‘‘జగన్‌పై చేసిన అక్రమార్జన ఆరోపణలకు సంబంధించిన సంఖ్యల నుంచి సున్నాలు జారిపోతున్నాయి. అవినీతి జరిగిందని సీబీఐ భావిస్తుంటే, అది ఎంతో కచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంది. కానీ ఏమాత్రం పొంతన లేకుండా సీబీఐ చూపుతున్న సంఖ్యలను చూస్తే వారు మొత్తం కేసును అభూతకల్పనలతో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. జగన్‌ను సీబీఐ గత మే 27న అరెస్టు చేసింది. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనను అందుకు ప్రధాన కారణంగా చూపారు. కానీ ఇలా పిటిషనర్ సాక్షులను ప్రభావితం చేశారని, బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్పడం ఏమాత్రం సరికాదు. ఈ కేసులో సాక్షి వై.సూర్యనారాయణరెడ్డి (సూరీడు)కి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద తన ఎదుట హాజరై సాక్ష్యమివ్వాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఇలా ఎలా చేస్తారు? ఇదసలు ఎక్కడా లేనటువంటి విషయం. సాక్ష్యమనేది స్వచ్ఛందంగా ఇచ్చేది. అంతే తప్ప సమన్లు జారీ చేసి బలవంతంగా ఇప్పించలేరు. ఈ ‘కొత్త చట్టం’ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశముంది. సూర్యనారాయణరెడ్డి నుంచి సీబీఐ అధికారులు అప్పటికే సీఆర్పీసీ సెక్షన్ 161 కింద సాక్ష్యం తీసుకున్నారు. ఆ తర్వాత సెక్షన్ 164 కింద ఆయనకు సమన్లు పంపారు. ఇలా సాక్ష్యం చెప్పి తీరాలని ఒక వ్యక్తిని సెక్షన్ 164 కింద ఆదేశించే అధికారాన్ని కోర్టుకు ఎవరిచ్చారు? అలా ఆదేశించే చట్టమేదన్నా ఉందా? సాక్ష్యం చెప్పడం సూర్యనారాయణరెడ్డి హక్కు. అందుకాయన నిరాకరిస్తే, జగన్ ప్రభావితం చేశారని ఎలా చెబుతారు? అసలు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. సాక్ష్యం విషయంలో సెక్షన్ 164ను అసలు ఉపయోగించరాదు. కానీ అదే సెక్షన్ కింద సమన్లు ఇచ్చారు. ఇదంతా చూస్తే సీబీఐ ఈ కేసులో జగన్‌ను ఎలాగైనా ఇరికించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన వివరించారు. దర్యాప్తు సా...గుతోందంటూ జైల్లో ఉంచుతున్నారు.. ఏ కేసులోనైనా ఒక వ్యక్తిని 90 రోజులకు మించి కస్టడీలో ఉంచడం చట్ట ప్రకారం కుదరదని సుబ్రమణియం గుర్తు చేశారు. ‘‘కానీ మే 28న కోర్టులో హాజరు కావాల్సిన వ్యక్తిని, తర్వాత రాజకీయ ప్రచారంలో పాలుపంచుకోవాల్సిన అవసరమున్న వ్యక్తిని ముందు రోజు రాత్రి అరెస్టు చేయడమే గాక.. ఇంకా చార్జిషీట్లు వేయాల్సి ఉందనే సాకుతో 90 రోజులు దాటినా కస్టడీలోనే కొనసాగిస్తున్నారు. జగన్ బెయిల్ కోరిన ప్రతిసారీ.. ‘దర్యాప్తు కొనసాగుతోంది, కీలక దశలో ఉంది’ అంటూ సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈ కల్పిత సాకులన్నీ ఆయన్ను బయటకు రాకుండా చేసేందుకే! దర్యాప్తు, చార్జిషీట్ల పేరుతో జగన్‌ను కస్టడీలోనే కొనసాగించడం చట్టప్రకారం ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడమే. బెయిల్ కోరే హక్కు పిటిషనర్‌కు చట్టప్రకారం ఉంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ 90 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్లలో ప్రస్తావించిన అంశాలనే అందులోనూ పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్ 173 (8) ప్రకారం అనుబంధ చార్జిషీట్ లేదా తదుపరి చార్జిషీట్ల దాఖలు కోసం నిందితుడిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. అరెస్టు చేసి 90 రోజులు దాటాక కూడా ఇంకా అనుబంధ చార్జిషీట్ల నెపంతో బెయిల్ ఇవ్వవద్దనడం ఏమాత్రమూ సరికాదు. అత్యంత కీలకమైన ఉప ఎన్నికల సమయం లో తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న జగన్‌కు సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద సమన్లు జారీ చేశారు. తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించారు. వాటిని గౌరవిస్తూ ఆయన హాజరయ్యారు. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి, మరుసటి రోజు జగన్ కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉండగా మే 27 రాత్రి 7.15కు అరెస్ట్ చేశారు. దీన్ని రాత్రి వేళ చేసిన అరెస్టుగా మేజిస్ట్రేట్ కూడా అభివర్ణిం చారు’’ అని సుబ్రమణియం గుర్తు చేశారు. విచారణకు పిటిషనర్ పూర్తిగా సహకరిస్తున్న సమయంలో ఆయనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో దర్యాప్తు సంస్థ చెప్పి తీరాలన్నారు. సంఖ్యలపై నిలదీసిన ధర్మాసనం పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని మోహన్ జైన్ చెప్పారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయరాదని ధర్మాసనాన్ని కోరారు. ‘‘కేసులో ఇప్పటికే మూడు చార్జిషీట్లు వేశాం. మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తాం. దర్యాప్తు కీలక దశలో ఉంది. పిటిషనర్ భారీగా ఆస్తులను ఆర్జించారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన సంస్థల్లోకి నిధులొచ్చేలా చేశారు. రాష్ట్రంలోని పలుచోట్ల వివిధ సంస్థలకు జరిపిన కేటాయింపులకు ప్రతిగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు’’ అంటూ జైన్ వాదిస్తుండగా ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘అలా జరిగి ఉండొచ్చుననేదేగా మీ వాదన’ అంటూ ప్రశ్నించింది. అవునని ఆయన బదులిచ్చారు. రూ.50 లక్షల ఆస్తి నుంచి రూ.40 వేల కోట్ల ఆస్తులకు అధిపతిగా జగన్ ఎదిగారని అన్నారు. అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో దీన్నిబట్టి తెలుసుకోవచ్చన్నారు. దాంతో ధర్మాసనం మళ్లీ జోక్యం చేసుకుని.. ‘‘ఇది మీరు (సీబీఐ) ఊహిస్తున్న సంఖ్యా? ఈ సంఖ్యలను ఇప్పుడెందుకు ఉదహరిస్తున్నారు? సీబీఐ వాస్తవంగా లెక్కగట్టిన సంఖ్యేమిటో చెప్పండి. ఇప్పటిదాకా మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు కదా! వాటిలోని మొత్తాలెంత?’’ అంటూ ప్రశ్నించింది. దాంతో జైన్ అప్పటికప్పుడు చార్జిషీట్లలోని మొత్తాలను కూడారు. ‘రూ.1,595 కోట్లు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’ అని బదులిచ్చారు. దాంతో ధర్మాసనం ఆయనను నిలువరిస్తూ.. ‘గతంలో మీరు మూడు చార్జిషీట్లు దాఖలు చేశారు. సాక్షులను ప్రభావితం చేయడంపై అప్పుడు పిటిషనర్‌పై ఏ అభియోగమూ మోపలేదు. నోటీసులందుకున్నాక సీబీఐ ఎదుట ఆయన మూడు రోజులు హాజరయ్యారు. మర్నాడు కోర్టులో హాజరవ్వాల్సి ఉండగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది?’’ అంటూ నిలదీసింది. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని అరెస్టు చేసినట్టు జైన్ తెలిపారు. దాంతో, మరి సీఆర్పీసీ సెక్షన్ 164 విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం జైన్ తన వాదనను కొనసాగించారు. ‘పిటిషనర్ కంపెనీల్లోకి ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు బాగా వచ్చాయి. వాటిపై సాక్షులను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే ఆయన వారిని ప్రభావితం చేయజూశారు’’ అన్నారు. అందుకు సుబ్రమణియం అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ ఎవరినైనా ప్రభావితం చేయడానికి గానీ, సాక్ష్యాలను తారుమారు చేయడానికి గానీ ప్రయత్నించారని సీబీఐ ఎక్కడా కూడా నిరూపించలేదని గుర్తు చేశారు. దానివి కేవలం నిరాధార ఆరోపణలు మాత్రమేనని తేల్చి చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘సాక్షులను ప్రభావితం చేసినట్టు, సాక్ష్యాలను తారుమారు చేసినట్టు రికార్డుల్లో ఉందా’ అని ప్రశ్నించగా ఉందని జైన్ బదులిచ్చారు. ‘‘164 సెక్షన్ కింద సీబీఐ మేజిస్ట్రేట్ జారీచేసిన సమన్ల ఉత్తర్వును మేం పరిశీలిస్తాం. ఆ సమన్ల జారీకోసం సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును కూడా పరిశీలించాలనుకుంటున్నాం. ఆ రెండింటినీ మా ముందుంచండి. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాక తర్వాతి వాదనలు వింటాం’’ అని జైన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. |
బెయిల్ రాకుండా కుట్ర
బెయిల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వారి బినామీ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది
కోర్టులు, న్యాయవాదులను ప్రభావితం చేసేందుకు యత్నిస్తోంది
‘అవుట్‌లుక్’ కథనం అందులో భాగమే
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా బంధించడానికి శక్తిమేర కృషిచేసిన శక్తులే ఇప్పుడు ఆయనకు బెయిల్ రాకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. బెయిల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్, టీడీపీ నేతల బినామీ మీడియా సంస్థలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురిస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులతో జగన్‌మోహన్‌రెడ్డిని బంధించి 110 రోజులవుతోంది. 90 రోజులు దాటాక కేసు నిరూపితం కాకపోతే ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎవరికైనా బెయిల్ లభిస్తుంది. అయితే జగన్ బయటకొస్తారని తెలిసి కాంగ్రెస్, టీడీపీ నేతల్లో వణుకు పుడుతోంది. బయటకొస్తే ఆయన్ను ఏ విధంగా బద్నాం చేయాలనే దానిపై ప్రత్యేక కుట్రను రూపొందిస్తున్నారు. జగన్ బయటకొస్తే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని భావించిన ఆ రెండు పార్టీలు తమ చేతిలో ఉన్న సీబీఐని అడ్డం పెట్టుకొని ఎల్లో మీడియా చేత తమదైన శైలితో రాతలు రాయిస్తున్నాయి.
అందుకే జగన్ బెయిల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ కోర్టులను, న్యాయవాదులను ప్రభావితం చేసేలా కథనాలు వెలువరిస్తున్నాయి’’ అని మండిపడ్డారు. అందులో భాగంగానే ‘‘అవుట్‌లుక్’’ అనే పత్రిక చేత తలా తోకాలేని విధంగా మరో కథనాన్ని వండివార్చారని గట్టు దుయ్యబట్టారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రోజుకొక కుంభకోణం వెలుగుచూస్తుంటే అవుట్‌లుక్ మాత్రం.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోందని రాయడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. కేంద్రంలో రోజుకొక కుంభకోణం 2జీ, బొగ్గుస్కాం, కామన్‌వెల్త్ ఇలా అనేకం చోటుచేసుకుంటున్నా ఆ మీడియాకు కనబడదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబూ.. కుమ్మక్కైంది ఎవరు?
‘‘జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసు విషయంలో హైకోర్టు ఆదేశాలే తడవుగా సీబీఐ ఎక్కడలేని అత్యుత్సాహం ప్రదర్శించింది. అదే చంద్రబాబుపై దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తే నెలరోజులైనా పట్టించుకోలేదు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అటువైపు కన్నెత్తి చూడలేదు. చంద్రబాబు, ఆయన బినామీలు సుప్రీంకోర్టుకు వెళ్లి రకరకాల నాటకాలతో కేసును నీరుగార్చేదాకా ప్రేక్షకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కు అవడం వల్లే ఇదంతా జరిగింది’’ అని గట్టు తూర్పారబట్టారు. జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో వాదిస్తున్న లాయర్లను కేంద్రం మార్చిందని, దీంట్లో ఆయన హస్తముందంటూ టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా మరో కొత్తవాదనను తెరపైకి తెస్తోందన్నారు.

కువైట్ చర్చి వార్షికోత్సవానికి అనిల్, షర్మిల
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త టి. దుర్గారెడ్డి కువైట్‌లో నిర్మించిన చర్చి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి బ్రదర్ అనిల్‌కుమార్ హాజరయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కూడా ఈ పర్యటనలో పాల్గొనగా, ఆమెను కలుసుకోవడానికి అక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారని పార్టీ నాయకుడు ఇలియాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే చర్చి సమావేశ కార్యక్రమాన్ని బహిరంగ స్థలంలో ఏర్పాటు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశ నిర్వహకులు పరిస్థితిని కువైట్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ముబారక్ అల్ దొవే దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన జోక్యం చేసుకుని పరిస్థితిని అధికారులకు వివరించగా.. కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియంలో నిర్వహించుకోవడానికి కువైట్ యునెటైడ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ అనుమతించింది. దానికి అవసరమైన భద్రత కూడా కల్పించింది.
బ్రదర్ అనిల్ అరెస్టు అవాస్తవం: బ్రదర్ అనిల్ కుమార్ ను కువైట్‌లో అరెస్టు చేశారంటూ ఒక వర్గం మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.ఎ.రెహమాన్ తెలిపారు.
ధరల పెంపు ఉపసంహరించుకోవాల్సిందే: సోమయాజులు
కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ.5 పెంచడం, గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలు విధించడం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. యూపీఏ ప్రభుత్వ పాలకుల వైఫల్యం ప్రజలకు శాపంగా మారిందని, వారి చేతకానితనం వల్లే దేశంలో దుర్భర ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీజిల్ ధర పెంపుతో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందని, గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీపై ఆంక్షలు విధించడంతో మధ్య తరగతి కుటుంబాలు కుదేలవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు.
యూపీఏ ప్రభుత్వ చర్యలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ‘‘దేశ వాణిజ్యలోటు 2005లో 20 బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో దేశీయ రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. దీని కారణంగా ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా పెరగకపోయినా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఆ భారం ప్రజలపై మోపుతున్నారు’’ అని మండిపడ్డారు. 2008 జూలై 4న ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 140 డాలర్లుగా ఉంటే ఇప్పుడది కేవలం 97 డాలర్లుగా ఉందని, 43 డాలర్లు తగ్గినప్పటికీ యూపీఏ ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. దీనికంతటికీ కారణం యూపీఏ పాలకుల విధానాల వైఫల్యమేనన్నారు. వారి తప్పుడు విధానాల వల్ల జీడీపీ వృద్ధిరేటు 5 శాతం పడిపోయిందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంలో పడుతుందన్నారు. పాలన చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలని సోమయాజులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్లు ప్రజలకు పంచాలి
డీజిల్ ధరల పెంపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అప్పనంగా వచ్చి చేకూరుతున్న రూ.500 కోట్లను ప్రజలకు తిరిగివ్వాలని సోమయాజులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కష్టం లేకుండా డీజిల్‌పై 23 శాతం వ్యాట్ రూపంలో రూ.500 కోట్లు వచ్చి చేరుతున్నాయని వివరించారు.
నేటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలని, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం దిగివచ్చేంత వరకూ అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తారోకోలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డీజిల్ ధర పెంపు సామాన్యులపై పెను ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తంచేసింది.
కాంగ్రెస్ కు బాసటగా సిబిఐ
|
DISTORTION OF NEWS ON JAGAN CASE BACKFIRES ON THEM
They have played up selected leaks repeatedly. They have run hours and hours of programmes loaded with Goebbelsian propaganda. They have tried to tar him black over and over again.
The propaganda against YSRCP president Y.S. Jagan Mohan Reddy has no parallel in the history of this nation's politics. These channels, described as Chandrababu's cronies in the media, proclaimed to the world that the CBI is an independent body and that it is doing its job uncompromisingly well. The CBI Joint Director, Lakshminarayana and his team were the blue-eyed boys of these channels and the publications from their stable.
That was when the CBI began its 'impartial' probe in the eyes of this section of the media leading to Jagan's arrest on May 27, 2012. The investigating agency was hailed for its objectivity and fearlessness and its officers were patted on their backs for their probity and integrity. These channels and publications left no stone unturned to criticize the YSRC Party president and hail the CBI as a torch-bearer of truth and justice. Never mind the fact that the CBI says it doesn't have the human resources to probe a scam! Never mind the fact that the 'premier' investigating agency files 'closure reports' in tune with political changes! Never mind that apart from two ministers no other cabinet minister has been charged in the 26 GOs that are being probed, while Jagan, who was neither an MP nor an MLA and against whom no charge has so far been substantiated has been summarily arrested and jailed!
Cut to late August and early September. Jagan continues to be in prison with the CBI filing four charge-sheets so far against him. The fact that his party had swept the June by-polls and is headed for a landslide win in 2014 has left his political opponents rattled. Their media cronies are not far behind. The very same channels have started criticizing the CBI in television show after show. They have a new conspiracy theory—these channels which had all along supported the Congress in its politics of vengeance and vendetta, now claim that the Congress party had reached a `secret pact’ with Jagan!
When the YSR Congress party criticized the CBI saying that the investigating agency had become a puppet and tool in the hands of the government to keep its minority government in power, these channels had their own tale to tell and preached to us the dictum that 'the law would take its own course'.
Now these channels and publications smell a rat in everything—in the change of government counsel, which is perceived by legal sources as a routine matter with nothing irregular about it.
When the government replaced CBI counsel Additional Solicitor-General Haren Rawal and lawyer Ashok Bhan with a senior lawyer and Additional Solicitor-General, Mohan Jain, this was provocation enough for the yellow media to fly hammer and tongs at the CBI and the government. It came up with a fresh conspiracy theory saying that the central government was trying to dilute the case against Jagan. The TDP expectedly, was not far behind and reacted along predictable lines.
If anything can be inferred at all, it is the fact that the CBI has been leaking stories selectively to representatives from the yellow media and each time Jagan's case comes up for hearing, it reveals some false information and data to them.For the past one month such leaks have been appearing in a section of the media.

The public at large knows by now, where they emanate from, how they find their way to certain chosen 'representatives' of the yellow media and how they are aired ad nauseam!
-siva@sakshipost
-siva@sakshipost
POST YOUR COM
ఆగర్భ శ్రీమంతుడు!
|
'డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలి'
పెంచిన డీజిల్ ధరలను కేంద్రం తక్షణమే తగ్గించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గ్యాస్‌పై నియంత్రణ ఎత్తేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ఈ దుస్థితి తలెత్తిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు సోమయాజులు అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ 2008 నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర 48 డాలర్లు తగ్గినా డీజిల్ ధర ఎందుకు పెరిగిందని ప్రశ్నిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ మరింత కుప్పకూలే ప్రమాదం ఉందని సోమయాజులు హెచ్చరించారు. డీజిల్ ధర పెంచడంతో రాష్ట్రానికి రూ.500 కోట్లు అదనపు రాబడి వస్తుందన్నారు. వచ్చే అయిదు వందల కోట్లను ప్రజలకే తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సోమయాజులు అన్నారు. విద్యుత్ సంక్షోభంతో నష్టపోతున్న పారిశ్రామికవేత్తల రుణాలను రీషెడ్యూల్ చేయాలన్నారు. విద్యుత్ సమస్యలపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

SC reserves order on Jagan's bail to Sep 28
The bail petition of YSRC party president, YS Jagan Mohan Reddy has been posted to Sep 28 by a Supreme Court bench comprising Justice Aftab Alam and Justice Ranjana Prakash Desai.
The bench said it was yet to study the CBI's counter affidavit in the case. Gopal Subramaniam, former solicitor general of India argued on behalf of the YSRCP president.
The Apex Court questioned the CBI on three counts.
- The need to arrest Jagan when the latter was already co-operating with the investigating agency
- The discrepancies between the figures mentioned in the FIR and those on the charge-sheets that were filed
- The time needed by the CBI to file a supplementary charge-sheet.
Yellow media at it again!
A television channel repeatedly telecast false information with respect to well known evangelist, Brother Anil Kumar, brother-in-law of YSRC party president, YS Jagan Mohan Reddy.
Brother Anil is in Kuwait to hold a series of religious meetings after being permitted to do so by the Government of Kuwait. It was in context that the local police officials called on him.
However, the fallacious report claimed otherwise, alleging that Brother Anil Kumar was taken into custody in Kuwait.
saksipost
'బాబు ఆస్తి వివరాలు పచ్చి అబద్ధాలు'
: దేశంలోనే తానే సచ్ఛీలుడిని అంటూ ఆస్తులు ప్రకటించిన చంద్రబాబు .. తన ఆస్తులపై వచ్చిన ఆరోపణలకు కోర్టు కేసులకు ఎందుకు భయపడుతున్నారని వివిధ పక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నీతి వ్యాఖ్యలు చేస్తోన్న చంద్రబాబు... వైఎస్ విజయమ్మ వేసిన పిటీషన్‌పై ఎందుకు నానాయాగీ చేశారని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు చెబుతున్న ఆస్తుల వివరాలు పచ్చి అబద్ధమని కోట్లు విలువచేసే వివరాలను ఆయన దాచి పెట్టారని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మి పార్వతి అన్నారు. బాబు ఎంత నీతిమంతుడో ప్రజలందరికీ తెలుసునని సీనియర్ ఎనలిస్ట్ సీతారామరాజు , కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లిమిల్లి శేషారెడ్డి ఎద్దేవా చేశారు.

సీబీఐది అత్యుత్సాహం: గట్టు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్, టీడీపీ కన్నుసన్నల్లో పనిచేస్తోందని విమర్శించారు. న్యాయ స్థానాలపై తమకు నమ్మకం ఉందని, కుట్రపూరిత ప్రచారాలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ శవంలా తయారైందని గట్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ పగ్గాలను కనీసం నందమూరి వంశానికైనా అప్పగించాలని ఆయన సూచించారు. ఎల్లో మీడియాకు ప్రజా సమస్యలు పట్టడం లేదని గట్టు ధ్వజమెత్తారు.

జగన్ బెయిల్ పై విచారణ వాయిదా
|
బ్రదర్ అనిల్ పై ఎల్లో మీడియా విషప్రచారం
కువైట్ లో బ్రదర్ అనిల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారానికి దిగింది. బ్రదర్ అనిల్ కుమార్ సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కూడా. స్థానిక పరిస్థితులు, విధుల్లో భాగంగానే పోలీసులు అనిల్ కుమార్‌ను కలుసుకున్నారు. అయితే దీన్ని వక్రీకరించి ఎల్లో మీడియా బ్రదర్ అనిల్ కుమార్‌పై విషం చిమ్మింది. అనుమతి లేకుండా ఆయన మతప్రచారం చేస్తున్నారంటూ, కువైట్ పోలీసులు బ్రదర్ అనిల్ ను అదుపులోకి తీసుకున్నారంటూ అసత్య వార్తలను ప్రసారం చేసింది.
Thursday, 13 September 2012
బాబు ఆస్తులు తగ్గాయట!
తమ కుటుంబ ఆస్తులు తగ్గినట్లు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో తనకు రూ.39.88 లక్షల ఆస్తి ఉండగా.. ఈ ఏడాది మార్చికల్లా అది రూ.31.97 లక్షలకు తగ్గిందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరిట రూ.41,74,82,000 ఆస్తి, రూ.17, 21,99,000 అప్పు, కుమారుడు లోకేష్ పేరిట రూ.8,82,67,000 ఆస్తి, రూ.2,20,20,000 అప్పు ఉంది. కాగా కోడలు నారా బ్రహ్మణి పేరిట రూ.2,09,91,000 ఆస్తి ఉంది.
చంద్రబాబు కుటుంబం నిర్వహించే నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ.21,36,25,000 ఆస్తి, రూ.19,34,27,000 అప్పు ఉన్నాయి. ఈ వివరాలన్నీ ఈ ఏడాది మార్చి 31 నాటివని బాబు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏర్పాటు చేసిన నైతిక విలువల కమిటీ చేసిన సూచన మేరకు ప్రతి సంవత్సరం తనతో పాటు, తన సతీమణి ఆస్తుల వివరాలను శాసనసభ సచివాలయానికి అందజేస్తున్నామని, గ త ఏడాది నుంచి కుమారుడు, కోడళ్లను కూడా ఆస్తులు ప్రకటించాల్సిందిగా కోరానని, వారు అంగీకరించటంతో అవి కూడా వెల్లడి స్తున్నానని చెప్పారు.

చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై మండిపడ్డ జూపూడి
- సంతకం లేకుండా చేసిన ఆ ప్రకటన తప్పుల తడక
- ఆస్తులపై అన్నా టీంతో విచారణకు సిద్ధమా?
- బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు ఎందుకు దాచారు?
- లోకేష్ ఏం వ్యాపారం చేస్తున్నారు?
- ఆయన చదువే బినామీ డబ్బుతో కదా!
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిపక్ష నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు ఎవరిని మోసం చేయడానికి తన ఆస్తులను ప్రకటించారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ అబద్ధాలకూ, అపనమ్మకానికీ కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు తన ఆస్తుల పేరుతో సంతకం లేకుండా చేసిన ప్రకటన అంతా అబద్ధాల పుట్ట, తప్పులతడకేనన్నారు.
బినామీ పేర్లతో ఉన్న ఆస్తులన్నింటినీ బాబు దాచిపెట్టి తన ఆస్తులు చాలా తక్కువ అని చూపే యత్నం చేశారని విమర్శించారు. అసలు తన ఆస్తులపై అన్నా హజారేతోనూ, అరవింద్ కేజ్రీవాల్‌తోనూ విచారణ జరిపించుకోవడానికి చంద్రబాబు సిద్ధమేనా? అని జూపూడి సవాలు విసిరారు. గత ఏడాది సెప్టెంబర్ 2న వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున బాబు ఇదే విధంగా తప్పులతో కూడిన తన ఆస్తుల వివరాలను ప్రకటించారని, ఇపుడు కూడా అదే విధంగా ఎవరూ అడక్కుండానే ప్రకటించారని ఎద్దేవా చేశారు.
ఆస్తులు ఎలా తగ్గాయి?
‘‘గత ఏడాది బాబు తన ఆస్తులను 39 లక్షల రూపాయలన్నారు. ఇపుడేమో అవి రూ. 31.97 లక్షలన్నారు. రూ.7 లక్షలు ఎలా తగ్గాయి? ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులు అప్పట్లో రూ. 39 కోట్లని ప్రకటించారు. ఇపుడు 24.52 కోట్లు అంటున్నారు. లోకేష్ బాబు ఆస్తులు అప్పుడు 2.82 కోట్లు అన్నారు. ఇప్పుడు 2.62 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే ఈ ఆస్తులు ఎలా తగ్గాయి?’’ అని జూపూడి ప్రశ్నించారు.
‘‘ఆస్తులు తగ్గుతున్నాయంటే మేం విశ్వసిస్తాం... ఎందుకంటే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల్లో ప్రజాభిమానం అనే ఆస్తి క్రమంగా తగ్గుతోందనేది రుజువవుతోంది. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నపుడు 45 శాతం ఓట్లు ఉండేవి. ఇపుడు బాబు హయాంలో 18 శాతానికి తగ్గి పోయాయి. ప్రజాభిమానంలాగే ఆస్తులూ తగ్గుతున్నాయంటే మేం అంగీకరిస్తాం’’ అని జూపూడి ఎద్దేవా చేశారు.
రూ. 2 వేల కోట్లని తెహల్కా చెప్పింది: ‘‘బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాబు ఆస్తులు 2000 కోట్ల రూపాయలని తెహల్కా డాట్‌కామ్ ప్రకటించింది. అయితే ఆ సమయంలో బాబు ప్రకటించిన వివరాలు వేరుగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ముందు ప్రకటించిన ఆస్తులకు, గత ఏడాది, ప్రస్తుత ఏడాది ప్రకటించిన ఆస్తులకు తేడాలున్నాయి.. వాటిపై బాబు ఏమంటారు?’’ అని జూపూడి మండిపడ్డారు. గతంలో బాబు ప్రకటించిన ఆస్తుల వివరాలు తెలిపే ప్రతులను ఆయన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ‘‘లోకేష్ చేస్తున్న వ్యాపారం ఏమిటి? ఒక నిరుద్యోగి పేరుతో ఆస్తులెలా వచ్చాయి? ఆయన చదివిందే బినామీ డబ్బుతోనన్న ఆరోపణలున్నాయి. ఆయనకు ఎవరు పెట్టుబడి పెట్టారు? అనే వివరాలు ఎందుకు బయట పెట్టరు?’’ అని ప్రశ్నించారు. బాబు ప్రకటించిన ఆస్తులను ఆయన ఇంటివాళ్లే నమ్మడం లేదని, చివరకు టీడీపీ నాయకులు, పార్టీ కార్యాలయంలో పనిచేసే ప్యూన్లు కూడా నమ్మడం లేదన్నారు.
బాబుకు నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో ఉన్న 362 ఎకరాల మాటేమిటి? వాటిని ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. ప్రజాపోరు పేరుతో బాబు తలపెట్టిన పాదయాత్రకు ముందు బాబు అబద్ధాల యాత్ర చేపట్టారని జూపూడి వ్యాఖ్యానించారు. వైఎస్‌లాగా పాద యాత్ర చేస్తానని చల్లని వాతావరణంలో వెళుతున్న బాబును రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. పార్టీని వదలి అందరూ వెళ్లిపోతుంటే దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు పాదయాత్రకు వెళ్లి పార్టీని బతికించుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు.

16న వైఎస్సార్ సీఎల్పీ సమావేశం
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా 16వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. విద్యుత్ సంక్షోభం, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకంపై పరిమితుల విధింపు, విషజ్వరాలు వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో ప్రజాపక్షంగా శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు చర్చిస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా దీనికి హాజరవుతారు.
డీజిల్ ధర పెంపు, గ్యాస్‌పై ఆంక్షలతో రాష్ట్ర ప్రజలపై రూ. 9,200 కోట్ల భారం
కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను పెంచటం.. సమాజంలోని అన్ని రంగాలపై పెను ప్రభావం చూపనుంది. సామాన్యుడి బతుకు మరింత దుర్భరం కానుంది. రైతు నడ్డి ఇంకా విరగనుంది. పరిశ్రమలు మరింతగా కుంగిపోనున్నాయి. పప్పూ ఉప్పుల ధరలన్నీ భగ్గున మండనున్నాయి. పాలు, కూరగాయల ధరలూ చుక్కలను దాటనున్నాయి. బస్సు ప్రయాణం మరింత భారం కానుంది. వెరసి సగటు కుటుంబంపై నెలకు రూ. 750 వరకూ అదనపు భారం పడనుంది. ఇక వంట గ్యాస్ సిలిండర్ల వినియోగంపై ఆంక్షలను కూడా లెక్కవేస్తే.. దాదాపు కోటి కుటుంబాలపై నెలకు రూ. 2,250 వరకూ భారం పడుతుంది. మరోవైపు.. ఈ మొత్తం వ్యవహారంలో ‘నిమిత్తమాత్ర’మైన రాష్ట్ర సర్కారు ఖజానా మాత్రం గలగలా నిండనుంది! డీజిల్ ధర పెంపు వల్ల ప్రజలపై రూ. 9,200 కోట్ల భారం పడుతోంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం రూ. 1,200 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది!
- న్యూస్‌లైన్, హైదరాబాద్
డీజిల్ ధరల పెరుగుదలతో.. ఇప్పటికే కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలు 10 నుంచి 16 శాతం వరకూ పెరగనున్నాయి. కాయగూరల ధరల 5 నుంచి 12 శాతం పెరుగుతాయి. రవాణా చార్జీలతో పాటు ప్రయాణికుల చార్జీలు కూడా 10 నుంచి 15 శాతం పెరుగుతాయి. కరెంట్ కోతలతో అల్లాడుతున్న పారిశ్రామిక వర్గంతో పాటు డీజిల్ ఇంజన్లు వినియోగిస్తున్న రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే అప్పుల వేటలో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ)కి డీజిల్ ధరల పెరుగుదల పెను భారం కానున్నది. వీలైనంత వెంటనే ప్రయాణికుల చార్జీలు పెంచేందుకు ఆర్‌టీసీ కసరత్తు మొదలుపెట్టింది.
పెరిగిన డీజిల్ ధర వల్ల రూ. 340 కోట్ల అదనపు భారం పడుతుందని సంస్థ అంచనా వేసింది. డీజిల్ ధర పెంపుదల ఫలితంగానే ఒక్కో కుటుంబంపై నెలకు రూ. 400 నుంచి రూ. 750 దాకా భారం పడే అవకాశం ఉంది. సంవత్సరానికి ఆరు కంటే ఎక్కువ సిలిండర్లు వాడే కుటుంబాలపై భారం రూ. 750 నుంచి రూ. 2,250 వరకూ ఉంటుంది. రాష్ట్రంలో కోటీ 60 లక్షల కుటుంబాలు గ్యాస్‌ను వినియోగిస్తుండగా, వారిలో 39 లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు. మిగిలిన 1.21 కోట్ల కుటుంబాల్లో 86 లక్షల కుటుంబాలు ఏటా 8 నుంచి 12 సిలిండర్లు వాడుతున్నాయి. వెరసి డీజిల్ ధర పెరుగుదల, గ్యాస్ సిలిండర్ల వాడకంపై ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ. 9,200 కోట్ల మేర భారం పడుతుందని ఆర్థిక, వాణిజ్య రంగాల నిపుణులు అంచనా వేశారు.
అన్నదాతలపై ఏటా రూ. 1,100 కోట్ల అదనపు భారం
వర్షాభావం, కరెంటు కోతలతో అష్టకష్టాలు పడుతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఇప్పటికే ఎరువుల ధరలు అమాంతంగా పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఇప్పుడు డీజిల్ ధరలు పెరగటంతో అన్నదాతలు బెంబేలెత్తిపోతున్నారు. సాగు అంటేనే భయపడుతున్నారు. వర్షాభావ ప్రాంతాల రైతులకు సబ్సిడీపై డీజిల్ సరఫరా చేస్తామని రెండు నెలల కిందట ప్రకటించిన కేంద్రం ఈ హామీని అటకెక్కించింది.
ఇప్పుడు డీజిల్ ధరల పెంపు రూపంలో రాష్ట్ర రైతులపై అదనంగా రూ. 1,100 కోట్ల భారం వేసింది. కూలీల కొరతతో సాగు పనులన్నీ ట్రాక్టర్లతోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 80 శాతం మంది రైతులు సాగు పనుల కోసం ట్రాక్టర్లనే వినియోగిస్తున్నారు. పెద్ద రైతులు సొంత ట్రాక్టర్లతో పనులు చేసుకుంటుండగా చిన్న, సన్నకారు రైతులు సైతం అదనులో అద్దెపై దుక్కులు చేస్తున్నారు. వరి నాట్లు, వరి కోతలకూ ఇలాగే చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోస్తాలో నెలాఖరు వరకు నాట్లు వేసే పరిస్థితి ఉన్నందున ఖరీఫ్‌లో 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 50 లక్షల ఎకరాల్లో వరి కోతలు యంత్రాల సహాయంతోనే జరిగే అవకాశం ఉంది. గత రబీలో ఎకరా వరి కోతకు ప్రాంతాన్ని బట్టి రూ. 1,500 - 1,700 ఉంది. వరి కోత కోసం భూమి రకాన్ని బట్టి గరిష్టంగా 12 లీటర్లు వినియోగమవుతుంది. ఎగబాకిన డీజిల్, ఇతర ఆయిల్స్ ధరలతో నిర్వహణ ఖర్చులు పెరిగి వరి కోత అద్దె రూ. 2,000 కు కూడా పెరగవచ్చని వరి కోత యంత్రం యజమానులు చెప్తున్నారు.
పెరిగే అద్దె ధరల ప్రకారం చూస్తే ఖరీఫ్ వరి కోతలకే రాష్ట్ర రైతులపై ఏకంగా రూ. 150 కోట్ల అదనపు భారం పడనుంది. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం తగ్గినందున వచ్చే రబీలోనూ 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. కోటి ఎకరాలకు ట్రాక్టర్లనే వినియోగించే అవకాశం ఉంది. ఈ విస్తీర్ణంలో ట్రాక్టర్లతో కనీసం రెండు సార్లు దుక్కి దున్నాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెట్ట భూములను రెండుసార్లు(ఇరువాయి) దున్నేందుకు కనీసం ఎకరాకు రూ. 1,000 బాడుగ ఉంది. పెరిగిన డీజిల్ ఖర్చుల కారణంగా ఇప్పుడు ఇది రూ. 1,200 కానుంది. నాట్లు వేసే పొలం దున్నేందుకు డీజిల్ వినియోగం ఎక్కువ అవుతుంది. దీంతో ఎకరా పొలం దున్నేందుకు రూ. 1,600 అద్దె ఉంది. ఇప్పుడు ఇది రూ. 1,800 అయ్యే అకాశం ఉందని అంచనా. ఇలా పెరిగిన దుక్కుల అద్దె ఖర్చుల రూపంలో ఒక్క రబీ సీజనులోనే రైతులపై రూ. 400 కోట్ల అదనపు భారం పడనుంది.
అనుబంధ రంగాలపైనా అదే భారం...
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. కలుపు నివారణ కోసం నెలకు ఒకసారి అయినా తోటలను దున్నించాల్సి ఉంటుంది. దుక్కుల ఖర్చు రూపంలో ఇప్పుడు ఉద్యాన పంటల రైతులపై ఏటా అదనంగా రూ. 480 కోట్ల భారం పడే పరిస్థితి ఉంది. వర్షాభావం, విపరీతమైన కరెంట్ కోతలతో నీటి వనరులు ఉన్న రైతులు పంటలను కాపాడుకునేందుకు డీజిల్ ఇంజన్లపై ఆధారపడుతున్నారు.
వరి పంట పొట్ట దశకు చేరుకోవడంతో డీజిల్ వినియోగం పెరగడంతో పాటు ధరలు ఎగబాకడంతో రాష్ట్ర రైతులపై అదనంగా కనీసం రూ. 20 కోట్ల భారం పడనుంది. అలాగే పాడి రైతులను కరెంటు కోతలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పాడిపశువులకు నీళ్లు పెట్టేంత సేపు కూడా కరెంటు ఉండటంలేదు. జనరేటర్లతోనే నీళ్లు పెట్టడం, దాణా కలపడం, పాలు పితకడం జరుగుతోంది. పౌల్ట్రీ పరిశ్రమదీ ఇదే పరిస్థితి. డీజిల్ ధర పెంపుతో ఈ రెండు రంగాల రైతులపై కనీసం రూ. 50 కోట్ల అదనపు భారం పడుతుందని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులే చెప్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ గల్లా గలగల..
డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రాష్ట్ర ప్రజలపై రమారమి రూ. 9,200 కోట్ల రూపాయల భారం పడుతుండగా.. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 1,198 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతుంది. నిత్యావసర వస్తువులతో పాటు ఇతర ధరల పెరుగుదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపేణా ఏటా రూ. 600 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుంది.
ఇది కాకుండా డీజిల్ ధర పెరుగుదల వల్ల మరో రూ. 598 కోట్ల ఆదాయం వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేశారు. తాజా ధర పెంపుతో ప్రతి లీటరు డీజిల్‌పై వ్యాట్ రూపేణా వాణిజ్య పన్నుల శాఖకు 91 పైసల అదనపు రాబడి రానుంది. లీటరుపై మొత్తం వ్యాట్ రాబడి అక్షరాలా రూ. 9.10. అనగా లీటరు డీజిల్‌ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ. 50కి విక్రయిస్తే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను రూపేణా వసూలు చేసేది అక్షరాలా రూ. 9.10. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 54 కోట్ల లీటర్ల డీజిల్ అమ్ముడవుతోంది. దీని ద్వారా వ్యాట్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నెలసరి రాబడి రూ. 490.40 కోట్లు. వార్షికంగా చూస్తే రూ. 5,888 కోట్ల పైమాటే. తాజా ధర పెంపు వల్ల ఏటా వచ్చే అదనపు వ్యాట్ రాబడి రూ. 589.68 కోట్లు కావడం గమనార్హం.
పరిశ్రమలపై పెనుభారం..
పరిశ్రమల వద్ద ప్రస్తుతం 1,000 మెగావాట్ల సామర్థ్యం (రోజుకు 24 మిలియన్ యూనిట్లు) కలిగిన డీజిల్ ఇంజన్ సెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, పరిశ్రమలు రోజు మొత్తం డీజిల్ ఇంజన్ సెట్లను వినియోగించవు. రోజులో 10 నుంచి 12 గంటల మేర వినియోగిస్తాయి. అంటే రోజుకు 12 మిలియన్ యూనిట్ల (120 లక్షల యూనిట్లు) విద్యుత్‌ను డీజిల్ ఇంజన్ సెట్ల ద్వారా ఉత్పత్తి చేసుకుని పరిశ్రమలు వినియోగిస్తాయన్నమాట. ఒక లీటరు డీజిల్ ద్వారా 3 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
ఒక్కో యూనిట్‌కు 3 లీటర్ల డీజిల్ చొప్పున.. 120 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 40 లక్షల లీటర్ల డీజిల్‌ను పరిశ్రమలు వినియోగిస్తాయన్నమాట. లీటరుకు ఐదు రూపాయల చొప్పున అదనపు భారం లెక్కిస్తే.. పరిశ్రమలపై తాజా ధరల పెంపు వల్ల రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున అదనపు భారం పడుతుంది.
అంటే నెలకు రూ. 60 కోట్లు.. ఏడాదికి రూ. 720 కోట్ల భారం ఒక్క పరిశ్రమలపైనా అదనంగా పడనుంది. డీజిల్ ధరల తాజా పెంపు దినపత్రికలపై కూడా భారీగానే పడింది. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యుత్ కోతల వల్ల ఒక దినపత్రిక సగటున నెలకు 63 లక్షల లీటర్ల డీజిల్‌ను అదనంగా వినియోగించాల్సి వస్తోందని అంచనా. అంటే తాజా పెంపుదల వల్ల లీటరుకు 5 రూపాయల చొప్పున లెక్కిస్తే.. ఒక్క దినపత్రికపైనే నెలకు 3.15 కోట్ల అదనపు భారం పడిందన్నమాట.
నిత్యావసరాలు ఇక నింగికే..
డీజిల్ ధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక, వాణిజ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ భారంతో బియ్యం, ఉప్పు, పప్పు మొదలు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. వీటి ధరల పెరుగుదల కనిష్టంగా 10 శాతం, గరిష్టంగా 16 శాతం ఉంటుందని వాణిజ్య, వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ధరల పెరుగుదల ప్రభావం రెండు మూడు రోజుల్లోనే కనిపిస్తుందని ఆ వర్గాలు చెప్పాయి. కాయగూరల ధరలు 5 నుంచి 12 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పేదలకు భారంగా మారిన పాల ధర ఏడు శాతం పెరుగొచ్చని అంచనా.
యూపీఏ నుంచి తప్పుకోగలిగితే సంతోషించేదాన్ని
ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న యూపీఏ ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడే తప్పుకోగలిగి ఉంటే సంతోషించేదాన్ని. డీజి ల్ ధరల పెంపుపై నిరాశ చెందాను. నేను మద్దతు ఉపసంహరించుకుంటే, యూపీఏకు మద్దతు ఇచ్చేందుకు ఇతరులు ముందుకొస్తారు. యూపీఏ సమన్వయ కమిటీ అనేది ఒకటి ఏర్పాటయ్యాక కూడా మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ధరల పెంపు ను వ్యతిరేకిస్తూ శనివారం కోల్‌కతాలో జరిగే ర్యాలీలో నేను పాల్గొంటాను. - మమతాబెనర్జీ,పశ్చిమ బెంగాల్ సీఎం
పెట్రోలు మాఫియాతో కేంద్రం కుమ్మక్కు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం, వంటగ్యాస్ సిలిండర్లకు కోత పెట్టడం చూస్తుంటే, పెట్రోల్ మాఫియాతో యూపీఏ సర్కారు కుమ్మక్కైనట్లు కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే తగిన వర్షాలు లేవు. డీజిల్ ధరల పెంపు వల్ల రైతులు మరిన్ని ఇక్కట్లు పడతారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తాం.
-ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, బీజేపీ ఉపాధ్యక్షుడు, నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి, యశ్వంత్ సిన్హా, బీజేపీ నేత
డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. సబ్సిడీపై అందజేస్తున్న వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను పరిమితం చేయడం సరికాదు. ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలి. డీజిల్ ధరల పెంపు ద్వారా ప్రజలపై కేంద్రం మోయలేని భారం మోపింది. అధికారంలోకొస్తే.. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం 25 విడతలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. డీజిల్ ధరలను తగ్గించనిపక్షంలో ఆందోళన చేస్తాం.
- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం
ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం.దీనివల్ల ఇప్పటికే నింగినంటిన నిత్యావసరాల ధరలు మరింతగా పెరుగుతాయి. సామాన్యుడి కష్టాలు మరింతగా పెరుగుతాయి.
- డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి
ప్రజలంతా వ్యతిరేకించాలి
దీనివల్ల మధ్యతరగతి ప్రజల కష్టాలు మరింతగా పెరుగుతాయి. ప్రజలంతా దీనిని వ్యతిరేకించాలి.
- బిమన్ బోస్, లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మన్
ఈ నిర్ణయం ఇబ్బందికరమైనదే..
ఈ నిర్ణయం ఇబ్బందికరమైనదే. దీనికి మేం అనుకూలం కాదు. ఈ అంశంపై యూపీఏ భాగస్వామ్య పార్టీలన్నింటినీ విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సింది. యూపీఏ సమన్వయ కమిటీలో చర్చించి ఉండాల్సింది. దీనివల్ల రైతులపై, సామాన్యులపై భారం పడే మాట వాస్తవమే. యూపీఏ ప్రభుత్వం సామాన్యుడికి ప్రయోజనం కలిగించే అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే, కొన్ని ఇబ్బందికరమైన నిర్ణయాలూ తీసుకుంది.
- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ముఖ్యమంత్రికి విజయమ్మ లేఖ
* విద్యుత్ కోతలతో ప్రమాదపుటంచున ఉన్నాయి * లక్ష పరిశ్రమలు మూసివేతకు దగ్గరపడుతున్నాయి * పది లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు * ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి దాపురించింది *ఈ పరిశ్రమల రుణాలను రీషెడ్యూలు చేయాలి * కరెంటును పునరుద్ధరించే వరకూ రుణాలపై వడ్డీ రద్దు చేయాలి * సమస్యలపై కేంద్రం వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి * డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం, సీవీడీలను రద్దు చేయాలని కోరాలి * అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ పరిశ్రమల పరిస్థితిపై చర్చించాలి * సీఎంకు రాసిన లేఖలో విజయమ్మ విజ్ఞప్తులు, సూచనలు హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ కోతల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని, లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోకుండా నివారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ రంగాన్ని ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలను రీషెడ్యూలింగ్ చేయాలని, వడ్డీని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కోరారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరుతూ విజయమ్మ గురువారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది... ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి, విద్యుత్ సంక్షోభం వల్ల రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే సుమారు 20 లక్షల మంది కార్మికుల అనూహ్యమైన దయనీయ స్థితిని మీ దృష్టికి తీసుకువచ్చేందుకు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ లేఖ రాస్తున్నాను. ఈ పరిశ్రమల్లో లక్ష యూనిట్లు తక్షణం మూతపడే ప్రమాదంలో ఉన్నాయి. అదే జరిగితే వాటిలోని పది లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. తమ సమస్యలను ప్రభుత్వం, మీడియా దృష్టికి తీసుకువెళ్లే వనరులు కానీ శక్తి కానీ ఈ చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి లేదు. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో, ఆదాయ ఉత్పత్తిలో ఎంతో కీలక పాత్ర పోషించే ఈ పరిశ్రమల గోడును వినిపించుకోవాల్సిన బాధ్యత.. ప్రజా ప్రతినిధులుగా మనపైన ఉంది. విద్యుత్‌ను సరఫరా చేయటంలో ప్రభుత్వ ైవె ఫల్యం కారణంగా ఇలాంటి పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి రావటం విషాదకరం. కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి గత రెండేళ్లుగా తగ్గుతూ వస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. గత నాలుగేళ్లుగా దేశీయ బొగ్గు ఉత్పత్తికీ డిమాండ్‌కూ మధ్య వ్యత్యాసం పెరుగుతోందనే విషయం కూడా తెలుసు. జల విద్యుత్ ఉత్పాదనకు తీవ్ర విఘాతం కలించే విధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితిని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి ఉండాల్సింది. ఈమూడింటిని దృష్టిలో ఉంచుకుని పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఉండాల్సింది. ఒక ప్రభుత్వంగా పరిపాలన అంటే అర్థం అదే. ప్రభుత్వం అలాంటిదేమీ చేయకుండా రాష్ట్ర ప్రజలను వారి మానాన వారిని వదలి వేసింది. అధికారిక, అనధికారిక విద్యుత్ కోతల వల్ల క్రమంగా సంక్షోభంలో చిక్కుకుంటూ వచ్చిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం ఆదుకునేందుకు ప్రయత్నించకుండా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వాణిజ్య, ప్రభుత్వ బ్యాంకులు ఈ రంగానికి రుణాలు ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపకపోవడం వల్ల ఇప్పటికే ఈ రంగం బాగా దెబ్బతిన్నది. ఉపాధి కల్పించడానికి ఈ రంగం తక్కువ పెట్టుబడులే ఆశిస్తున్నప్పటికీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏ మాత్రం ప్రయోజనకారి కాదనే ఉద్దేశ్యంతో బ్యాంకులు భారీ పరిశ్రమల వైపే మొగ్గు చూపుతున్నాయి. పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి నానా రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, బడా పారిశ్రామిక వేత్తల విషయంలో బ్యాంకులు, ప్రభుత్వాలు కలిసి రుణాలకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చర్యలు తీసుకోవడంతో పాటుగా రుణాల మాఫీ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. అదే విధమైన చర్యలను చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో మాత్రం తీసుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే ఈ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇలాంటి ఆలోచనలు చేయడం లేదు. ఈ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగంలో తలెత్తబోయే తీవ్ర ఇబ్బందులను నివారించడానికిగాను వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఈ అంశాలన్నింటిని రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకురావాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యుత్ సరఫరాలో కోతల వల్ల ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఈ కింది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి రెండింట్లోనూ తీర్మానాలు చేయాలని సూచిస్తున్నాను. ఎ) ఈ రంగంలోని పరిశ్రమలకు ఈ రోజు వరకూ ఇచ్చిన అన్ని రకాల రుణాలను కనీసం రెండు త్రైమాసికాల వరకూ వాయిదా వేస్తూ రీషెడ్యూలింగ్ చేయాలి. ఇలా వాయిదా వేసిన రుణాలకు కనీసం ఏడాది వరకూ వడ్డీ వసూలు చేయరాదు. బి) విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో సరఫరా చేసే వరకూ ఇప్పటికే ఉన్న బకాయీలపై వడ్డీ రద్దు చేయాలి. ఈ పరిశ్రమలు ఉత్పాదన కోసం వినియోగించే డీజిల్‌పై ఎక్సయిజ్ డ్యూటీ, సీవీడీని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తరఫున విజ్ఞప్తి చేయాలి. వీరి సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చ ర్చించి పరిష్కరించడానికి ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకు వెళ్లాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ రంగానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నాను. విద్యుత్‌పై మినిమమ్ డిమాండ్ చార్జీలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రంగంలో ఆయా పరిశ్రమలు సొంతంగా విద్యుత్ ఉత్పాదన కోసం వాడే డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను మినహాయించాలని కూడా కోరుతున్నాను’’. ఇట్లు వైఎస్ విజయమ్మ |
Subscribe to:
Posts (Atom)